ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి, జగన్ మోహన్ రెడ్డి సియంఓలో మొన్నటి వరకు పని చేసిన పీవీ రమేష్ సోదరుడు అయిన రాజశేఖర్ జోషి అదృశ్యం అవ్వటం, సంచలనంగా మారింది. రాజశేఖర్ జోషి నిన్న రాత్రి రాజమండ్రి నుంచి విజయవాడ క్రీస్తురాజపురంలో ఉన్న తన నివాసానికి వచ్చారు. అయితే రాజశేఖర్ జోషి వచ్చే సమయానికి, ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ జోషి గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ జోషి కనిపించకుండా పోవటం పై, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులే తమ కొడుకుని తీసుకుని వెళ్ళారని, ఆచూకీ చెప్పాలని పోలీసులను డిమాండ్ హ్సుస్తున్నారు. అసలు ఏ కేసులో తీసుకుని వెళ్ళారో తెలియటం లేదని అంటున్నారు. అయితే రాజశేఖర్ జోషి తల్లిదండ్రులు, ఏపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పైన ఆరోపణలు చేస్తున్నారు. పీవీ రమేష్ సోదరిని, సిఐడి సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. తరువాత క్రమంలో సునీల్ పైన గృహ హింస కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కక్షతోనే, తనా కొడుకుని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ వార్త మీడియాలో రావటంతో, ఇప్పుడు పోలీసులు వచ్చి, రాజశేఖర్ జోషికి నోటీసులు ఇవ్వటానికి వచ్చాం అని చెప్పటంతో, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పోలీసులే తీసుకుని వెళ్లి ఇప్పుడు ఈ నాటకాలు ఏంటి అంటూ ఆరోపిస్తున్నారు.
news
రాష్ట్ర ప్రభుత్వం సంచలనం... గనుల శాఖ ఉద్యోగుల పై ఎస్మా ప్రయోగం...
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఒక వైపు చర్చలు జరుపుతూ, మరో వైపు ఎస్మా ప్రయోగానికి తెర లేపుతూ, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్మాకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి దగ్గర, నిన్న అధికారులు, మంత్రులు చర్చించారు. తరువాత చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ , వివిధ శాఖల అధిపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతోనూ నిన్న సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్మా ప్రయోగానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా అత్యవసర శాఖల్లో ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు పైన కూడా దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే కొద్ది సేపటి క్రితం, గనుల శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. సమ్మె , ఇతర ఆందోళన పైన, మైనింగ్ శాఖలో నిషేధం విధించారు. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగులకు ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేసారు. మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు పైన ఆశ్చర్య పోతున్నారు. మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ బయటకు వచ్చిన ఉత్తర్వులను, ఒక పక్క మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు తెలుసుకున్నారు.
బయట ఉన్న ఉద్యోగులు, చర్చల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు, ఎస్మా ఉత్తర్వులు గురించి చెప్పారు. ఒక పక్క చర్చలు జరుపుతూనే, ఎస్మా ప్రయోగించటం ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం తమను బెదిరిస్తుంది అని కూడా, వారికి చెప్తూ, దీని పైన కూడా మంత్రులతో మాట్లాడాలని, గట్టిగ నిలదీయాలని, ఉద్యోగ సంఘాల నేతల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ అంశం పైన మంత్రి వర్గంతో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఫిట్ మెంట్ విషయంలో కూడా వెనక్కు తగ్గవద్దు అంటూ, వారి పైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఒక పక్క చర్చలు అంటూ పిలిచి, మరో వైపు కొన్ని శాఖలతో, ముందుగానే ఎస్మా ప్రయోగించటం పైన, ఉద్యోగులు షాక్ తిన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కూడా షాక్ అయ్యారు. ఒక పక్క కుటుంబ సభ్యులు అంటూ, ఉద్యోగులను మంచి చేసుకున్నట్టు నటిస్తూ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, జీతాలు తగ్గించి, రికవరీ పేరిట ఉద్యోగుల నుంచే తీసుకుని, ఈ పనులు ఏమిటి అంటూ, ఉద్యోగులు ఆశ్చర్య పోతున్నారు. ఎస్మా ప్రయోగించి, ఎంత మంది పై చర్యలు తీసుకుంటారో చూస్తాం అని అంటున్నారు.
మొన్నటి దాక రిజర్వ్ బ్యాంకు మనకు షాక్ ఇస్తే, ఈ రోజు మనల్ని చూసి రిజర్వ్ బ్యాంకే షాక్ అయ్యింది...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు రిజర్వ్ బ్యాంక్. మన రాష్ట్రానికి అప్పులు ఇచ్చే విషయంలో, రిజర్వ్ బ్యాంక్ కృషి అంతా ఇంతా కాదు. మంగళవారం వస్తుంది అంటే చాలు, కొత్త అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు ఇస్తుంది. కొత్త అప్పు విషయంలో, రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. సకాలంలో అప్పు చెల్లించక పోవటం, వడ్డీలు కట్టక పోవటంతో, కొత్త అప్పు పై ఆంక్షలు విధిస్తుంది. మళ్ళీ కేంద్రం దగ్గరకు ఆర్ధిక మంత్రి, ఆర్ధిక శాఖ అధికారులు వెళ్లి, బ్రతిమిలాడు, మొత్తానికి మళ్ళీ కొత్త అప్పు తెస్తున్నారు. అయితే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి వచ్చి, ఆ వచ్చిన అప్పుని, తమకు కట్టాల్సిన అప్పులో, తమకు కట్టాల్సిన వడ్డీల్లో మినాయించుకుంటూ, రాష్ట్రానికి రూపాయి అందకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ అనే వార్తలు, ఈ మధ్య కాలంలో అనేకం మన మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఒక వార్త వైరల్ అయ్యింది. వెరైటీగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం షాక్ అవ్వటం కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో, రిజర్వ్ బ్యాంక్ షాక్ అయ్యింది.
అసలు విషయం ఏమిటి అంటే, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాకు, ప్రతి రాష్ట్రంలో తమ శాఖ బ్రాంచ్ ఉంటుంది. ఆయా రాష్ట్ర రాజధానుల్లో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, తమ శాఖని పెడతారు. గతంలో అమరావతి రాజధాని చేయటంతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి కేటాయించమని రిజర్వ్ బ్యాంక్ కోరింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒకటి కాదు, మూడు రాజధులు అని తేల్చింది. దీంతో రిజర్వ్ బ్యాంక్, తమ శాఖను ఎక్కడా పెట్టకుండా ఆపేసింది. అసలు విషయం ఏమిటి అంటూ, ఒక పౌరుడు రిజర్వ్ బ్యాంకు కు ఆర్టిఐ దరఖాస్తు చేసారు. మీరు ఎందుకు రిజర్వ్ బ్యాంక్ శాఖను ఇక్కడ పెట్టటం లేదని అడిగారు. దానికి రిజర్వ్ బ్యాంక్ సమాధానం ఇస్తూ, అసలు మీ రాజధాని ఏది ? మీ రాజధాని ఏదో చెప్తే, దాని పైన ఒక నిర్ణయం తీసుకుని, తమ శాఖ ఏర్పాటు చేస్తాం అంటూ, లేఖ రాయటంతో, మనమే కాదు, మన రాజధాని ఏమిటో అర్ధం కాక రిజర్వ్ బ్యాంక్ కూడా ఎలా జుట్టు పీక్కుంటుందో అర్ధం అవుతుంది.
మీ వల్ల జాతీయ స్థాయిలో ఇబ్బంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసిన పోస్కో....
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోస్కో ఘాటు లేఖ రాసింది. పరిమితికి మించి విద్యుత్ వాడుతున్నారు అంటూ హెచ్చరించటమే కాకుండా, ఈ విధంగా పరిమితికి మించి వాడటం వలన, నేషనల్ గ్రిడ్ ప్రమాదంలో పడే అవకాసం ఉందని పోస్కో, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోవటం, అదే విధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన పడిపోవటంతో, పీక్స్ లో డిమాండ్ ని తట్టుకోలేని సందర్భంలో, నేషనల్ గ్రిడ్ పైన ఆధార పడుతుంది. ఫిబ్రవరి మూడో తేదీన, నాలుగో తేదీన, అధికంగా కరెంటు వాడుకున్నారని పోస్కో పేర్కొంది. ఈ పోస్కో అనేది కేంద్ర సంస్థ. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ అంటారు. ఈ నేపధ్యంలోనే ట్రాన్స్కో కు, నిన్న ఘాటు లేఖ రాసింది. ఈ లేఖలో, మీరు కరెంటు అధికంగా వాడటం వలన, జాతీయ గ్రిడ్ ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. ఈ గ్రిడ్ ప్రమాదంలో పడితే , గ్రిడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బ తిని, దేశ వ్యాప్తంగా అంధకారం అలుముకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో థర్మల్, హైడల్ పవర్ ఉత్పాదన పెంచుకోవాలని కూడా సూచించింది. థర్మల్ పవర్ ప్లాంట్లను ముందు పని చేసుకునే విధంగా చేయాలని సూచించటమే కాకుండా, ఎక్కడైతే జల విద్యుత్ ఉత్పత్తికి అవకాసం ఉందో, ఉత్పత్తిని ప్రారంభించి, లోటుని అధిగమించాలని సూచించింది.
ఏపి విధానాలతో నేషనల్ గ్రిడ్ ప్రమాదంలో పడే అవకాసం ఉందని, అదే జరిగితే దేశం అంతా ఇబ్బంది అవుతుందని, నేషనల్ గ్రిడ్ నుంచి తీసుకోవటం మంచిది కాదని, పోస్కో ఉన్నతాధికారులు, ట్రాన్స్కో ఉన్నతాధికారులకు, నిన్న సాయంత్రం లేఖ పంపించారు. ఘాటుగా హెచ్చరించటమే కాకుండా, భవిష్యత్తులో నేషనల్ గ్రిడ్ నుంచి అధికంగా విద్యుత్ ని డ్రా చేయవద్దు అని కూడా హెచ్చరించింది. అయితే గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు అధికం అయ్యాయి. సాయంత్రం అయితే చాలు, మొత్తం చాలా చోట్ల కరెంటు కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలు విషయం ఏమిటి అని ఆరా తీయగా, ప్రభుత్వం బకాయిలు కట్టక పోవటంత, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ విద్యుత్ ఆపివేయటంతో, కరెంటు కోతలు వస్తున్నాయి. అయితే సొంతగా థర్మల్, జల విద్యుత్ ని ఉత్పత్తి చేయకుండా ఉండటం, పక్క నుంచి కరెంటు అధిక ధరకు కొనుక్కోవటంతో, ఇబ్బందులు మొదలయ్యాయి.