సియం క్యాంప్ ఆఫీస్ కు డీజీపీ గౌతం సవాంగ్ రావటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. నిన్న జరిగిన చలో విజయవాడ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వటం, ప్రభుత్వం డొల్ల తనం బయట పడటం, ప్రజలకు కూడా ఉద్యోగుల సమస్యలు అర్ధం అవ్వటం, ప్రభుత్వం పూర్తిగా ఎక్ష్పొజ్ అవ్వటంతో, ప్రభుత్వానికి షాక్ తగిలింది. అసలు ఎక్కడ తేడా వచ్చింది, ఏమి జరిగింది, అసలు ఏమైంది అంటూ లెక్కలు వేస్తున్నారు. ఉద్యోగులను కట్టడి చేసినా, ఇంత మంది ఎలా వచ్చారు అనేది ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. అయితే దీని వెనుక పోలీసుల పాత్ర ఉందని, ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. కేవలం పోలీసుల వైఖరి వల్లే, ఇలా జరిగిందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు డీజీపీని కూడా పిలిపించుకుని, అసలు సంగతి ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. పోలీసుల వైఫల్యం పైనే ప్రభుత్వ పెద్దల ఫోకస్ ఉంది. దీంతో ఎవరు అలసత్వం వహించారు, ఏమి జరిగింది, ఎందుకు పోలీస్, ఇంటెలిజెంట్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది అనే వివరాలు తమకు సమర్పించాలని, డీజీపీని ఆదేశించినట్టు తెలుస్తుంది. పోలీసుల పై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా, లేక మోఖికంగా ఆదేశాలు ఇచ్చి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది చూడాలి. మొత్తానికి ప్రభుత్వానికి గట్టిగానే వ్యతిరేకత తాకింది.

dgp 04022022 2

డీజీపీ తరువాత, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమైన మంత్రులను, అధికారులను, చీఫ్ సెక్రటరీని కుడా క్యాంప్ ఆఫీస్ కి పిలిచి మాట్లాడారు. మంత్రులు బుగ్గన, బొత్సాతో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గున్నారు. అలాగే చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారు. అయితే ఉద్యోగుల ఆందోళనతో పాటుగా, చలో విజయవాడ విషయం పైన కూడా చర్చించారు. అంతే కాదు, ఉద్యోగులు సమ్మెకు కూడా వెళ్తూ ఉండటం, మరో రెండు రోజుల్లో సమ్మెకు దిగుతూ ఉండటంతో, ఏమి చేయాలి, ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎవరి సేవలు ఉపయోగించాలి, రిటైర్డ్ ఉద్యోగులు, వాలంటీర్లు, నిరుద్యోగులు, ఇలా ఎవరిని తీసుకోవాలి అనే అంశం పైన, చర్చించారు. పాలన ఎక్కడా స్తంభించ కుండా ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన ప్రధానంగా చర్చించారు. ఫైనల్ గా ఉద్యోగులతో మరోసారి మాట్లాడి, సమ్మెకు వెళ్ళకుండా చూడాలని, సమ్మెకు వెళ్తే ఏమి చేయాలి అనే దాని పైన, ప్రధానంగా ఈ భేటీ సాగినట్టు తెలుస్తుంది.

నిన్న ప్రభుత్వ ఉద్యోగుల 'చలో విజయవాడ' ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున వచ్చి చలో విజయవాడలో పాల్గున్నారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా సరే, ప్రభుత్వం ఉద్యోగులు వచ్చి, చలో విజయవాడలో పాల్గున్నారు. పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇంకో విషయం ఏమిటి అంటే, అక్కడ ఉన్న ప్రజలు దారి పొడవునా, ఉద్యోగులకు మద్దతు పలికారు. మంచి నీళ్ళు, నిమ్మ రసం, భోజనాలు, ఇలా ఎవరికి తోచింది వారు చేసారు. సరిగ్గా ఇక్కడే అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. పోలీసులను పెట్టేశాం, నిర్బందించాం, ఇక ఉద్యోగులు రారులే అని అనుకున్నారు. కానీ ఆ వీడియోలు, ఉద్యొగుల తిరుగుబాటు చూసి, కౌంటర్ స్ట్రాటజీ మొదలు పెట్టారు. అదేమిటి అంటే, ఉద్యోగులను ప్రజల్లో చులకన చేయాలి అని, దాని కోసం ఒక పన్నాగం పన్నారు. తమ సొంత చానెల్ అయిన సాక్షిలో, కామన్ మ్యాన్ వాయిస్ అంటూ, వీడియో విడుదల చేయటం మొదలు పెట్టారు. అందులో వారిని కిరాణా కొట్టు వారిగా, రిటైర్డ్ ఉద్యోగులుగా, యువతగా, స్టూడెంట్ గా, ఇలా రకరకాల వర్గాల వారి చేత మాట్లాడించి, ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్ పై విషం చిమ్మించారు. ఉద్యొగులకు ప్రభుత్వం మద్దతు లేదని చెప్పే ప్రయత్నం చేసారు.

video 04022022 2

అయితే సరిగ్గా ఇక్కడే, ప్రతి సారి దొరికినట్టే దొరికిపోయారు. అధికార పార్టీ నేతల అత్యుత్సాహం బెడిసి కొట్టింది. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో, ఉన్నది చూసి, వైసీపీ వాళ్ళు కూడా షాక్ తిన్నారు. ఆ కామన్ మ్యాన్ వాయిస్ మొత్తం సామాన్యులు కాదు, అందులో ఉన్నది మొత్తం వైసీపీ నేతలే. వైసిపే యూత్ ప్రెసిడెంట్, వైసీపీ మండల ప్రెసిడెంట్ , ఇలా మొత్తం వైసీపీ నాయకులే అందులో ఉన్నారు. వైసీపీ నేతల చేత, సామాన్యులు లాగా మాట్లాడించి, తప్పుడు పేర్లు, తప్పుడు వృత్తి పెట్టి, వాళ్ళు సామాన్యులు అని, ఉద్యోగుల పైన ప్రజల్లో అభిప్రాయం మార్చే ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోలు, వాళ్ళు వైసిపీ కార్యక్రమాల్లో ఉన్న ఫోటోలు, మొత్తం వైరల్ అయ్యాయి. అధికార పార్టీ, ఉద్యోగుల పై పన్నిన కుట్ర మొత్తం బయట పడింది. ఇన్నాళ్ళు ఇలా ప్రజాభిప్రాయం పేరిట, కొన్ని చానెల్స్ ని అడ్డు పెట్టుకుని, వైసీపీ నేతలు, ఎలా చేస్తుంది, చూసి, సోషల్ మీడియాలో ఆశ్చర్య పోతున్నారు.

ఈ రోజు మధ్యానం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రదేశాల్లో కరెంటు పోయింది అనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది, తమకు కరెంటు పోయింది అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. దీని పైన మీడియా కూడా వార్తలు ప్రసారం చేస్తుంది. ఒక ప్రాంతంలో వస్తుంటే, మరో ప్రాంతంలో కరెంటు పోతుంది. ఇక చాలా చోట్ల ఈ రోజు కేబుల్ ప్రసారాలు కూడా ఆపివేసరని చెప్తున్నారు. అయితే ఇదేమైనా సాంకేతిక సమస్య అని ఆరా తీస్తే, చలి కాలం కరెంటు వినియోగం ఎలాగూ తక్కువే ఉంటుంది, ఇది సాంకేతిక సమస్య అయితే కాదని, కేవలం ఉద్యోగుల వార్తలను ప్రజలు చూడకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉదయం నుంచే చాలా చోట్ల కేబుల్ టీవీ ప్రసారాలు ఆపేసారని, మధ్యానం ఉద్యమం పీక్స్ చేరటంతో, చాలా చోట్ల కరెంటు తీసుకుంటూ వస్తున్నారని, సాయంత్రం ఇళ్ళకు వచ్చి టీవీలు పెడతారు కాబట్టి, ఉద్యోగుల ఆందోళన కనిపించకుండా చేయటానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కరెంటు పోయింది అంటూ, పోస్టింగ్ లు పెడుతున్నారు. మరి దీని పైన ప్రభుత్వం కానీ, పవర్ మినిస్ట్రీ కానీ ఏమి స్పందిస్తుందో చూడాలి.

నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎవరి నోట విన్నా, కరెంటు కోతలే. మాకు కరెంటు లేదు అంటే, మాకు కరెంటు లేదు అంటూ, అందరూ మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కుప్పలు తిప్పలుగా పోస్టింగ్ లు పడ్డాయి. కొన్న చోట్ల కేబుల్ ప్రసారాలు కూడా ఆగిపోవటంతో, ఇది ప్రభుత్వం చర్యలుగా భావించారు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ప్రజలకు చేరకుండా చేయటానికి, ఇలా చేసారేమో అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకున్నారు. అయితే అసలు విషయం ఈ రోజు పేపర్ లు చూస్తే అర్ధం అయ్యింది. నిన్న కరెంటు కోతలకు రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి, పవర్ కార్పొరేషన్ కు డబ్బులు కట్టక పోవటం, రెండోది సాంకేతిక లోపం తలెత్టటం. సహజంగా చలి కాలం, విద్యుత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి. అసలు విద్యుత్ కొరత ఉండదు. అయితే మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కాబట్టి, ఇబ్బందులు వస్తే చేతులు ఎత్తేయటమే గతిగా మారింది. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ కు, రాష్ట్ర ప్రభుత్వం బకాయలు చెల్లించకపోవటంతో, మన రాష్ట్రానికి విద్యుత్ ఆపేశారు. గురువారం, రెండు వేల మెగావాట్లు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కారణంగానే నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి.

power 0402022 2

గతంలోనే నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ రాష్ట్రాన్ని హెచ్చించింది. జనవరి 21 లోపు బకాయలు తీర్చాలని లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలను పట్టించుకోలేదు. దీంతో నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ రంగంలోకి దిగి, రాష్ట్రానికి కరెంటు ఆపేసింది. అంతే కాదు, అప్పటికప్పుడు పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు కూడా చేయకుండా, క్రమశిక్షణ చర్యలు కింద, శిక్ష విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్లలో ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. అయితే విజయవాడ, కృష్ణ పట్నం యూనిట్లు సహకరించ లేదు. సాంకేతిక సమస్యలు వచ్చాయి. అయితే బొగ్గు కొరత కూడా ఉందని అంటున్నారు. ఈ కారణంతోనే నిన్న విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి. ఇష్టం వచ్చినట్టు చేయటం, మన సొంత ప్లాంట్లు ఉపయోగించకుండా, బయట నుంచి కరెంటు కొనటం, అక్కడ ఇబ్బందులు వస్తే, మన ప్లాంట్లు సహకరించకపోవటం, మొత్తంగా విద్యుత్ రంగం అస్తవ్యస్తం కావటంతో, ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి.

Advertisements

Latest Articles

Most Read