గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య, ఒక బిల్ పై జరుగుతున్న వార్ ఎట్టకేలకు ముగిసింది... ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పంపిన నాలా బిల్లును గవర్నర్ గురువారం ఆమోదించారు... నిన్న ఆ బిల్ పై వివరణ కావలి అంటూ గవర్నర్ బిల్ ను తిప్పి పంపారు... అయితే, చంద్రబాబు వాటన్నిటికీ సరైన విధంగా జవాబులు రాసి పంపటంతో, ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్.. నాలా బిల్లును ఆమోదించి ఏపీ ప్రభుత్వానికి తిరిగి పంపారు. అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం, రేపు ప్రధాని, ముఖ్యమంత్రి భేటీ నేపధ్యంలో, అనవసరమైన చర్చ దీని మీద లేకుండా, ముందుగానే గవర్నర్ ఆమోదించారు అని అంటున్నారు...

govener 1101218 2

ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సు తిప్పి పంపారు, అసెంబ్లీ తీర్మానించిన బిల్ తిప్పి పంపారు, ఒకటి రెండు సార్లు ఇది జరిగింది... 24 గంటల్లోనే ప్రభుత్వం మళ్ళీ తిప్పి అదే బిల్ గవర్నర్ కు పంపటంతో, నరసింహన్ కూడా ఇక ఈ వివాదం పొడిగించకుండా, బిల్ ఆమోదించారు... ఇంత తొందరగా ప్రభుత్వం రిప్లై ఇవ్వటం, రెండో సారి అదే బిల్ ప్రభుత్వం తిప్పి పంపటం, రేపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, అనవసర రచ్చ ఎందుకు అనుకున్నారో ఏమో, వివాదం సద్దుమణిగింది...

govener 1101218 3

భూ వినియోగ మార్పిడి (అగ్రికల్చర్‌ టు నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌ - నాలా) ఫీజు తగ్గింపు, ఇతర కీలక సవరణలపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పై గవర్నర్‌రాజముద్ర పడటంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు... గత కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు కూడా, ఈ విషయం పై గవర్నర్ మీద విమర్శలు చేస్తున్నారు... ఇదే రకమైన తెలంగాణా బిల్ గవర్నర్ ఆమోదించారు అని, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి, ఈ వివక్ష మంచిది కాదు అని విష్ణు కుమార్ రాజు అంటున్నారు... మొత్తానికి ఈ వివాదం సానుకూలంగా ముగిసింది...

నంది అవార్డుల ముసుగులో, హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ, కులాల మధ్య గొడవలు పెట్టి, సైకిల్ అవార్డ్స్, కమ్మ అవార్డ్స్ అంటూ, హడావిడి చేసిన బినామీ బండ్లకు, మరో షాక్ తగిలింది.. నెల క్రితం చెల్లని చెక్కులు ఇస్తూ, సొంత సినిమా వాళ్ళనే మోసం చేస్తున్న బినామీ బండ్లకు కోర్ట్ జైలు శిక్షతో పాటు, జరిమానా విధించిన విషయం తెలిసిందే... సామాన్య క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి, పెద్ద హీరోలతో బడా సినిమాలు ఎలా తీస్తున్నాడో అర్ధం కాని వాళ్లకి ఒక క్లారిటీ వచ్చింది... అయితే నిన్న బండ్ల పై మరో కేసు ఫైల్ అయ్యింది...

bandla 11012018 2

కులం పేరుతో తమను దూషించినందుకు కృష్ణవేణి అనే కౌన్సిలర్ వారిపై కేసును వేసింది. స్థల వివాదంలో, బ్యాంకుకు బండ్ల గణేష్ లోన్ చెల్లించాలి అనే షరతు ఉంది... బండ్ల ఆ లోన్ తీర్చలేదు... దీంతో బ్యాంకు అధికారులు ఇంటిని సీజ్ చేశారు. వేలం నిర్వహించి అమ్మేశారు. తనకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తమను గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో దూషించారంటూ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు ఇవ్వను అంటున్నాడు అని, అటు ఇల్లు పోయి, ఇటు డబ్బులు రాక, మమ్మల్ని అన్యాయం చేసాడు అంటున్నారు...

bandla 11012018 3

ఇలాంటి వాడిని ఏమన్నా అంటే, పోసాని లాంటి వాళ్ళు వచ్చి, మన అర్హతల గురించి ప్రశ్నిస్తారు... ఇలాంటి వారిని, మన జగన్ బ్యాచ్ సమర్ధిస్తుంది, ఎగదోస్తుంది... బొత్సా సత్యన్నారాయణ బినామీగా పేరు ఉన్న బండ్ల, ఒక రోజు ఆడియో ఫంక్షన్ లో, నేను మర్డర్ చేసినా, నన్ను బొత్సా వచ్చి రక్షిస్తారు అన్నాడు అంటే, ఏ స్థాయిలో ఇతగాడు ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు... ఇలాంటి 420 చీటింగ్ చేసే వాళ్ళు, మన దేశంలోనే విజనరీ రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుని నిందిస్తాడు... మనం చూస్తూ ఊరుకోవాలి... మన ఖర్మ కదా ఇది, ఇలాంటి వాడితో మాటలు పడటం...

అథెనా ఇన్ఫ్రా... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంబకోణం కేసులో పట్టుబడిన ఒక కంపెనీ... అయితే, ఈ అథెనా ఇన్ఫ్రా కంపెనీ పుట్టుక వెనుక చాలా మతలబు ఉన్నట్టు, సిబిఐ అప్పట్లోనే గుర్తించింది... దీని వెనుక అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక మేళ్ళు జరిగాయి అనే ప్రచారం ఉంది... జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ వెనుక ఉన్నారు అనే వార్తాలు కూడా వచ్చయి... సిక్కింలో జరిగిన పవర్ స్కాంలో కూడా ఈ కంపెనీ ఉంది... వైఎస్ సోదరుడు, వైయస్ రవీంద్రా రెడ్డితో పాటు, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ లుగా ఉండి బయటకు వచ్చారు... తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.. తరువాత ఆయన బయటకు వచ్చారు... అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీకాకుళంలో, కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చెయ్యటానికి 2450 ఎకారాలు ఇచ్చారు... ఇక్కడ పవర్ ప్లాంట్ వద్దు అని ఎంత చెప్పినా వినలేదు...

jagan 11012018 2

అయితే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ పై స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది... స్టేట్ బ్యాంకుకు 952 కోట్ల అప్పులు, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ కు 1407 కోట్ల అప్పులు ఉన్నాయని, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ బకాయలు తీర్చటం లేదు అని, అందుకే ఆ సంస్థను పై దివాలా ప్రక్రియ చేపట్టాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసాయి. ఈ సంస్థ దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఈ నెల 4న దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ దరఖాస్తులను విచారణకు స్వీకరించే అంశం పై ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది... ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ తీసుకున్న రుణాల పై కూడా ఎథెనా కంపెనీ హమీదారుగా ఉంది...

jagan 11012018 3

పారిశ్రామిక రంగంలో ప్రగతి పథంలో సాగుతున్న మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్, కార్వీ సంస్థ శివరామకృష్ణ, మరో సంస్థకు చెందిన తాతినేని వెంకటకృష్ణలను వైయస్ రాజశేఖర రెడ్డి చేరదీసి వారి ద్వారా కథంతా నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం ప్రజలు జగన్ ను కూడా నిలదీశారు... జగన్ 2014 ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం వచ్చినప్పుడు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ లో అనిల్ కుమార్‌కు వాటాలున్నాయనే విషయంపై వారు జగన్‌ను ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుకు అనుమతిచ్చిన విషయంపై కూడా వారు అడిగారు. రోజు నీతులు చెప్పే సాక్షిలో ఇలాంటి వార్తలు రావు, ఎందుకంటే ఇది జగన్ కు సంబంధించిన కంపెనీ కాబట్టి...

రెండు రోజుల అనంతపురం పర్యటనలో ఉన్న హిందూపురం ఎమ్మల్యే నందమూరి బాలకృష్ణ, ఇవాళ పెనుగొండలోని మడకశిర కూడలి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆనాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో నేడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ఆనాడు పెనుగొండ ప్రాంతంలో అరాచక శక్తులు రాజ్యం ఏలుతున్న సమయంలో పరిటాల రవీంద్రను, అందరి ఆట కట్టించారని, బాలకృష్ణ అన్నారు...

balayya 11012018 2

టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. నాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో నేడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని నేనే ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రాయలసీమలో పలు పరిశ్రమలు నెలకొల్పడంలో సీఎం చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.

balayya 11012018 3

తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా రాయలసీమకు నీరందించాలని ఆనాడే ఎన్టీఆర్ కలలుగన్నారని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ కలలను నిజం చేశారని తెలిపారు. దీనికి తోడు కియా, బెల్ నాసన్ తదితర పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సినిమా డైలాగులు చెప్పి అందరినీ ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు తరలి వచ్చారు.

Advertisements

Latest Articles

Most Read