2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులకు ఏ మాత్రం అవకాసం ఇవ్వకుండా, తెలుగుదేశం పార్టీ పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలకు తెర తీస్తోంది. 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి అందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ బలోపేతం పై అధిష్టాన వర్గం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే గ్రామస్థాయిలో సైకిల్ యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ప్రజలకు చేరువయ్యారో అదే పంథాలో ఈ పర్యాయం ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ యా త్ర ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ సైకిల్ యాత్రలకు మంత్రి లోకేష్ సారధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.

tdp 14012018 2

ముఖ్యంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ గ్రామ స్థాయిలో లోకేష్ ముద్ర పడాలంటే ఈ సైకిల్ యాత్ర ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన కొన్ని రోజులుగా వైఎస్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వెళ్ళింది. ఈ కార్యక్రమాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు సరైన రీతిన స్పందించ లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలకు పూర్తి స్థాయిలో చేరు చకావాలంటే సైకిల్ యాత్ర దోహదపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సైకిళ్ళ పై యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని వెనువెంటనే అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

tdp 14012018 3

ముఖ్యంగా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళినప్పుడే వారిలో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు. గడచిన మూడున్నరేళ్ళలో నామినేటెడ్ పదవులు వస్తాయని భావిస్తున్న తెలుగు తముళ్ళకి ఆ దిశగా ముఖ్యమంత్రి ఆడుగులు వేయక పోవడంతో నైరాశ్యానికి లోనవుతున్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడే అలవాటు ఉన్న ముఖ్యమంత్రికి కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఎంత చేసినా ఉపయోగం ఉండటం లేదని, స్థానిక ఎమ్మెల్యేలు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వూహ్యాత్మక చర్యల్లో భాగంగా ఏడాదిన్నర మందుగానే నామీనేటెడ్ పదవుల పందేరం చేస్తేనే కార్యకర్తల్లో జోష్ వస్తుందని గుర్తించిన బాబు మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందారానికి తెర తీయనున్నారని తెలుస్తోంది. ఈసారి ఎమ్మెల్యేలు సిఫార్పు చేసిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న వారిని మాత్రమే ఆందలమెక్కించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మహిళా నాయకుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఈసారి ఎన్నికల్లో పెద్దపీట వేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

భవానీ ద్వీపానికి కొత్త హంగులు అద్దెందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానిలో కీలక ప్రాంతం కావడంతో అభివృద్ధి పై భవానీ ద్వీపం టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.16 కోట్లతో ప్లోటింగ్ మ్యూజికల్ లేజర్ ఫాంటేన్లను డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ద్వీపానికి వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్టులు తయారు చేయాలని బీఐటీసీ అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది చేపట్టబోయే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి.

bhavani island 14012018 2

కృష్ణానదిలో ఏడు ద్వీపాలు ఉన్నప్పటికీ తొలుత 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీ ద్వీపం పై అధికారులు దృష్టి సారించారు. ఇక్కడికే పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో సరికొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మజ్ గార్డెను ఏర్పాటు చేయనున్నారు. ఈ మజ్ గార్డెన్ లోకి ఒక మార్గంలోంచి లోపలకు వెళ్లి తిరిగి బయటకు రావడానికి తికమకపడాల్సిందే. నాలుగు వైపుల నుంచి బయటకు వెళ్లేందుకు వీలుండటం, ఏ మార్గంలో వెళ్తున్నామో తెలియకపోవడంతో ఇందులోకి వెళ్లిన వారికి మజ్ గార్డెన్పై ఉత్సాహం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే కాకుండా మిర్రర్ మజ్ ను ద్వీపంలో ఏర్పాటు చేస్తు న్నారు. ఈ మిర్రర్ మజ్ ఒక రకమైన మయసభ. అనేక అద్దాలు ఉండటంతో ఎక్కడైనా ఒక చోట నిలబడి చూస్తే అన్ని అద్దాల్లోనూ వారి ప్రతిబింబమే కనపడుతుంది. దీంతో అసలు వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది.

bhavani island 14012018 3

గోల్ఫ్ సిమ్యులేటర్... గోల్ఫ్ ఆట పై ఆసక్తి ఉన్నవారు ఈ ఆటను నేర్చుకునేందుకు గోల్ఫ్ సిమ్యూలేటర్ను ఏర్పాటు చేయనున్నారు. సిమ్యూలేటర్లో ఆడితే గోల్ఫ్ కోర్ట్ లో ఆడినట్లుగానే అనుభూతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు అత్యాధునిక సౌకర్యా లతో కూడిన రెస్టారెంట్ను ద్వీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆరోగ్యం కోసం ట్రాక్స్... ద్వీపానికి వచ్చే పర్యాటకులు ఉల్లాసంగా గడపటంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేస్తారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే వాకింగ్ చేసుకునే వీలుంది. దీనికి తోడు ఆధునిక వాకింగ్ ట్రాక్ను, సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ద్వీపంలో ఒకటి రెండు రోజులు ఉన్నా ఈ ట్రాక్స్ ను ఉపయోగించుకుంటారు.

దేశంలోనే నాలుగో అతి పెద్ద సర్వీసెస్ కంపెనీ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో తన బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే... అమరావతి రాజధాని ప్రాంతంలో, గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన ఇప్పటికే హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) కు ప్రభుత్వం భూమి కూడా అప్పగించింది. ఈ ప్రాజెక్టులో హెచ్‌సీఎల్‌ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు.

hcl 14012018 2

రెండు నెలల క్రితం కంపెనీ చైర్మన్‌ శివనాడార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు... హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రాష్ట్రంలో స్థాపించనున్న గ్లోబల్‌ ఐటీ డెవల్‌పమెంట్‌, శిక్షణ కేంద్రాల డిజైన్లు ముఖ్యమంత్రికి చూపించారు... గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయని శివనాడార్‌ ముఖ్యమంత్రికి తెలిపారు... సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలు కొలువుదీరనున్నాయి. 2019 జూన్‌కల్లా గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సిద్ధమవుతుంది..

hcl 14012018 3

ఇది ఇలా ఉండగానే, హెచ్‌సీఎల్‌ అప్పుడే గన్నవరంలో నిర్మించే కంపనీలో ఉద్యోగాల ప్రకటనలు కూడా ఇస్తుంది... ఫైనాన్సు సెక్టార్ లో, ఫ్రెషేర్స్ కి కూడా ఉద్యోగాల ప్రకటన ఇచ్చింది... ముఖ్యంగా గన్నవరంలో కంపెనీ సిద్ధం అయ్యే లోపు, కావలసిన వారిని తీసుకుని, ఇప్పటి నుంచే వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.. ఫ్రెషేర్స్ తో పాటు, ఎక్స్పీరియన్స్ కాండిడేట్ లకు కూడా ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చింది... దాదాపు సంవత్సరానికి 7 లక్షల నుంచి, 11 లక్షల దాకా జీతం ఉంటుంది అని తెలిపింది... పూర్తి ఉద్యోగాల ప్రకటన ఇక్కడ చూడవచ్చు... https://www.naukri.com/hcl-jobs-in-vijayawada-guntur కావలసిన వారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఒకటైన అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... దీనికి సంబంధించి క్యాంపస్‌ డిజైన్స్ ఇటు స్థానికత, అటు ఆధునికత- సృజనాత్మకతల మేలికలయికగా రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది... సీఆర్డీఏ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోయిన బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వారపు సమీక్షా సమావేశంలో ‘అమృత’ ప్రతినిధులు డిజైన్లతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చూపారు...

amrita 14012018 2

ముఖ్యమంత్రి సహా సమావేశంలో పాల్గొన్న వారి ప్రశంసలను చూరగొన్న సదరు డిజైన్లలోని కొన్ని ప్రధాన విశేషాలు కింది విధంగా ఉన్నాయి... మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే ప్రవేశద్వారం డిజైన్లలో చూపించారు... మంగళగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, నవులూరుకు సమీపంలో ఈ అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. ఇందులో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్‌ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్‌ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది.

amrita 14012018 3

అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీ 6వ ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పేందుకు వీలుగా ఎపి ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ఫిభ్రవరి మొదటి వారంలో నిర్మాణపనులకు శంకుస్థాపన జరపాలని, ఆగస్టులో నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా తెలిసింది. 20 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ క్యాంపస్ లనిర్మాణం జరగనున్నట్లు సమాచారం. దేశంలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read