జగన్ వ్యవహార శైలి నచ్చక, వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని వార్తలు నిన్న, విజయవాడలోనే కాక, రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించాయి... రాధా ఒక్కడే కాకుండా, అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులని కూడా తన పాటు తీసుకువెళ్తున్నారు అని జగన్ కు తెలియటంతో, జగన్ అలెర్ట్ అయ్యారు... తన పార్టీ సీనియర్ నాయకులని రాధా దగ్గరకు బుజ్జగించటానికి పంపించారు... కాని రాధా మాత్రం జగన్ బుజ్జగింపులకు లొంగలేదు అనే వార్తలు వచ్చాయి... కాని జగన్ పార్టీ నాయకులు మాత్రం యధావిధిగా ఖండ ఖండాలుగా ఖండించారు...

radha 18012018 2

రాధా తన ఊపిరి ఉన్నంత వరకు జగన్ ను వీడడు అని రొటీన్ గా మీడియా ముందు హడావిడి చేసారు... సీన్ కట్ చేస్తే, రాధా మీడియాతో మాట్లడారు... రాధా మాత్రం ఏదీ సూటిగా చెప్పలేదు... నేను పార్టీ మారితే మీ అందరికీ చెప్పే మారతాను... తెలుగుదేశంలోకి వెళ్తున్నాను అన్నది మీ ప్రచారమే అంటూ మీడియాతో అన్నారు... మీరు వైకాపాలోకి వెళ్ళిపోతున్నారు అని వార్తలు గుప్పు మంటే ఎందుకు మాట్లడటం లేదు, . వైకాపాను వీడటం లేదని స్వయంగా ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్నకు, దేనికైనా సమయం రావాల్సి ఉందని నర్మగర్భ సమాధానం ఇచ్చారు.

radha 18012018 3

తన పని తాను చేసుకు వెళుతున్నానని, పార్టీ మారాలని భావిస్తే, పక్కా ప్రణాళికతోనే వెళ్తానని స్పష్టం చేశారు. తాను వెళ్లి పార్టీలో చేర్చుకోవాలని ఎవరితోనూ చర్చించలేదని రాధ చెప్పారు. తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని చెప్పిన ఆయన, ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడేయరాదని అన్నారు. వైకాపా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంగీకరించిన ఆయన, అలాగని పూర్తి దూరంగా ఏమీ లేనని అన్నారు... తన రాజకీయ భవిష్యత్తు గురించి తనకు తెలుసునని, పార్టీ మారాలని భావిస్తే, కంగారుపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, అందరికీ చెప్పిన తరువాతే వెళతామని అన్నారు. మొత్తానికి రాధా మాటల్లో జగన్ పై అసంతృప్తి ఉందన్న విషయం అర్ధమవుతుంది.. అలాగే తెలుగుదేశంలో చేరిక విషయం కూడా ఆయన ఖండిచకపోవటం, అలాగే జగన్ పార్టీలో సమస్యలు ఉన్నాయి అని చెప్పటం, రాధా పార్టీ మారటం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి...

పోలవరం పై కేంద్రం పెడుతున్న ఇబ్బందులు తెలిసినవే... ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ అనుకున్నంత మేర పనులు చెయ్యటం లేదని భావించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 60-సీ కింద నోటీసులు ఇచ్చింది. ఆ పనులను వేరే సంస్థకు అప్పగించేందుకు వీలుగా టెండర్లను పిలిచింది. కానీ, ఆ టెండర్లను కేంద్రం నిలిపివేసింది. కొత్త టెండర్లు పిలిస్తే అదనపు భారం పడుతుంది అంటూ ముందుకు వెళ్ళనివ్వ లేదు... వారం క్రిందట మౌఖికంగా కొత్త టెండర్లకు ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు రాత పూర్వకంగా ఆదేశాలు రాలేదు.. ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో, చంద్రబాబు మాష్టర్ ప్లాన్ వేసారు... కేంద్రం ఎత్తుకి, చంద్రబాబు పై ఎత్తు వేశారు..

cbn 18012018 2

అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు అద్భుతమైన ఐడియా వేసారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు... పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ సంస్థను ముందుకు తెచ్చారు చంద్రబాబు... నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది.

cbn 18012018 3

అటు ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో నవయుగ సంస్థ చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, లాభాలను ఆశించకుండా... గతంలో ట్రాన్స్‌స్ట్రాయ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ధరకే ఆ పనులు చేపట్టేందుకు నవయుగ అంగీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం తెరవాల్సిన టెండర్లను వారం రోజులపాటు వాయిదా వేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌ మధ్య అవగాహన కుదిరి లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేశాక.. అధికారికంగా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తుంది.

నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దేశ ఆర్ధిక రాజధానికి రేపటి నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది... నవ్యాంధ్రప్రదేశ్ నుంచి దేశ ఆర్థిక రాజధానికి అనుసంధానం, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది... శుక్రవారం నుంచి విమాన సర్వీసు ఆపరేషన్‌ ప్రారంభం కానుంది... ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఈ విమాన సర్వీస్ ప్రారంభిస్తుంది... ఉదయం ఎనిమిది గంటలకు ముంబై నుంచి విమానం బయలుదేరి 9.45 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి 10.30కు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకల్లా ముంబైకి ఈ విమానం చేరుకుంటుంది....

air india 18012018 2

ముంబయికి విమాన సర్వీసును ఏర్పాటు చెయ్యటంతో, వ్యాపార వర్గాలకే కాక, విదేశాలకు వెళ్ళేవారికి కూడా, ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం విదేశాల నుంచి విజయవాడకు వచ్చేవారు, ఎవరైనా హైదరాబాద్‌లోనో లేక, ముంబయిలో దిగి అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుని, విజయవాడకు రావాల్సి వస్తోంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది... గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండి కూడా, ముంబైలో దిగి, మళ్ళీ హైదరాబాద్ వచ్చి, విజయవాడ రావాల్సి వస్తుంది... దీంతో గన్నవరం నుంచి ముంబై కి సర్వీసులను ఏర్పాటు చేయాలంటూ, పౌరవిమానయానశాఖకు ఇక్కడి వ్యాపార సంఘాల నుంచి లేఖలు చాలాకాలంగా రాస్తున్నారు.

air india 18012018 3

దేశంలోనే రెండో అతిపెద్ద రద్దీ ఎయిర్ పోర్ట్ ముంబయి కావడంతో, అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు ఇక్కడి వారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చే అంతర్జాతీయ సర్వీసుల్లో ఎక్కువశాతం అర్థరాత్రి దాటాకే వస్తాయి. అక్కడి నుంచి విజయవాడకు రావాలంటే ఉదయం వరకూ వేచి చూడాల్సిందే. అదే ముంబయికి సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ఈ సమస్య ఉండదు. ఇక ఎయిరిండియా సర్వీసులో ఇక్కడి నుంచి వెళ్లి.. అదే సంస్థ ముంబయి నుంచి విదేశాలకు నడిపే సర్వీసులను అందుకోవచ్చు. టిక్కెట్లను సైతం నేరుగా తీసుకునేందుకు వీలు కుదురుతుంది. దీంతో జపాన్‌, దుబాయ్‌ సహా ఏ దేశానికైనా నేరుగా విజయవాడ నుంచి చేరుకున్నట్టుగానే ఉంటుంది. సమయం వృథా కాకుండా వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గురించి తెలియని వారు ఉండరు... అయితే ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన రోజులే కాని, ఆయన జీవిత చరిత్ర గురించి పెద్దగా ఎవరికీ తెలియదు... ఇప్పుడు చంద్రబాబు పై మొదటి సారిగా, ఆయన బయోగ్రఫీ పుస్తక రూపంలో రానుంది... చంద్రబాబు "గ్లోకల్ లీడర్" అంటూ యూకే కి చెందిన బ్లూమ్స్‌ బెర్రీ ప్రత్యెక పుస్తకం ప్రచురిస్తుంది... హైదరాబాద్ కు చెందినా తేజస్వినీ పగడాల అనే యువ రచియత, ఈ పుస్తకం రాశారు..

glocal leader 18012018 2

లోకల్‌గా ఏపీని అభివృద్ధి చేయడం... గ్లోబల్‌గా రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలపడం! ఈ రెండూ కలిసి... ‘గ్లోకల్‌’ నాయకుడుగా చంద్రబాబు ఎదిగారంటూ బ్రిటీష్‌ ప్రచురణ సంస్థ బ్లూమ్స్‌ బెర్రీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ‘చంద్రబాబు నాయుడు - ఇండియాస్‌ గ్లోకల్‌ లీడర్‌’ అనే ఈ పుస్తకాన్ని చంద్రబాబు చేతే ఆవిష్కరింపచేయాలని భావించారు. కానీ, సమయం కుదరకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి... ఈ పుస్తకాన్ని పాఠకులకు, చంద్రబాబు అభిమానులకు అందించాలన్న ఉద్దేశ్యంతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. గ్లోబల్‌, లోకల్‌ అనే రెండు పదాలను కలిపి...‘గ్లోకల్‌’ అనే కొత్త పదాన్ని ఉపయోగించారు.

glocal leader 18012018 3

తేజస్వినీ పగడాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్నాళ్ళు పని చేసారు... ఆ సమయంలో చంద్రబాబు పని తీరుని దగ్గరుండి చూసారు... చంద్రబాబు ఎంత విజనరీనో ఆమె స్వయంగా చూసారు... ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, ఆయన ఎంత కష్టపడుతుంది, ఆయన ముందు చూపు, టెక్నాలజీ వినియోగం, ఇవన్నీ చూసారు... చంద్రబాబు గురించి చాలా విషయాలు బయటకు తెలియవు అని, ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని, ఆయన పట్టుదల, పనితనం గురించి ఇప్పటి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది అని, అంతే కాకుండా దేశం మొత్తం కూడా చంద్రబాబు చేసిన పనులు తెలియాలి అని, అందుకే ఈ పుస్తకం రాసినట్టు చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read