ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథ చక్రాలు.. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్‌ నగరంలో పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినీ, అమరావతి విశిష్టతనూ స్విట్జర్లాండ్‌లో చాటుతూ.. ఆంధ్రప్రదేశ్ బస్సు రయ్యి రయ్యిన దూసుకు వెళుతోంది. ఆంధ్రా బస్సేంటి..? స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టడం ఏంటి..? అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్న సందర్బంగా..పెట్టుబడుల్ని ఆకర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ బస్సు స్విట్జర్లాండులో పరుగులు పెడుతోంది.

davos 16012018 2

స్విట్జర్లాండ్‌లో.. ప్రపంచ ఆర్థిక వేదికగా భాసిల్లే దావోస్‌ నగరంలో.. ఓ బస్సు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ యువర్‌ బిజినెస్‌ అన్న స్లోగన్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోగోలతో ఉన్న ఈ బస్సు.. అక్కడి ప్రయాణికులను రయ్యి రయ్యిమంటూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట, విదేశీ పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో జరిగే ఎకనామిక్‌ ఫోరమ్‌లను లక్ష్యంగా చేసుకొని.. పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే... ఈ బస్సు ద్వారా.. ఇలా ఏపీ రాష్ట్రానికి ప్రచారం కల్పిస్తోంది.

davos 16012018 3

దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక 48వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా హాజరు కానుంది. దావోస్‌కు వచ్చే వాణిజ్య వేత్తలను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం సదస్సుకు వారం ముందు నుంచే బస్సు ద్వారా ఏపీ గురించి ఇలా ప్రచారం ప్రారంభించింది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. వాణిజ్యవేత్తలంతా ఇట్టే గుర్తుపట్టే విధంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. దావోస్ లాంటి నగరంలో ప్రచార రథాలను పరుగులను పెట్టించడం ద్వారా విదేశీలను విశేషంగా అకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెద్ద మొత్తంలో రానున్నాయనే అభిప్రాయం ఏపీ సర్కార్ లో ఉంది. ప్రభుత్వ ఉద్దేశమెలా ఉన్నా.. దావోస్‌ రహదారులపై దూసుకుపోతున్న రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు మాత్రం.. స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

భవానీ ఐలాండ్... ఇప్పిటిదాకా, ఇలా ఎప్పుడూ చూసి ఉండరు... గుంటూరుకు చెందినా auro works టీం, డ్రోన్ కెమెరాతో అద్భుతంగా భవానీ ఐలాండ్ ను చూపించారు... భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ను, తమ డ్రోన్ కెమెరాతో క్యాప్చర్ చేసి, అద్భుతంగా, మనం ఇది వరకు ఎప్పుడూ చూడని వ్యూలో, భవానీ ఐలాండ్ ను వారి డ్రోన్ కెమెరాతో బంధించి, 4K లో చూపించారు... లజేర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్ రంగు రంగులుగా, రాత్రి పూట, కృష్ణమ్మ ఒడిలో ఎంత అద్భుతంగ ఉందో, ఆ  వీడియో కింద చూడవచ్చు...

bhavani island 16012018 2

ఇక భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే... క్రిస్మస్ కానుకగా ముఖ్యామంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించారు... డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దది.. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుంది... ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుంది..

bhavani island 16012018 3

ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపిస్తున్నారు... మ్యూజిక్‌కు అనుగుణంగా లేజర్‌ షో వస్తుంది. ఆ వెలుగుల్లో ఫౌంటెయిన్లు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగుల్లో నది జిగేల్‌మని మెరిసిపోతోంది. చైనాలో కనిపించే లేజర్‌ షో డ్యాన్స్‌ ఇక్కడ ఏర్పాటు కావటం విశేషం... ప్రతి రోజూ రెండు షో లు వేస్తారు... ప్రస్తుతానికి టికెట్ ఉచితంగా ఉంచారు... 200 మంది వరకు సందర్శకులు కూర్చునే వీలు ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఫౌంటైన్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదటి షో ప్రారంభమవుతుంది....

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వ్యక్తిరేకత ఉంది... ప్రజల్లో మాత్రం, మన రాష్ట్రానికి ఆయన పుణ్యక్షేత్రాలకు తప్ప దేనికీ రారు అనే అభిప్రాయం ఉంది... అయితే ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.... అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు మాత్రం బహిరంగంగా మాట్లడటం లేదు... వ్యహత్మకంగా బీజేపీ నేతలు మాట్లడతున్నారు.. మొన్నటికి మొన్న విశాఖ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు, గవర్నర్ పై బహిరంగంగా విమర్శలు చేసారు... నాలా చట్టం సవరణకు రెండు సార్లు రాష్ట్రానికి తిప్పి పంపారు గవర్నర్.. ఈ విషయంలో విష్ణుకుమార్ రాజు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేసారు...

governar 16012018 2

ఇదే ఇలా ఉండగానే, తల్లో వ్యతరేకత పెరిగిపోతోంది. మరో బీజేపీ నేత గవర్నర్ పై విమర్శలు గుప్పిస్తూ, ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసారు.. బీజేపీకి చెందిన విశాఖ ఎంపీ హరిబాబు గవర్నర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే... హైకోర్టు కోసం ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

governar 16012018 3

గవర్నర్ నరసింహన్ పై వ్యతిరేకత ఉన్నా, ఎవరూ బహిరంగంగా విమర్శలు చెయ్యలేదు... ముందుగా తెలంగాణా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసారు, తరువాత బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు ఇక్కడ ఆంధ్రాలో బహిరంగ విమర్శలు చేసారు... ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ హరిబాబు కేంద్ర హోమంత్రికి లేఖ రాయడంతో ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా గురించి చెప్పాల్సిన పని లేదు.... ఆయన ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ నేపద్యం ఉన్న రాజకీయ ఉద్దండుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్న నేత... అలాంటి చంద్రబాబు నిన్న పండుగ పూట , సొంత ఊరిలో ఒకరికి సారీ చెప్పారు... వివరాలు ఇలా ఉన్నాయి.... ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఊరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే... అక్కడ ఉన్న స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో చంద్రబాబు ఇంటికి వచ్చారు...

cbn sorry 16012018 2

దీంతో చంద్రబాబు ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఉండటంతో, దాదాపు రెండు గంటలు అక్కడ రాకపోకలు నిలిపివేశారు.సహజంగా అంత సేపు ట్రాఫిక్ ఆపటంతో, అటు వైపు నుంచి వెళ్ళే ప్రజలు ఇబ్బందులు పడ్డారు... ఇదే సందర్భంలో నవీన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తన కుటుంబంతో కలిసి, తన సొంత ఊరు దిగువ మూర్తిపల్లెకు వస్తున్నారు... అక్కడ ట్రాఫిక్ ఆపివేయ్యటంతో, దాదాపు కిలోమీటరు దూరం నుంచి కాలి నడకన నడవాల్సి వచ్చింది...

cbn sorry 16012018 3

దీంతో నవీన అనే వ్యక్తి, అక్కడ పోలీసులు పై అసహనం వ్యక్తం చేసారు... అక్కడ ఉన్న పోలీసులు పై తన అసహనం అంతా చూపించారు.... అయితే, ముఖ్యమంత్రి అక్కడే ఉన్న సంగతి నవీన్ గమనించుకోలేదు... ఇదంతా చూస్తున్న ముఖ్యమంత్రి, విషయం తెలుసుకుని నవీన్‌కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిచమని పోలీసులను ఆదేశించారు. ఒక ముఖ్యమంత్రి, అదీ చంద్రబాబు స్థాయి వ్యక్తి, తన వల్ల కలిగిన అసౌకర్యానికి, ఒక సామాన్యుడికి సారీ చెప్పటంతో అక్కడ ఉన్న ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు... పోలీసులు కూడా, ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది... 10-15 నిమషాలు అయితే అడ్జెస్ట్ అవుతారు కాని, అన్ని గంటలు ఆపటం కూడా కరెక్ట్ కాదు... చంద్రబాబు ఈ విషయం అర్ధం చేసుకుని, వెంటనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేపించారు...

Advertisements

Latest Articles

Most Read