ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ని మార్చాలి అంటూ కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు, కేంద్ర హోం శాఖా మంత్రి రాజనాద్ సింగ్ కు, గవర్నర్ ను మార్చాలి అంటూ రెండు రోజుల క్రిందట లేఖ రాసిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంలో గవర్నర్ మార్పు పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సారి స్పందించారు.. విలేకరులు గవర్నర్ మార్పు పై చంద్రబాబుని అడగగా, ఆయన స్పందించారు...

cbn governer 17012018 2

‘‘గవర్నర్ మార్పుపై ముఖ్యమంత్రిగా నేను స్పందించను. ఎంపీ హరిబాబు రాసిన లేఖ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. లోలోపల ముఖ్యమంత్రికి కూడా గవర్నర్ మీద వ్యతిరేకత ఉన్నా, ఆయన మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు... హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సచివాలయం, తెలంగాణకు ఇచ్చేయమనటం, కీలకమైన బిల్లులు ఆమోదించకుండా లేట్ చెయ్యటం, ఆంధ్రప్రదేశ్ అధికారులతో దురసుగా మాట్లాడటం, తెలంగాణాకు పక్షపాతంగా ఉండటం, ఇవన్నీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే విషయాలే అయినా, ఆయన మాత్రం ఇప్పటి వరకు బయట పడలేదు...

cbn governer 17012018 3

వ్యూహత్మకంగా మిత్రపక్షమైన బీజేపీ చేతే చంద్రబాబు విమర్శలు చేపిస్తన్నారు అని టాక్ ఉంది.. గత కొన్ని రోజులుగా గవర్నర్ తీరుపై బీజేపీ నేతలు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఆయన్ను బాహాటంగా విమర్శిస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయంలో గవర్నర్ తీరుపై విష్ణుకుమార్‌రాజు ఘాటు విమర్శలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న గవర్నర్‌ హైదరాబాద్‌లోనే విధులు నిర్వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలన్నది ప్రజల ఆకాంక్ష. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హరిబాబు లేఖలో కోరారు.

మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలోని నోవోటెల్‌ హోటల్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విశాఖలో భూమిని అభివృద్ధి చేసి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక, పారిశ్రామిక, ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్ రంగాల్లో ఏపీ ముందుందని వివరించారు. రాష్ట్రంలో ఎంతో మంతి ప్రతిభ కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని, దానికి మంచి ఉదాహరణ మన ముందే ఉన్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌ను చూపించారు. మార్గదర్శిని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దిన ప్రతిభ ఆమెదని కొనియాడారు. మహిళా సాధికారతతో ఇలాంటి కంపెనీలు మరిన్ని పుట్టుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

mahila 17012018 2

మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు సార్క్‌ దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాల నుంచి సుమారు 40 మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పారిశ్రామికంగా ఎదగడానికి అవసరమైన పలు కీలక అంశాలపై 12 చర్చా కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. వీటిలో 54 మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారావకాశాల్ని చేజిక్కించుకోవడానికి అనుసరించాల్సిన నిబంధనలేమిటి? ఏఏ రంగాల్లో ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి? ఎగుమతులు, దిగుమతుల రంగాల్లో రాణించాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం? తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.

mahila 17012018 3

ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలు నిర్వహించడానికి ఇబ్బంది పడకుండా, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలన్న లక్ష్యంతో ‘విత్‌’ (ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ హబ్‌) పేరిట ఒక కేంద్రాన్ని విశాఖ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రం రానున్న రోజుల్లో అందించే సేవలేమిటన్న అంశాలనూ వివరిస్తారు. అంతర్జాతీయ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించడానికి వీలుగా ‘వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌’ నుంచి ముగ్గురు ప్రతినిధులు వస్తున్నారు. వివిధ ఉత్పత్తుల తయారీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరిజ్ఞానాలేమిటి? అవే ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతలేమిటి? కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్లు ఎలా మారాలి? తదితరాలను వివరిస్తారు. పారిశ్రామికవేత్తలుగా, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించడానికి వీలుగా ఎలీప్‌ అంకుర కేంద్రాలు ఏర్పాటుచేసి అందిస్తున్న సేవలు మహిళలకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయన్న వివరాలపై కూడా అవగాహన కల్పిస్తారు.

ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు-2018 సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పాల్గున్నారు... ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి సురేశ్ ప్రభుతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలు దేశాల పారిశ్రామికవేత్తలు పాల్గున్నారు... ఈ సమావేశంలో పాల్గునటానికి చంద్రబాబు ఉదయం వైజాగ్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు... ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడుల వాతావరణం గురించి వివరించారు...

cii 17012018 2

చంద్రబాబు మాట్లాడుతూ, "సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్నాం... రాష్ట్రంలో ఉత్తమమైన మౌలిక వసతులు ఉన్నాయి... రెండో తరం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తు్న్నాం... రాష్ట్రంలో పెద్దఎత్తున సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం... ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 ఎంబీపీఎస్ వేగంతో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం... రాజధాని అమరావతి నిర్మాణంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి.. పెట్టుబడిదారులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం... రియల్ టైమ్ లో ఎయిర్ క్వాలిటీని అంచనా వేస్తు్న్నాం" అని అన్నారు...

cii 17012018 3

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫిబ్రవరిలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రండి.. మీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం... ఇక్కడ పరిస్థితులు చూసి, మీరు స్వయంగా ఇక్కడ ఉన్న వసతులు పరిశీలించి పెట్టుబడులు పెట్టండి... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి రెండుసార్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాం... మూడో సారి వరసుగా వచ్చే నెలలో నిర్వహిస్తున్నాం...మీరందరూ తప్పకుండా వచ్చి పాల్గునండి అంటూ, చంద్రబాబు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు...

వచ్చే నెలలో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీలో సన్నాహక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గున్నారు. వచ్చే నెల 24 నుంచి 26 వరకు విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు జరుగనుంది. దీనికి సంబంధించి ఇవాళ ఢిల్లీలో జరిగే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గున్నారు. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు కూడా పాల్గున్నారు..

suresh 17012018 2

తురవత సురేష్ ప్రభు, ఈ సమావేశం వివరాలు తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ట్వీట్ చేసారు... ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది అని, సర్వీసెస్, తయారీ రంగం, వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో దూసుకుపోతుంది అని ట్వీట్ చేశారు... అలాగే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వాతావరణం ఉంది అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, పెట్టుబడిదారులని కోరారు...

suresh 17012018 3

సురేష్ ప్రభు ట్వీట్ చేసింది ఇది.... Andhra Pradesh is displaying growth across all subsectors of economy: manufacturing,agriculture, services under leadership of @ncbn... Development of sectors as diverse as infrastructure,medical devices,fintech, life sciences,genomics are getting impetus in #AndhraPradesh.It presents big opportunity for domestic and global investors...

Advertisements

Latest Articles

Most Read