ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చేస్తాం అంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఆ దిశగా ప్రజలతో మమేకం అవ్వల్సింది పోయే, దాడులు చేస్తున్నారు... ఎదుటి వారికి నీతులు చెప్పే వీరు మాత్రం, అసాంఘిక శక్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు... ఆయన పేరు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి... పోయిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మల్యేగా పోటీ చేసి ఓడిపోయారు... ఐదు కార్లలో వచ్చిన ఆయన అనుచరులు, వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా గేట్లు విరగ్గొట్టి, కౌంటర్‌ అద్దాలు పగులగొట్టి, అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యం చేసి, టోల్‌గేట్‌ వద్ద బీభత్సం సృష్టించారు. సార్ మీరు తప్పు చేసారు, నష్ట పరిహారం చెల్లించి వెళ్ళండి అని అక్కడ నిర్వాహకులు అంటే, ‘నువ్వేమి చేసుకుంటావో చేసుకో...నష్ట పరిహారం ఇచ్చేది లేదు’ అంటూ సురేష్‌రెడ్డి నిర్వాహకులతో దురుసుగా వ్యవహరించారు.

nellore 01012018 1

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి ఆయన అనుచరులు శనివారం ఉదయం ఐదు కార్లలో బయలుదేరారు. వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా ఫ్రీ గేట్లు వద్ద కార్లు ఆగాయి. గేట్లు ఎత్తాలని సిబ్బందిని కోరారు. ఫ్రీ పాస్‌ ఉంటే తప్ప గేట్లు ఎత్తలేమని సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు. ‘రే...సురేష్‌రెడ్డి వస్తే గేట్లు తీయవా’అని ఆగ్రహించిన అనుచరులు గేట్లు, కౌంటర్‌ అద్దాలను ధ్వంసం చేశారు.

nellore 01012018 1


శనివారం సాయంత్రం తిరిగి వస్తుండగా టోల్‌ప్లాజా నిర్వాహకులు జరిగిందేదో జరిగిపోయింది..సర్దుబాటు చేసుకుం దాం...నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. దీనికి సురేష్‌రెడ్డి అంగీకరించకుండా మరోసారి దురుసుగా ప్రవర్తించారని టోల్‌ప్లాజా సెక్యూరిటీ మేనేజర్‌ పట్రా శివరాం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్లు, గార్డు గురవయ్య, గన్‌మెన్‌ మురళీశర్మలపై దాడి, దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు క్రైమ్‌ నెంబరు 321/17తో సురేష్‌రెడ్డి మరో ఏడుగురిపై 427, 352, 506, 290 ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంక్రాంతి కంటే ముందే వస్తున్న నవక్రాంతి ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం అని, పదకొండు రోజులు కొనసాగే పెద్ద పండుగ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ ఆయన 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల సంబరమైతే ఇది 11 రోజుల పండుగ అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా స్వగ్రామాలకు తరలివచ్చి రెండో తేదీ నుంచి ఆరంభం కానున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరానికి నూతన సంకల్పం తీసుకోవాలని కోరారు.

chandrababu 311122017 1

పుట్టిన నేల రుణం తీర్చుకోవాలని, పల్లెల్లో నవక్రాంతులు నింపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పదహారు వేల కోట్ల ద్రవ్య లోటుతో నవ్యాంధ్ర ప్రయాణం నలభై రెండు నెలల క్రితం ప్రారంభమైందని, దశాబ్దాలుగా నినాదంగా మోగిన నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా నిజం చేశామని చంద్రబాబు చెప్పారు. కృష్ణానది ఎగువ ప్రాజెక్టుల నుంచి చుక్కనీరు రాని తరుణంలో పట్టిసీమ ద్వారా గోదావరి నదీ జలాలను ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చామన్నారు. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలో పట్టిసీమ గోదావరి జలాలతో 18 వేల కోట్ల విలువైన పంట రైతుల ఇంటికి చేరిందని, గోదావరి సారవంతమైన ఎర్రని నీటితో కృష్ణా డెల్టా రైతులు అధిక దిగుబడులు సాధించారని అన్నారు. నదుల అనుసంధానం చేసి రైతాంగం కళ్లల్లో ఆనందం చూసి, ఇటీవల ప్రకాశం బ్యారేజీ 60 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు తానెంతో గర్వించానని చెప్పారు.

విభజన నాడు 22.5 మి.యూ విద్యుత్తు లోటుఉందని, నిరంతర విద్యుత్తు పథకంతో 3 నెలల్లోనే సాధారణ పరిస్థితికి తెచ్చామని, ఏడాదికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు తెలిపారు. సమన్యాయం లేకుండా, అశాస్త్రీయంగా జరిగిన విభజనతో ఆరుదశాబ్దాల కష్టం వృధా అయ్యిందని, అయినా కోలుకొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఏడాదిన్నర లోగానే వెలగపూడిలో సచివాలయం నిర్మించి, ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చి సొంతగడ్డ నుంచి పాలన ప్రారంభించామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలను భూసమీకరణ చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభించామని చంద్రబాబు చెప్పారు. ఆర్ధికంగా ఒడిదుడుకుల్లో ఉన్నా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ ఉపశమనం అమలు చేశామని, 45 లక్షల సామాజిక పింఛన్లు అందజేస్తున్నామని శరవేగంగా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతర శ్రమతో, పటిష్ట వ్యూహంతో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక నుంచి రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉంటాను అని చెప్పిన సంగతి తెలిసిందే... ప్రజారాజ్యం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో, పవన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు... ఇప్పటి వరకు అసలు పార్టీ నిర్మాణం ఏమి జరగలేదు... ఇన్నాళ్ళు ఒక్క పవన్ తప్ప, జనసేన అనే పార్టీ నుంచి ఎవరూ లేరు... ఎక్కువగా ట్విట్టర్ నుంచే పవన్ పోరాటాలు అనే విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి... వీటన్నిటికీ పవన్ ఇక ఫుల్ స్టాప్ పెట్టనున్నారు... ఇక పార్టీ నిర్మాణం పై శ్రద్ధ పెట్టి, వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీని సన్నద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భగంగా, ఇవాళ 2017 చివరి రోజున కీలకమైన పొలిటికల్ కార్యక్రమం చెప్పట్టారు పవన్...

pawan 311122017 2

జ‌న‌సేన స‌భ్య‌త్వ న‌మోదును ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించారు. తొలి స‌భ్య‌త్వాన్ని ఆయ‌న స్వీక‌రించారు. అలాగే పార్టీ ముఖ్యుల‌కు స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేశారు. స‌భ్య‌త్వ న‌మోదుకు రూపొందించిన సాప్ట్ వేర్ పై సంతృప్తి వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ .. త్వ‌ర‌లోనే రెండు రాష్ర్టాల్లో జ‌న‌సేన స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. మూడు రోజులుగా పార్టీ ఆఫీసులో అనుచ‌రుల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్ .. కొత్త సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్‌లో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

pawan 311122017 3

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంకల్పించారు. ఈ విషయమై ఆదివారం పార్టీ పరిపాలన కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, యాప్స్‌ సాంకేతిక వివరాలను జనసేన ఐటీ విభాగం నాయకులు ఆయనకు ఈ సందర్భంగా వివరించారు. వాటిని ఆయన పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.కొద్ది రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం అందరూ తీసుకునే విధంగా ప్రారంభించబోతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ప్రతినిధులకు వెల్లడించారు.

ఎక్కడ పెనుకొండ ? ఎక్కడ కొరియా దేశం ? దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి పెట్టిన కియా మోటార్స్, మన రాష్ట్రం అనంతపురం జిల్లా, పెనుకొండలో కార్ల తయారీ పరిశ్రమ పెడుతున్న విషయం తెలిసిందే... 13 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న కియా మోటార్స్, 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది... అంతే కాదు, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరకనుంది.... ఇక్కడ కొరియా టౌన్షిప్ కూడా రానుంది... కియా కాక, మరెన్నో కంపెనీలు రానున్నాయి... కొన్ని వేల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు, మరిన్ని పరోక్ష ఉద్యోగాలు కూడా రానున్నాయి... అయితే ఈ పరోక్ష ఉపాధి అప్పుడే మొదలైంది కూడా...

anantpur 31122017 2

ఇప్పటికే దక్షిణ కొరియా నుంచి అనేక మంది కియా కంపెనీ ప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నారు... ఇక్కడే కొంత మంది ఉండి, పనులు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పనులు సాగిస్తున్నారు... ఈ క్రమంలో, కొరియా దేశస్తుల కోసం ప్రత్యేకంగా ఒక రెస్టారంట్ కూడా పెంకొండలో ఓపెన్ అయ్యింది... అంతే కాదు కొరియా నుంచి వచ్చే ఇక్కడ స్థిర పడే వారిక కోసం, ప్రత్యేకంగా అపార్ట్ మెంట్లు కడుతున్నారు అక్కడ బిల్డర్లు... అక్కడ కొరియా భాషలోనే బ్యానర్లు కడుతున్నారు... వారికి అర్ధం అయ్యేలా, ఫ్లాట్ల వివరాలు రాస్తున్నారు...

anantpur 31122017 3

అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉండేది, అభివృద్ధి అంటే ఒక ఎకో సిస్టం క్రియేట్ అవ్వాలి అని... ఎదో ఒక కంపెనీ పెట్టి, 10 ఉద్యోగాలు ఇవ్వటం కాదు... ఇలా పరోక్ష ఉపాధితో, ఆ ప్రాంతం, ఆ జిల్లా మొత్తం అభివృద్ధి చెందాలి... కియా మోటార్స్ ప్లాంట్ కోసం, స్పేర్ పార్ట్స్ తయారు చేసే మరో 150 చిన్న తరహా పరిశ్రమలు కూడా అక్కడ రానున్నాయి.. ఈ 150 కంపెనీలలో దాదాపు మరో 7-8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి... అంతే కాదు, ఎందరికో పరోక్ష ఉపాధి దొరకనుంది... ఆ ప్రాంతంలో రెట్లు పరుగుతాయి... ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుంది... చంద్రబాబు చేసే అభివృద్ధి అంటే ఇది... ఈ దెబ్బతో పెనుకొండతో పాటు అనంతపురం రూపు రేఖలు మారిపోనున్నాయి...

Advertisements

Latest Articles

Most Read