విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుంది... దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వంగవీటి కుటుంబం, జగన్ టార్చర్ భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం... చంద్రబాబు దావోస్ పర్యటన తరువాత, రాధా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు... జగన్, తనని వాడుకుని వదిలేసాడు అని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసి, కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, అన్యాయం చేస్తున్నాడు అని రాధా భావిస్తున్నారు... మల్లాది విష్ణు కి సెంట్రల్, వెల్లంపల్లి కి తూర్పు, యలమంచిలి రవి ని పార్టీ లోకి తెచ్చి పశ్చిమం టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకుని, రాధాని రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని రాధా అనుచరులు వాపోతున్నారు...
పార్టీ అధికారంలోకి వస్తే ఎదో ఒకటి చేస్తానులే అని జగన్ చెప్పటంతో రాధా అవాక్కయినట్టు సమాచారం.. అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు అని రాధా అనుచరులు వద్ద వాపోతున్నారు... అలాగే గౌతం రెడ్డి విషయంలో కూడా, జగన్ ఎలా వ్యవహరించింది రాధా అనుచర వర్గం జీర్ణించుకోలేక పోతుంది... మరో పక్క చంద్రబాబు కాపు సామాజికవర్గానికి రాజకీయంగా పెద్ద పీట వెయ్యటం, ఆర్ధికంగా వెనుకబడిన కాపులని వివిధ పధకాలతో ఆదుకోవటం లాంటివి చేస్తూ ఉండటంతో, కాపుల్లో తెలుగుదేశం పట్ల సానుకూలత పెరిగిన విషయం కూడా గ్రహించిన రాధా, వైరం పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీలో చేరాలని దాదాపు నిర్ణయించుకున్నారు...
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఈ ఉదయం వార్తల్లోకి ఎక్కగా, ఇప్పుడు ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు. రాధాని రాజకీయంగా పైకి తెచ్చే బాధ్యత నాది అని, చంద్రబాబు చెప్పినట్టు రాధా అనుచరులు చెప్తున్నారు... ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరుపున బలమైన ఎమ్మల్యే అభ్యర్ధులు ఉండటంతో, రాధాకి ఏదన్న కార్పొరేషన్ పదవి కాని, ఎమ్మల్సీ కాని ఇచ్చి, రాజకీయంగా పునర్జీవం పోసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది... మొత్తానికి, జగన్ పైత్యానికి, వంగవీటి రాధా లాంటి వాడు కూడా బయటకు వచ్చేస్తున్నాడు...