పోలవరం పురో గతి, పెట్టిన ఖర్చు తదితర పూర్తి వివరాలన్నీ http://polavaram.apegov.com/ispp/home# వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.... పోలవరం వివరాలు ఏ వెబ్ సైట్ లోనూ దొరకలేదని బీజేపీ నాయకులతో పాటు, కొంత మంది హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రా రాజకీయాలు చేస్తున్న వారు, ఈ వెబ్సైటు లో అన్ని వివరాలు చూసుకోవచ్చు... ఆ రిపోర్ట్ లు అన్నీ చూసి, తీర్పు ఇవ్వండి, ఎవరిది తప్పో ఒప్పో... ఇంత పారదర్శకంగా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టి, పనులు చేస్తుంటే, చేత కాని వారు, పనిలేని వారు, విమర్శలు చేస్తూ ఉంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీరికి సమాధానం చెప్తున్నా, విషయం అర్ధం కాని వారు, అలాగే విషయాన్ని తప్పుదోవ పట్టించే వారు, డయాఫ్రం వాల్ అంటే ఎక్కడ చూపించండి నాకు కనపడటం లేదు అనే వారు, చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు...
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వం రూ. 7779 కోట్లు వెచ్చింది... కేంద్రం రూ. 4932 కోట్లు ఇచ్చింది... మరో రూ. 2847 కోట్లు రావాల్సి ఉంది... భూ సేకరణ, పునరావాసం బిల్లులను కేంద్రానికి పంపగా, నాబార్డు ద్వారా ఆ నిధులను విడుదల చేయాల్సి ఉంది.... పోలవరం వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి.. ప్రతి అధికారి ఫోన్ నంబర్లు కూడా వెబ్ సైట్ లో క్లియర్ గా ఉన్నాయి.. దేశంలో ఇంత ట్రాన్స్ పరెంట్ గా జరిగే ప్రాజెక్టు ఎక్కడా లేదు... ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు తెలియాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష..
సీఎం చంద్రబాబు ప్రతివారం పోలవరం పనులు పర్యవేక్షిస్తున్నారు... పదేళ్లు, ముగ్గురు ముఖ్యమంత్రులు పోలవరం ముంపు గ్రామాలను ఖాళీ చేయించలేకపోయారు... చంద్రబాబు వచ్చిన తరువాతే నిర్వాసితులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి... ఇప్పటి వరకు 53% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి... పోలవరం ప్రాజెక్టు గత వారం నుంచి ఫిబ్రవరి 11 వ తేదీ వరకు పూర్తయిన పనుల వివరాలు... తవ్వకం పనులు 0.10 లక్షల క్యూబిక్ మీటర్లు... మొత్తం పూర్తియిన పనులు 775 లక్షల క్యూబిక్ మీటర్లు... పూర్తి చేయాల్సినది:296 లక్షల క్యూబిక్ మీటర్లు... కాంక్రీట్, స్పిల్వే స్టిల్లింగ్ బేసిన్: 3876 క్యూబిక్ మీటర్లు.... మొత్తం పూర్తియిన తవ్వకం 5.01 లక్షల క్యూబిక్ మీటర్లు... మిగిలిన తవ్వకం పనులు 30.13 లక్షల క్యూబిక్ మీటర్లు... థ్రస్ట్ బ్లాక్స్ సంఖ్య : 10.... ఈవారం దాకా మొత్తం పూర్తయినవి: 80... పూర్తి చేయాల్సినవి: 16... డయాఫ్రం వాల్ నిర్మాణం: 19.6 మీటర్లు... మొత్తం పూర్తయ్యింది 967.6 మీటర్లు... ఇంకా పూర్తి చేయాల్సింది: 459.4 మీటర్లు...