సర్‌ప్రైజ్ అంటే ఏంటో అనుకోకండి... మొన్నటి వరకు అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంది... నిన్న రాష్ట్రపతి మెచ్చుకుంది... ఈ రోజు దావోస్ లో అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న మన రాష్ట్ర రియల్‌ టైం గవర్నెన్స్‌ గురించి, మొదటి సారి ప్రధాని, ఈ అద్భుతం చూడనున్నారు... అవును ఇది అద్భుతమే... దేశ రాష్ట్రపతిని సైతం ఆశ్చర్యపరిచిన ప్రాజెక్ట్ ఇది... ఇప్పుడు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రియల్‌ టైం గవర్నెన్స్‌ విధానాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్రపతి నుంచి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి వరకు అమరావతికి వచ్చిన వారంతా ఇక్కడి ఆర్టీజీ కేంద్రం, రియల్‌ టైం పాలన అద్భుతమని కొనియాడారు. ఇప్పుడీ అద్భుతాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పనున్నారు...

rtgc 23012018 2

ప్రధాని కూడా దావోస్ లో ఉన్నారు... ఈ రోజు దాదాపు రెండు గంటల పాటు, దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపి లాంజ్ లో, ప్రధాని మోడీ గడపనున్నారు... ఈ సందర్భంగా, ప్రధాని మోడీకి రియల్‌ టైం గవర్నెన్స్‌ విధానాన్ని చూపించి, అది ఎలా పని చేస్తుంది, రియల్ టైంలో పాలన ఎలా చేస్తుంది, చంద్రబాబు మోడీకి వివరించనున్నారు... ఈ రియల్‌ టైం గవర్నెన్స్‌ పని తనాన్ని, ప్రపంచానికి కూడా చాటి ఉద్దేశంతో, దావోస్ లో ఏపి లాంజ్ లో ఇది ఏర్పాటు చేసారు... సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నట్లుగానే అక్కడా వీడియో వాల్‌ ఏర్పాటు చేసారు...

rtgc 23012018 3

ఇప్పటికే రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజీ) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటికే, ఈ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో నీతి ఆయోగ్‌ ఒప్పందం కుదుర్చుకోనుంది. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధికి తాము అమలు చేస్తున్న పథకాల ఫలితాలను ఇదే తరహాలో సమీక్షించాలని నీతి ఆయోగ్‌ భావిస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆర్టీజీ ద్వారా పొందాలని ఆ సంస్థ భావిస్తోంది.

ఎన్నో సమస్యలు ఉన్నా, సరైన విధంగా ఆదుకోకపోయినా, చంద్రబాబు ఓర్పుతో, బీజేపీతో చెలిమిని నెట్టుకొస్తున్నారు... దీనికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం, జీవనాడి పోలవరం కోసం... మిగతావి మనం ఎలా అయినా కిందా మీదా పడి చేసుకోవచ్చు, పోలవరం, అమరావతికి మాత్రం కేంద్ర సహయం, పెర్మిషన్ల రూపంలో, నిధుల రూపంలో కావాల్సిందే... అందుకే చంద్రబాబు పంటి బిగువన భరిస్తున్నారు... కాని బీజేపీ మాటల్లో చూపిస్తున్న ఆదరణ, చేతల్లో చూపించటం లేదు... చంద్రబాబుకి ఒకానొక సందర్భంలో విసుగు వచ్చి, కేంద్రానికి దండం పెట్టేస్తాను అని చెప్పారు కూడా.... కాని, మరో పెద్ద ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మాత్రం దండం పెట్టేసారు..

sivasena 23012018

గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ మిత్ర పక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా శివసేన కలసి ప్రయాణం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చేశాయి. 18 ఎంపీ స్థానాలతో శివసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో రెండో అతి పెద్ద పార్టీ... 16 ఎంపీ స్థానాలతో తెలుగుదేశం మూడో పెద్ద పార్టీ... అయితే మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ, శివసేన సంబంధాలు మరింత బలహీనపడ్డాయి... ఇవాళ తాజాగా, శివసేన, బీజేపీతో తెగదెంపులు చేసుకుంది... ఇక బీజేపీ మాకు మిత్రపక్షం కాదు అని, శత్రుపక్షం అని ప్రకటించింది...

sivasena 23012018

ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ విషయం పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో పార్టీ ఆమోదించడం విశేషం. శివసేన బయటకు వచ్చేయతంతో, ఇక ఎన్డీయేలో బీజేపీ తరువాత, తెలుగుదేశం పార్టీనే అతి పెద్ద పార్టీ... శివసేన బాటలో ఎన్డీయేలో ఉన్న కొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా బయటకు వెళ్ళే అవకాసం ఉంది... ఇప్పటికైనా బీజేపీ, చంద్రబాబు ఎంత విలువైన మిత్రుడో గ్రహించాలి... చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం ఏమి అడగటం లేదు, రాష్ట్రం కోసం అడుగుతున్నారు... అది గ్రహించి, సరైన సహాయం అందిస్తే, అందరికీ మంచింది అవుతుంది...

నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జాతీయ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ, బీజేపీతో పొత్తు పై చేసిన వ్యాఖ్యలు ఎంత కామెడీగా ఉన్నాయో అందరికీ తెలిసిందే... చివరకు రాష్ట్రంలో చచ్చుపడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా, జగన్ ను ఈ వ్యాఖ్యల పై ఒక ఆట ఆడుకుంది... నిన్న జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు... బీజేపీ కనుక మేము, ప్రత్యెక హోదా ఇస్తాము అని ప్రకటిస్తే, బీజేపీతో కలుస్తాము అంటూ, బంపర్ ఆఫర్ ఇచ్చారు... ఈ వ్యాఖ్యలతో జగన్ కు కేంద్రం అంటే ఎంత భయం పట్టుకుందో అందరూ చూసాయి...

jagan 23012018 2

ఈ వ్యాఖ్యల పై రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది... ఒక పక్క బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని చెప్పింది... ప్రత్యేక హోదా ముగిసిపోయిన చరిత్ర అని చెప్పింది... ప్రత్యేక హోదా మీద ఉద్యమాలు అని చెప్పిన పవన్ సైలెంట్ అయిపోయారు, జగన్ ఇంకేముంది రాజీనామాలు చేస్తున్నాం అన్నాడు... చివరకు ఏమి కాలేదు... ఒక బీజేపీ తెగేసి, మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్తుంటే, జగన్ మాత్రం మేము బీజేపీతో పొత్తు అంటున్నారు... దీని పై కాంగ్రెస్ నేత జేడీ శీలం సెటైర్ వేసారు... నీకు ప్రత్యెక హోదా కావలి, బీజేపీ ఇవ్వను అంటుంది, మేము రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్తున్నాం... నీకు ప్రత్యేక హోదా ముఖ్యం అయితే, మాతో పొత్తు పెట్టుకో అని జేడీ శీలం అన్నారు...

jagan 23012018 3

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా, బీజేపీతో కలుస్తామనడం వెనుక అంతర్యమేంటి అని అన్నారు, జేడీ శీల... కేసులు చూపి జగన్ ను బీజేపీ బెదిరించిందని, కేసులకు భయపడే బీజేపీతో కలుస్తానని జగన్ సంకేతం ఇచ్చారు అని జేడీ శీలం చెప్పారు... జగన్ వ్యాఖ్యల పై బీజేపీకి చెందిన పురంధేశ్వరి కూడా స్పందించారు... జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం విడ్డూరమని ఆమె వ్యాఖ్యానించారు. హోదాతో కలిగే ప్రయోజనాలన్నీ కేంద్రం ఇప్పటికే కల్పిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ఏపీకి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు అందజేస్తోందని పురందేశ్వరి చెప్పారు.... మొత్తానికి, జగన్ అసంబద్దం అయిన మాటలు మాట్లాడి, మాళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు...

వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది... ఈ సదస్సు ప్రారంభ ఉత్సవాలు అట్టహాసంగా జరగనున్నాయి... మరి కాసేపట్లో సదస్సులో ప్రధాని మోడీ తొలి ఉపన్యాసం ఇస్తారు... ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బృందం కూడా పాల్గొనాల్సి ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడకు రానున్నారు... అయితే, దీని కంటే ముందే చంద్రబాబు, మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తీవ్ర సమస్య పై మాట్లాడాలి అంటూ, టెలికాన్ఫరెన్స్ ఏర్పాట్లు చెయ్యమన్నారు... మనకు ఇంకా టైం ఉంది కదా, వేస్ట్ చెయ్యటం ఎందుకు, ఆ సమస్య పై చర్చిద్దాం అంటూ, టెలికాన్ఫరెన్స్ మొదలు పెట్టారు..

cbn davos 23012018 3

ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ళ పై చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు... పట్టిసీమ వల్ల కృష్ణాజిల్లాలో వరిపంట పుష్కలంగా చేతికొచ్చిందని సీఎం అన్నారు... చేతికొచ్చిన వరి పంటకు తగు విధంగా రైతులు ప్రయోజనం పొందేలా పగడ్భందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.... పట్టిసీమ వల్ల రైతులు... ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజలకు పుష్కలంగా చేతికొచ్చిన పంటకు తగు విధంగా గిట్టుబాటు ధర వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు...

cbn davos 23012018 2

పట్టిసీమ వల్ల రైతులకు చేగూరిన అదనపు ప్రయోజనానికి తగు ప్రతిఫలం దక్కాలని చెప్పారు... వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి రైతులకు అండగా నిలవండి అని చెప్పారు... రైతులకు ఏ మాత్రం నష్టం కలిగినా సహించేది లేదని చెప్పారు... ముఖ్యంగా కృష్ణా జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి గిట్టుబాటు ధర పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.... దావోస్ లో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రైతుల విషయంలో ప్రత్యేకంగా అధికారులతో సమాలోచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

Advertisements

Latest Articles

Most Read