జగనసేన పై, పవన్ కళ్యాణ్ పై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది... ఈ సందర్భంగా జగన్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ, పవన్ పై విమర్శలు గుప్పించారు. అసలు పవన్ ని లైట్ తీసుకువచ్చు అంటూ, పవన్ వల్ల అసలు మాకు ఏమి కాదు, జనసేన కాదు కదా, ఏ సేన వచ్చినా, నేనే సియం అంటూ జగన్ మాట్లాడారు... ఎన్ని సేనలు వచ్చినా, ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చెయ్యటానికి ఫిక్స్ అయిపోయారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు...

jagan 31012018 2

జనసేన పార్టీతో గానీ, పవన్‌కల్యాణ్‌తో గానీ వైసీపీకి వచ్చే నష్టమేమీలేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా పవన్‌కల్యాణ్ అడ్డుపడుతున్నారనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.... 2014 ఎన్నికల్లో టీడీపీకి-వైసీపీ మధ్య 5లక్షల ఓట్లే తేడా అని చెప్పారు.... మోదీ, పవన్‌కల్యాణ్ ప్రచారం చేసినా వచ్చింది 5 లక్షల ఓట్లేనని గుర్తుంచుకోవాలన్నారు... పవన్ కళ్యాణ్ ఫాన్స్ గురించి కూడా కించపరుస్తూ జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి..

jagan 31012018 3

అలాగే చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేసారు... చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని జగన్ ఆరోపించారు. రైతులకు కరెంటు ఇవ్వటం లేదు, నీళ్ళు ఇవ్వటం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి అంటూ, పచ్చని పొలాల మధ్యే ఉంటూ, జగన్ వ్యాఖ్యలు చెయ్యటం విడ్డూరం... అలాగే, రాష్ట్రానికి ప్రధాన సమస్య చంద్రబాబేనని జగన్ అన్నారు... రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని అన్నారు... చంద్రబాబుని చూసి, ఎవరూ పెట్టుబడులు పెట్టాటానికి రావట్లేదు అంటూ, శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక క్లస్టర్ పక్కన నుంచుని కామెడీ చేసాడు జగన్... మొత్తానికి, చంద్రబాబు కంటే, పవన్ కళ్యాణ్ అంటేనే, జగన్ భయపడుతున్నాడు అనేది అర్ధమవుతుంది...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు తీయించేలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు, కాంక్రీటు పనులను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ‘నవయుగ’కు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ధరలకే (14శాతం మైనస్‌) చేసేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చింది... అయితే, తమను ట్రాన్స్‌స్ర్టాయ్‌కి సబ్‌కాంట్రాక్టర్‌గా కాకుండా, స్వతంత్ర సంస్థగా గుర్తించి... చేసిన పనులకు నేరుగా ప్రభుత్వమే చెల్లింపులు చేయాలని కోరింది... స్వతంత్ర సంస్థగా గుర్తించి, నేరుగా చెల్లింపులు జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ట్రాన్‌స్ర్టాయ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు...

navayuga 31012018 3

నవయుగకు కాంక్రీటు పనులు అప్పగించే ప్రక్రియ వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ఆలస్యం చేయకుండా పనులు చేపడతామని హామీ ఇచ్చింది. రూ. 1400 కోట్ల వ్యయంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను నవయుగ చేపట్టనుంది... ఈ సందర్భంగా నవయుగ సంస్థ ఎండీ, చింతా శ్రీధర్‌ మాట్లాడుతూ, ‘‘పోలవరం కాంక్రీటు పనుల కోసం ఇరవై వేల మంది కార్మికులను రంగంలోకి దించుతాం. రాత్రీ పగలు పనులు జరుగుతాయి. వచ్చే ఏడాది మార్చి నెల అంటే దాదాపు ఏడాది కాలం ఉంది. అప్పటి లోగా దీన్ని పూర్తి చేస్తాం. గడువులోగా పూర్తి చేస్తే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది’’అని కాన్ఫిడెంట్ గా చెప్పారు...

navayuga 31012018 2

నిజానికి ఈ ఇష్యూలో చంద్రబాబు డీల్ చేసిన విధానం, ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోవచ్చు... అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు వేసిన అద్భుతమైన ఐడియా ఇది... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా తీసుకున్న నిర్ణయం ఇది... అటు ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించేలా చేస్తూ, చంద్రబాబు పోలవరం విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చారు...

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అభిప్రాయం తెలుసుకోవటానికి, అలాగే ఇటీవల జరుగుతున్న పరిణమాల పై జాతీయ ఛానల్ newsx చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేసేంది... ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు తన మనుసులో మాట చెప్పారు... నాకు కేంద్రంలో పదవులు ముఖ్యం కాదు, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యం... దాని కోసం ఎంత వరుకు అయినా తగ్గుతా... స్పెషల్ స్టేటస్ ఇస్తాను అన్నారు, కాదు అని స్పెషల్ ప్యాకేజి ఇచ్చారు... దాని కోసం పోరాడుతున్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం.... దానికి ఇబ్బందులు వచ్చాయి... మూడు నెలలు పోరాడి సాధించుకున్నాం, అని చంద్రబాబు అన్నారు...

cbn national 31012018

నేను ఆశావాదిని, పోరాడుతూనే ఉంటా... రాష్ట్రానికి చెడు జరుగుతుంది అనుకున్న రోజు మాత్రం, రాష్ట్ర ప్రయోజనాలు కంటే నాకు ఏది ఎక్కువ కాదు... ప్రధానిని కలిసాను, అన్ని విషయాలు చెప్పను... ఈ బడ్జెట్ లో మాకు ఎక్కువ కేటాయింపులు వస్తాయి అని అనుకుంటున్నాం అని చంద్రబాబు అన్నారు... మాది కొత్త రాష్ట్రము, అనేక సమస్యలు ఉన్నాయి... కొట్టుకుంటా కూర్చుంటే, మాకు వచ్చేవి కూడా రావు... అందుకే ఓర్పుగా, నా స్థాయి తగ్గించుకుని కూడా, రాష్ట్రం కోసం, కేంద్రం దగ్గర తల వంచుతున్నా అంటూ చంద్రబాబు అన్నారు...

 style=

మోడీ నాయకత్వంలో పాని చెయ్యటానికి, అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో పని చెయ్యటానికి తేడా ఏంటి అని అడగగా, చంద్రబాబు సమాధానమిస్తూ "అటల్ బిహారీ వాజపేయి సమయంలో మా అవసరం వారికి ఉంది... మేము లేకపోతే ఆ రోజు ప్రభుత్వం పడిపోయేది... వారిని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకునే వాళ్ళం... అటల్ బిహారీ వాజపేయి సహకరించే వారు... ఇప్పుడు మోడీకి, మెజారిటీ ఉంది... మేము మద్దతు ఇవ్వకపోయినా వారికి పోయేది ఏమి లేదు... అందుకే వారితో పోరాడుతూ పనులు సాధించుంటాం... ఇద్దరి పని తనాన్ని, మనస్తత్వాలని కంపేర్ చెయ్యటం కరెక్ట్ కాదు, ఎవరి స్టైల్ వాళ్ళది అంటూ" చంద్రబాబు తెలివిగా తప్పించుకున్నారు... అయితే ఇంటర్వ్యూ మొత్తంలో చంద్రబాబు పదే పదే చెప్పిన మాట "మా రాష్ట్రానికి నిధుల కోసం పోరాడుతూనే ఉంటా... ఓర్పుగా సాధించుకుంటా... ఆ విషయంలో తేడా వస్తే మాత్రం, రాష్ట్ర ప్రయోజనాలు కంటే నాకు ఏది ఎక్కువ కాదు" అనే మెసేజ్ మాత్రం గెట్టిగా ఇచ్చారు...

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! జాతీయ రహదారి 44 పక్కన పొలాలు, చిన్నపాటి గుట్టలతో కూడిన సుమారు 600 ఎకరాల స్థలం! ఇప్పుడు... ఆ స్థలం రూపు రేఖలు శరవేగంగా మారిపోతున్నాయి... రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో అక్కడే కీలక అడుగు పడనుంది.. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో, ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ ‘కియ’ మోటార్స్‌ కార్ల తయారీ ప్లాంటు భూమి పూజ ఫిబ్రవరి 22న జరగనుంది... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా ఉన్నత స్థాయి ప్రతినిధులు హారుకానున్నారు... ఇప్పటికే ఐదు దశలుగా చేపడుతున్న భూమి చదును పనులు చివరకు వచ్చాయి...

kia 31012018 1

నాలుగు దశల్లో ఉన్న పనులు అయిపోగా, మరో దశ పనులు మిగిలి ఉన్నాయి.. అవి కూడా ఒక వారం, పది రోజుల్లో పూర్తి కానున్నాయి... చదును చేసిన దాదాపు 600 ఎకరాలు, కియా పరిశ్రమకు అప్పగించనుంది రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే కేటాయించిన 582.70 ఎకరాల్లో కియా ప్రధాన పరిశ్రమలో పెయింట్స్ షాపు, బాడీ బిల్లర్ వర్క్ షాప్, ఇంజిన్ ఫుట్ వర్క్స్ షాపు , ఇందనం నిలువ చేయడానికి కూల్ ఫుట్ షాప్, పవర్ ట్రైన్ షాప్, మోడల్ షాప్, అసెంబుల్డ్ షాపు, ఇంటర్నల్ రోడ్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి... విద్యుత్‌ కోసం 220కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేసారు, గొల్లపల్లి నుంచి పరిశ్రమ దాకా ప్రత్యేక పైపులైన్‌ పనులు ఏర్పాటు చేస్తున్నారు...

kia 31012018 1

2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఎర్రమంచి ప్లాంటులో 4 వేల మందికి శాశ్వతంగా.. 7వేల మందికి తాత్కాలికంగా ఉపాధి కల్పిస్తారు. 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

Advertisements

Latest Articles

Most Read