ఎప్పుడు సౌమ్యంగా, ఆచి తూచి మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రిపబ్లిక్ టీవీ చెప్పిన సర్వే వివరాల పై అసహనం వ్యక్తం చేసారు... రిపబ్లిక్ టీవీ సీ-ఓటర్ సర్వే ఓ బూటకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘అడిగినవన్నీ చేశాం. అడగనివి కూడా చేశాం. తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉండి కూడా అన్ని రంగాల్లో వృద్ధి చూపించాం. ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని చేసినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అసంతృప్తి ఎందుకు ఉంటుంది?’’ అని ప్రశ్నించారు
బీజేపీ పార్టీకి అసోసియేట్ గా ఉన్న రిపబ్లిక్ టీవీ, దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, సర్వే అంటూ ప్రకటించింది... మన రాష్ట్రానికి ఉన్న 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు... అంటే సగానికి పైగా పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే...అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ అంచనా వేసి అలా అయినా కొన్ని రోజులు జగన్ ను సియం భ్రమలో ఉంచింది...
2014 లో జగన్ కు వచ్చిన ఎంపీ సీట్లు 8... ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లిమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... మరో పక్క చంద్రబాబు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటిలో సమానంగా దూసుకుపోతున్నారు... అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కావాలని ఎవరైనా కోరుకుంటారా ? అసలు ఈ సర్వే కామెడీ ఇది... 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర్నబ్ రిపబ్లిక్, సీ వోటర్ సర్వే చేసింది 60,000 మందిని... అంటే సగటున ఒక నియోజకవర్గానికి కేవలం 110 మంది... 25 నియోజకవర్గాలకు గానూ ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు 3.68 కోట్లు... అంటే సగటున ఒక నియోజక వర్గానికి 14 లక్షల 72 వేల మంది ఓటర్లు... 14,72,000 ఓటర్లకు గానూ 110 మందిని సర్వే చెయ్యడం అంటే సర్వే శాంపిల్ సైజు 0.0074%.. ఇదో సర్వే.. మళ్ళీ దీనికో పెద్ద బిల్డ్ అప్...