ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... మీతో విసిగిపోయాను, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి చేస్తే, ఇక మిమ్మల్ని వదులుకోవటమే అంటూ చెప్పి, దావోస్ పర్యటనకు వెళ్ళారు... నిన్న జరిగిన వర్క్‌షాప్‌లో పార్టీలో కొంత మంది క్రమశిక్షణ తప్పుతున్న నేతల పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీల పై చంద్రబాబు సీరియస్ అయ్యారు... వారికి లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు... మీ వల్ల నేను ప్రజల్లో తెచ్చుకుంటున్న పోజిటివ్ మూడ్ పోతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు అంటూ, గెట్టిగా చెప్పారు...

cbn mlc 22012018

‘పద్ధతి మార్చుకోండి, ఇదే చివరి వార్నింగ్’ అంటూ సీఎం హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వేలుపెడుతున్నారని, నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దనే మీకు ఎమ్మెల్సీలు ఇచ్చాం.. ఎమ్మెల్యేలతో గొడవ పడాల్సిన అవసరం మీకేంటని ప్రశ్నించారు. ‘‘మీ వల్ల ఓట్లు పోయే పరిస్థితి తెస్తున్నారు. ఇలాగే కొనసాగితే మిమ్మల్ని వదిలేస్తా. మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వను. పద్ధతి మార్చుకోండి, ఇదే చివరి వార్నింగ్‌’’ అంటూ ఎమ్మెల్సీలను చంద్రబాబు హెచ్చరించారు.

cbn mlc 22012018

ఎమ్మెల్సీలకే కాదు, ఎమ్మల్యేలకు కూడా ఇలాంటి వార్నింగే ఇచ్చార్... చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని, పనిచేయకపోతే మీకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు... చంద్రబాబు మాట్లాడుతూ... ‘నేనే వచ్చి మీ దగ్గర నిరహార దీక్ష చేస్తా... అప్పుడైన మీమీద ఒత్తిడి పెరుగుతుంది’ అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా... అని ప్రశ్నించారు. మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మల్సీల విషయంలో, చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది కరణం బలరాంకేనేమో అని, నేతలు గుసగుసలాడుకున్నారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం జూరిచ్ చేరుకుంది... జూరిచ్ చేరుకున్న చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది... పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా, ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి డీల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ బయలుదేరారు. కొద్ది సేపటి క్రిత్రం జూరిచ్ చేరుకునంరు... దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయం, ఔషధరంగం, సోలార్ ఎనర్జీ, ఐటీ, మౌళిక వసతులు వంటి కీలక రంగాలకు సంబంధించిన ఎఓంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది.

cbn zurich 22012018 2

వరల్డ్ ఎకనామిక్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపన ఇప్పటికే ఏపీ పారిశ్రామిక ప్రగతి రథం దావోస్లో చక్కర్లు కొడుతుంది. గత రెండేళ్లగా దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం అనేక కీలక పెట్టుబడులను తీసుకురాగలిగింది. ఈ సారి వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కీలకమైన ఉపన్యాసాల్లో ప్రధాన వక్తగా చంద్రబాబు ఉండబోతున్నారు. దీంతో పాటు ప్రధాన మంత్రి మోదీతో ఆయన గంటన్నర పాటు గడపనున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి వ్యవసాయ-భవిష్యత్తు, ఆహార భద్రత, గ్లోబల్ ఫండ్, ఐటీ ఇన్ ప్రాస్రక్టర్, మాన్యుఫాక్పరింగ్ తదితర అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. దావోస్కు వచ్చే పారిశ్రామిక వేత్తలను, వచ్చే నెలలో రాష్ట్రంలో జరగబోయే సిఐఐ సదస్సుకు సీఎం చంద్రబాబు ఆహ్వానించునున్నారు.

cbn zurich 22012018 3

దావోస్ పర్యటనలో మొదటిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు డీఐపిపి ఏర్పాటు చేసే ఇండియా రిసెప్శన్ కు హాజరవుతారు. రెండోరోజు ఏపీ లాంజ్ లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు వరుసగా సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎపీ లాంజ్ ను సందర్శిస్తారు. ఇండియూ లాంజ్లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గుంటారు... మూడో
రోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ టెల్విడర్ లో లంచ్ ఆన్ మీటింగ్ సమావేశంలో పాల్గుంటారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో మొత్తం మూడు ఎంవోయూలను రాష్ట్ర ప్ర భుత్వం చేసుకోనుంది.

ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్ లో, ఎమ్మల్యేలు, నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, సలహాలు, సమస్యలు చెప్పుకొచ్చారు... వాటికి చంద్రబాబు సమాధానమిస్తూ, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలో చెప్పారు.. ఈ సందర్భంలో, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, "అడిగిన వారికి పింక్ కార్డులు ఇవ్వాలి... గుర్తింపు కోసం వాళ్లు పింక్ కార్డు అడుగుతున్నారు.. కాబట్టి ఈ అంశం వెంటనే పరిశీలించాలి... దీనివల్ల అందరిలో సంతృప్తస్థాయి పెరుగుతుంది" అంటూ బోడె ప్రసాద్ చంద్రబాబుకి చెప్పారు...

bode 21012018 2

దీంతో చంద్రబాబు సమాధానమిస్తూ,"కోళ్ల పందేలు ప్రజల సంతృప్తికే, ఆ సంస్కృతి లేని ప్రాంతాల్లో కూడా జరిపించారా" అని ముఖ్యమంత్రి సెటైర్ వేయడంతో ప్రాంగణం నవ్వులతో మార్మోగింది.... ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, బోడె ప్రసాద్ కోళ్ల పందేలు అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే... పోలీసు వారితో పోరాడి మరీ, కోళ్ల పందేలు నిర్వించారు బోడె... దీంతో సందర్భం రావటంతో, చంద్రబాబు బోడె కి సెటైర్ వేసారు... కోళ్ల పందేలు నిర్వహించిన మిగతా ఎమ్మల్యేల పై కూడా ఉదయం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు...

bode 21012018 3

బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ "నియోజకవర్గానికి కేటాయించిన 2వేల పెన్షన్ల మంజూరులో కరెంట్ బిల్లు రూ.500 పైబడి వచ్చినవారికి ఇవ్వడంలేదు... అర్హుల జాబితాలు పెండింగ్ లో ఉన్నాయి....గతంలో ఇళ్లు కేటాయింపు పొందినవారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు... దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది.ఇళ్ల క్రమబద్దీకరణ వేగవంతం చేయాలి" అంటూ ముఖ్యమంత్రికి చెప్పారు... అలాగే జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ "జన్మభూమి-మావూరు 9 రోజుల షెడ్యూల్ లో ఆదివారం వచ్చినప్పుడు అధికారులు పనిచేయడానికి ఇష్టపడటంలేదు కాబట్టి సండే మినహాయించి గ్రామసభలు జరిపితే బాగుంటుంది" అని అనగా... వాళ్ల తరుఫున నువ్వు మాట్లాడుతున్నావా, లేక ఇది నీ అభిప్రాయమా అని ముఖ్యమంత్రి చమత్కరించారు... మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ స్ఫూర్తి ఉండదంటూ ఆ ప్రతిపాదనను కొట్టిపారేశారు.

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలంటూ తెలుగుదేశం నిర్ణయం తీసుకుని, మిత్ర పక్షం అయిన బీజేపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే... ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా పార్లమెంట్‌లో బిల్లు పెట్టారు... భర్త జైలుకు వెళితే భార్యాపిల్లల గతేమవుతుంది అనే చర్చ వచ్చినప్పుడు, తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది... వెనువెంటనే ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి త లాక్ సర్ట్ఫికేట్లు ఇచ్చే ఖాజీలపై చర్య లు తీసుకోవాలనే డిమాండ్ ఉంది... ఇది ఇలా ఉండగా, ఇప్పుడు మరో విషయంలో తెలుగుదేశం పార్టీ, మిత్ర పక్షం అయిన కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది...

tdp 22012018 2

హజ్ యాత్రకుకు సబ్సిడీ ఇస్తున్న నిధుల నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... ఈ నిర్ణయం పై తెలుగుదేశం పార్టీ, కేంద్రంతో విభేదిస్తుంది... ఇదే విషయం నిన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వర్క్-షాప్ లో చెప్పారు... ట్రిపుల్ తలాక్, హజ్ యాత్రకు నిధుల నిలిపివేతపై విభేదించామని చెప్పారు. ఎన్డీఏతో విభేదించినందుకు టీడీపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధన్యవాదాలు తెలిపారని, సమాజ హితం కోసం సిద్ధాంతపరంగా ఎవరితోనైనా విభేదిస్తామని అన్నారు.

tdp 22012018 3

అలాగే, విభజన సమస్యల పై కూడా చంద్రబాబు మాట్లాడుతూ "విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు గురించి ప్రధాని నరేంద్రమోడికి చెప్పాల్సిందంతా చెప్పాను.ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి వివరించాను.సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములకు సంబంధించి రూ.16వేల కోట్లు రావాలి.తొలిఏడాది ఆర్ధికలోటు రూ.16వేల కోట్లు కాగా 4వేల కోట్లు ఇచ్చారు.రూ.7500కోట్లు ఇస్తామని ఆర్ధికమంత్రి హామీ ఇచ్చారు.మిగిలింది త్వరగా ఇవ్వాలని అడిగాం.ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం,కేంద్రీయ విశ్వవిద్యాలయం రెండు విద్యాసంస్థలు రావాలి.నెలకొల్పిన 9విద్యాసంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలి,ఆరేళ్లలో పూర్తి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేయాల్సివుంది.విశాఖ రైల్వేజోన్,కడప స్టీల్ ఫాక్టరీ,దుగరాజపట్నం పోర్ట్ అంశాలను త్వరితగతిన క్లియర్ చేయాలని కోరాం.కాకినాడ పెట్రో కాంప్లెక్స్ గురించి కూడా కేంద్రానికి తెలియజేశాం.వాణిజ్యపన్నుల పంపిణీకి సంబంధించి సెక్షన్ 50,51,56కి సవరణలు తేవాలని అడిగాం,దీనివల్ల రూ.3,820కోట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందనే విషయం గుర్తుచేశాం"

Advertisements

Latest Articles

Most Read