దాదాపుగా 7.560 కిలోమీటర్ల పొడవు గల అతిపెద్ద రైలు సొరంగ మార్గం... కశ్మీర్‌లోని అతి పెద్ద రైల్వే టన్నెల్‌ తరువాత ఇదే పెద్దది... ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా ? మన రాష్ట్రంలోనే... నెల్లూ రు జిల్లా వెలుగొండలో ఉన్న ఈ టన్నెల్, నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు ప్రయాణాలకి ఉపయోగపడుతుంది... దక్షిణ భారతంలోనే అతిపెద్ద రైలు సొరంగ మార్గం ఈ సంవత్సరం మే నెల నాటికి అందుబాటులోకి రానుంది. రెండేళ్లక్రితం మొదలైన పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి... 2005 నుంచి ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అనుకుంటూనే ఉన్నారు... కాని పనులు మాత్రం చెయ్యలేదు...

velugonda 20012018 1

ఇంత పెద్ద సొరంగ మార్గం అయితే నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు కాని, పనులు ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు.. 2015 మే నెలలో వెలుగొండ కొండల్లో సొరంగ మార్గం నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని రైల్వే ఇంజనీర్లు గడువు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సొరంగం పనులు చివరి దశకు చేరుకున్నాయి... వెంకటాచలం-ఓబులవారిపల్లి మధ్య, రూ.839 కోట్లతో 113 కి.మీ పొడవున రైలు మార్గానికి మొదట్లో ఖర్చవుతుందని అంచనా వేశారు...

velugonda 20012018 1

ఈ సొరంగం రెండుగా ఉంటుంది... మొదటిది 6.600 కి.మీ సొరంగం తరువాత, మైదాన ప్రాంతం వస్తుంది... కొంచెం దూరం వెళ్ళిన తరువాత 0.960 కి.మీ. పొడవున మరో సొరంగం ఉంటుంది... ఈ సొరంగం ఎత్తు 8 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు... రైల్వే లైను కోసం విద్యుత్‌ స్తంభాలు, ట్రాక్‌, సొరంగ మార్గంలో విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేస్తున్నారు... ఇంకా 100 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది... ఈ పనులు అన్నీ మే నాటికి పూర్తవుతాయి అని చెప్తున్నారు...

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 48 వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వరుసగా నాలుగో ఏడాది ప్రత్యేక ఆహ్వానం అందింది. దావోస్లో ఈనెల 23 నుంచి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరగనుంది. ఈ సారి, ఈ సదస్సుకి ప్రధాని మోడీతో పాటు, అమెరిక అధ్యక్షుడు ట్రంప్ కూడా రానున్నారు... వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై మన ముఖ్యమంత్రి ముఖ్య వక్తగా, ఉపన్యాసకునిగా కొన్ని కీలక అంశాలపై ప్రసంగాలు చేస్తారు.... మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.... తర్వాత క్రిస్టల్ అవార్డుల ప్రదాన వేడుకలో పాల్గొంటారు... అదేరోజు డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్‌కు హాజరవుతారు.

davos 20012018 1

రెండోరోజు ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.... దావోస్ సదస్సు కాంగ్రెస్ సెంటర్‌లో మన ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఓపెనింగ్ ప్లీనరీలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు... అదే రోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోతో వరుసగా సమావేశమవుతారు... రెండోరోజునే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు మన ఏపీ లాంజ్‌ను సందర్శిస్తారు... ఇండియా లాంజ్‌లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు... బజాజ్ గ్రూప్ నైట్ క్యాప్ ఆధ్వర్యంలో డిన్నర్ రిసెప్షన్‌కు హాజరవుతారు....

మూడోరోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్‌లో లంచ్ ఆన్ సమావేశం. ఈ సందర్భంగా ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడుతారు... ఆ తరువాత CII CEOలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్యానలిస్టుగా ముఖ్యమంత్రి పాల్గొంటారు... కాంగ్రెస్ సెంటర్‌లో స్టివార్డ్స్ బోర్డు మీటింగ్. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సిస్టం ఇనీషియేటివ్ సౌజన్యంతో ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్’ అనే అంశంపై జరిగే చర్చా గోష్టిలో ముఖ్యమంత్రి ప్యానలిస్టుగా హాజరవుతారు...

davos 20012018 1

యుయన్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హేయిన్‌తో లంచ్ మీటింగ్. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం చేపట్టిన చర్యలను, సాధించిన ప్రగతిపై చర్చిస్తారు... బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ చైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో పాల్గొంటారు.... చంద్రబాబునాయుడుకు దావోస్ పర్యటనలో, మొత్తం 25 ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. అలాగే, 5 ముఖ్యమైన సమావేశాలు--3 ఎంవోయూలు జరుగుతాయి.. 5 ముఖ్యమైన సమావేశాలు, సీఈవో రౌండ్ టేబుల్ మీటంగ్స్, గ్లోబల్ సీఈవోలతో ముఖాముఖి చర్చలు, ప్రధాన వక్తగా కొన్ని సెషన్స్‌లో ప్రసంగాలు చేస్తారు, 3 ఎంవోయూలు జరుగుతాయి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇప్పటికే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే టాప్ లో ఉంది... కర్నూల్ లో పెడుతున్న అతి పెద్ద ప్లాంట్ తో, ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకుంది... ఇప్పుడో మరో మెగా సోలార్ ప్లాంట్ రాష్ట్రంలో రానుంది... చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్కు అనుబంధంగా ఉన్న CETC రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ, 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లో మెగా సోలార్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో, ఒప్పందం జరిగింది... చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలోని 18 ఎకరాలలో ఈ సోలార్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ రానుంది. సుమారుగా 1500 ఉద్యోగాలు రానున్నాయి...

china 20012018 2

ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో $ 8 మిలియన్లను రాబట్టే అవకాసం ఉంది. ఢిల్లీ లో సిఐఐ సమ్మిట్ సన్నాహక కార్యక్రమంలో, దీని పై ఏంఓయు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున, జాస్తి కృష్ణ కిషోర్, CETC డైరెక్టర్ మధ్య బుధవారం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో జరిగింది.

china 20012018 3

ఆంధ్రప్రదేశ్, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ రంగంలో 20 శాతం మార్కెట్ షేర్ లక్ష్యం కలిగి ఉంది... 2020 నాటికి 50 శాతానికి మార్కెట్ వాటా చేరుకునే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు వెళ్తుంది... అలాగే CETC కూడా చైనాలో అతి పెద్ద కంపెనీ.. బీజింగ్లో ప్రధాన కార్యాలయం ఉన్న CETC, ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ.. 18 జాతీయ కీ లాబొరేటరీలు, 10 నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లతో పాటు, 1,50,000 ఉద్యోగుల ఉద్యోగులు ఈ కంపెనీలో ఉన్నారు...

2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్‌డిఎ ప్రభుత్వం, అప్పటి వరకు ఉన్న ప్రణాళికా సంఘన్ని ఎత్తేసి, నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసింది. NITI అంటే(National Institution for Transforming India... నీతి ఆయోగ్‌ కు ప్రధాన మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.. ప్రణాళిక తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలకు అవసరమైన సలహాలను, సహకారాన్ని అందించడం, కేంద్ర నిధులు ఖర్చు, రాష్ట్ర ఆర్ధిక స్థితి మెరుగుపరచటం, నీతి ఆయోగ్‌ లక్ష్యాలు... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి అని చెప్పింది కూడా ఈ నీతి ఆయోగే...

niti 20012018 2

కేంద్రం మాట్లాడితే నీతి ఆయోగ్‌ ఆమోదించాలి అని, నీతి ఆయోగ్‌ సిఫార్సులు అంటూ, రాష్ట్రానికి రావాల్సిన సహాయం లేట్ చేస్తూ వస్తుంది... అసలు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నీతిఆయోగ్‌ ఇప్పటివరకూ ఏయే సిఫార్సులు చేసింది? ఏం నివేదికలు ఇచ్చిందో వెల్లడించాలంటూ ఆర్‌టీఐ చట్టం కింద ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి దరఖాస్తు పెట్టారు.. కాని, దీనికి సమాధానం ఇవ్వటానికి ప్రధానమంత్రి కార్యాలయం ఒప్పుకోలేదు... సమాచార హక్కు చట్టం పరిధిలో ఈ వివరాలు బయటకు చెప్పటం కుదరదు అని చెప్పింది...

niti 20012018 3

ఈ విషయాలు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. అలాంటి సమాచారం ఇవ్వడాన్ని ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) ప్రకారం మినహాయించినట్లు పేర్కొంది. ఈ వివరాలు వెల్లడించి ఉంటే ప్రత్యెక హోదా విషయం ఎందుకు పక్కకి వెళ్ళింది, ప్రత్యేక ప్యాకేజి విషయం గురించి సమగ్ర విశ్లేషణ ప్రజల ముందు ఉండేది... మరి ఎందుకోసమో కాని, రాష్ట్రానికి సంబంధించి ఇంత కీలకమైన సమాచరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి, ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది.

Advertisements

Latest Articles

Most Read