మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, ఈ మీడియా చూపించదు... వారికి కత్తులు, సుత్తులు, మందు తాగి దొరికిన వారు, పక్కనోడి ప్రైవేటు లైఫ్ ల్లో ఏమి జరిగింది, ఇవే కావలి... ప్రజల ఆలోచనలు వీటి చుట్టూతా తిప్పుతున్నారు... పొద్దున్నే 7:30 గంటలకు చర్చలతో మొదలు, పడుకునేదాకా మన వార్తా చానల్స్ చూపించేది ఇదే... కాని మన రాష్ట్రం ఏమి చేస్తుందో, దేశం గుర్తించింది, ప్రపంచం గుర్తించింది... దౌర్భాగ్యం, ఇలాంటి మంచి పనులు మీద మన మీడియా చర్చలు పెట్టదు... మన బలం ఇదీ అని మీడియా ప్రజలకు చెప్పదు.. దాని వెనుక హైదరాబాద్ మాఫియా ఉంది అనుకోండి, అది వేరే చర్చ...
మొన్న సాక్షాత్తు భారత రాష్ట్రపతి మనల్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తే, ఇప్పుడు ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన రాష్ట్రాన్ని, రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబుని మెచ్చుకుంటూ అమెరికా నుంచి లెటర్ రాసారు... అసలు ఈ బిల్‌గేట్స్ ఎవరు ? మన దేశంతో ఈయనకు పని ఏమిటి, పైగా ఆంధ్రా ముఖ్యమంత్రి కి ఈయన కితాబు ఇవ్వాల్సిన పని ఏమిటి? ఎందుకంటే ఆయన మనం చేస్తున్న మంచి గుర్తించారు కాబట్టి... వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. గత నెలలో జరిగిన అగ్రిటెక్ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. భూసార పరీక్షల మ్యాపింగ్‌తో పాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు...
అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆ లేఖలో రాయటం... ఆరోగ్యరంగంలో చేపడుతున్న సంస్కరణలు, పొరుగు సేవల విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కితాబిచ్చారు. అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ భారత్‌లోనే ముందంజలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు... ఇంటి కుక్క మొరగనట్లు,పెరటి వైద్యం పనికి రానట్లు మన రాజకీయ పార్టీలు, మీడియా, సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయంలో చేస్తున్నారు.... ఏది ఏమయినా, ఎవరు ఎన్ని గడ్డలు వేసినా ఆంధ్రుల కలలు చంద్రబాబు గారు మాత్రమే సాకారం చేయగలడు. మీకు ప్రతి ఆంధ్రుడు అండ ఉంటుంది బాబుగారు, వీళ్ళని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి...