లోక్‌సభలో ఈ రోజు కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొకొనసాగించారు.... ఉదయం సభ ప్రారంభమైనప్పట్నుంచి నిరసనలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు.... విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.... ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో చిడతలు వాయిస్తూ, గోవిందా....గోవిందా అంటూ నారదుడి వేషంలో నిరసన తెలియజేశారు.... పార్లమెంట్ లోపల కూడా, గోవిందా....గోవిందా అంటూ నినాదాలు చేసారు...
తల వెంట్రుకలకు పిలక వేసుకొని, రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే 'ఓం నమో నారా' అంటూ శివప్రసాద్ నిసన తెలిపారు... సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరింత జోరుపెంచిన టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో, బయట పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా లోక్‌సభలో అయితే ఏకంగా వెల్‌లోకి వెళ్లి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’.. ‘విభజన హామీలు నెరవేర్చండి’ అంటూ నినాదాలు, ప్లకార్డులతో హోరెత్తిస్తున్నారు.
మరో పక్క పార్లమెంట్ లో కొద్దో గొప్పో ఆందోళన చేసిన వైసిపీ ఎంపీలు, రాజ్యసభలో మాత్రం, పూర్తిగా సైలెంట్ అయిపోయారు... రాజ్యసభలో నిరసన చేపట్టినప్పుడు, కేంద్రమంత్రి జైట్లీ ప్రకటన చేస్తునప్పుడు గానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమాత్రం ఉలుకూ పలుకు లేకుండా మిన్నకుండిపోయారు. అంతే కాదు ఆయన కూర్చున్న సీట్లోంచి కనీసం లేవకుండానే కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.