ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేసి, ఏకంగా రివర్స్ పీఆర్సితో జీతాలు తగ్గించిన విషయం పై, ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. అలాగే మూడో తేదీ పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం చేపాట్టనున్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గుంటారని, ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం రావటంతో, ప్రభుత్వం అలెర్ట్ అయ్యి, ఈ రోజు ఎలాగైనా ఆ కార్యక్రమం వాయిదా వేయాలని చూసింది. అలాగే డీఏలు అన్నీ కలిపి కొత్త జీతం వేస్తూ, జీతం పెరిగినట్టు చెప్పారు. ఇన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నా, ఉద్యోగులు లొంగలేదు. దీంతో విజయవాడ పోలీసులు కమీషనర్ ఎంటర్ అయ్యారు. 3న చలో విజయవాడకు పర్మిషన్ లేదని చెప్పారు. కరోనా కారణంగా అనుమతి ఇవ్వలేం అని తేల్చి చెప్పారు. ఉద్యోగులు భారీగా వస్తారని అంచనా ఉందని, ఈ పరిస్థితిలో ఇది మంచిది కాదని అన్నారు.
news
కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు ఆగ్రహం.. ఇంకా స్పందించని జగన్...
కేంద్ర ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. ముఖ్యంగా రైతులకు ఈ బడ్జెట్ ఏ మాత్రం ప్రయోజనం లేదని, కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర విషయంలో, ఎలాంటి సానుకుల నిర్ణయాలు లేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే కోవిడ్ వల్ల అనేక రంగాలు దెబ్బ తింటే, వారిని ఆదుకునే ప్రస్తావనే లేదని చంద్రబాబు అన్నారు. పేద వర్గాలకు బడ్జెట్ లో ఏమి లేదని అన్నారు. ఇక జాతీయ ఆహార భద్రత పధకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతుంటే, వాటిని తగ్గించే దిశగా ఏ చర్యలు లేవని అన్నారు. నదుల అనుసంధానం లాంటి వాటికి ప్రోత్సహాకలు ఇవ్వటం పై హర్షం వ్యకం హ్సుసారు. ఇక వైసీపీ ఎంపీలు ఏమి సాధించుకు రాకపోవటాన్ని కూడా చంద్రబాబు ఆక్షేపించారు. అయితే ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై స్పందించ లేదు. మరి ఆయన అసలు స్పందిస్తారో లేదో చూడాలి.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. మెరుపు సమ్మెకు ఉద్యోగులు దిగుతారా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. మరో పక్క రెండు రోజుల నుంచి ఉద్యోగ సంఘాల నేతల తీరు మారటంతో, కింద స్థాయిలో అబధ్రతతో ఉన్నారు. ఇక ఈ రోజు కొత్త పీఆర్సి ప్రకారం, రేపు ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆదేశాలు పాటించిని ట్రెజరీ ఉద్యోగులకు చార్జ్ మెమోలు దాఖలు చేసారు. 27 మంది డీడీ, ఎస్టీఓ, ఏటీఓలకు మెమోలు జారీ చేసి, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయటంలో విఫలం అయ్యారని, ప్రభుత్వం చెప్తుంది. అయితే గతంలో ఉద్యోగ సంఘ నేతలు, తమకు మెమోలు ఇస్తే మెరుపు సమ్మెకు దిగుతాం అని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం చర్యలకు పాల్పడుతున్న ఉద్యోగ సంఘాలు, కేవలం ఖండనలకే పరిమితం అయ్యారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రెచ్చగొట్టే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల మాటలు విని, ట్రెజరీ ఉద్యోగులు బలి అయ్యారు. మరి ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు పోరాడతారో, ప్రభుత్వంతో సంధికి వెళ్తారో చూడాలి.
కొత్త పీఆర్సి, ఉద్యోగుల జీతాల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, సంచలన ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, జగన్ మోహన్ రెడ్డి కొత్త పీఆర్సి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా, జీతాలు పెరగాల్సింది పోయి, తగ్గిపోయాయి. అయితే కొంత మంది ఉద్యోగులకు రికవరీ పేరుతో ఎదురు కట్టాల్సిన పరిస్థితి. అయితే ఈ అంశం పైన ఉద్యోగులు ఆందోళన చేస్తూనే, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి హైకోర్టు ఈ పిటీషన్ పై విచారణ చేస్తుంది. ఈ పిటీషన్ చివరకు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. ఈ రోజు హైకోర్టు ఈ అంశం పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న విధంగా, రికవరీ లేకుండా ప్రస్తుతానికి జీతాలు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. జీతాల నుంచి రికవరీ చేయటం అనేది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, రికవరీ అంశం ఎక్కడా జీవోలలో లేదని కోర్టుకు తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, దీని పైన ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. మొత్తానికి, ఈ అంశంలో ఉద్యోగులకు ఊరట లభించింది. అయితే కొత్త పీఆర్సి విషయంలో మాత్రం సహజంగా కోర్టులు జోక్యం ఉండదు. మరి కోర్టు తదుపరి విచారణలో ఏమి చెప్తుందో చూడాలి.