వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ... ఈ పార్టీ అధినేత జగన్ దగ్గర నుంచి, కింద స్థాయి కార్యకర్తలు దాకా, అందరికీ ఒక క్వలిఫికేషన్ ఉంటుంది... అదే కేసులు, బెయిలు, జైళ్ళు... ఇవి లేకుండా ఆ పార్టీలో ఉండటం కష్టం... బలాబలాలు బేరీజు వేసుకునేప్పుడు, ఎన్ని కేసులు ఉన్నాయి అని చూసుకుని గుర్తింపు ఇస్తారని కాబోలు, ఆ పార్టీలో అందరూ, ఎదో ఒక పిచ్చి పని చేసి, కేసుల్లో ఉంటూ ఉంటారు, అధినేత మన్ననలు పొందుతారు.. అదే కోవలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి నెంబర్ వన్ 420 అని, అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, కుట్రపూరితంగా వ్యవహరించారు అని, సాక్షాత్తు ఇమిగ్రేషన్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు.

kakani 30122017 2

ఇప్పుడు తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి చేసిన ఫోర్జరీ పత్రాల పై, తద్వారా తన కుటుంబ సభ్యుల పరువు బజారున పెట్టినందుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ. 5కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ, కొన్ని డాకుమెంట్లు బయట పెట్టారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియాకు వెళ్లినట్లు, అక్కడ ఆయనకు స్థిరాస్తులు, బ్యాంకుల్లో నగదు ఉన్నాయని, థాయ్‌లాండ్‌లో సోమిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు పవర్‌ప్రాజెక్టు ఉందని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. 2016 డిసెంబరులో ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను అందించారు.

kakani 30122017 3

దీని పై సోమిరెడ్డి డిసెంబరు 28న నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవన్నీ నకిలీ పత్రాలని, తనకు విదేశాల్లో ఆస్తులు లేవని, దీనిపై విచారణ జరపాలని కోరారు. పోలీసు విచారణలో, కాకాణి చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని తేల్చారు. ఆయన బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన ధ్రువీకరణను జత చేసి, నెల్లూరు మొదటి తరగతి నాల్గో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియా వెళ్లినట్లు ఆధారాల్లేవని.. అసలు ఆయన పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయనేలేదని ఇమిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. చిరంజీవి అనే వ్యక్తితో కలిసి, లక్ష రూపాయలు ఇచ్చి, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తాయారు చేసారని, చిరంజీవితో పలు సార్లు ఫోన్‌లో మాట్లాడడం, మెసేజ్‌లు ఇవ్వడం వంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించి చార్జిషీటులో పొందుపరిచారు.

మొత్తుకున్నారు... పాకులాడారు... పండుగ పూట నాగపూర్ వెళ్లారు... విదేశీ పర్యటన షడ్యుల్ మార్చుకుని మరీ కేంద్ర మంత్రికి ఆవేదన అంతా చెప్పారు... రెండు నెలలు అవుతుంది అయినా కేంద్రం నుంచి స్పందన లేదు... ఇప్పుడు చంద్రబాబు మాటే నిజం అయ్యింది... చంద్రబాబు పడుతున్న తపన, ఇప్పుకైనా కేంద్రానికి అర్ధమవుతుందా ? పోలవరం కాంట్రాక్టర్ విషయంలో, ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్‌స్ట్రాయ్‌ ని మార్చమని చంద్రబాబు ఆరు నెలల నుంచి మొత్తుకున్నారు... కేంద్రం మాత్రం కుదరదు అని చెప్పేసింది... కాని, ఇప్పుడు విషయం మొత్తం తారు మారు అవుతుంది.

polavaram 30122017 2

ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కోరింది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది. ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంట్రాక్టు సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండదు. అప్పుడు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి సంక్లిష్టమైన, అతిముఖ్యమైన కాంక్రీట్‌ పనులు ముందుకు సాగవు. ఇదే జరిగితే ఇక పోలవరం ఎప్పటికి పర్తవుతుందో దేవుడుకే తెలియాలి. ట్రాన్‌స్ట్రాయ్‌ కంపెనీకి సామర్ధ్యం లేక పోయినా, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం అప్పగించింది... చంద్రబాబు ప్రభుత్వం రాగానే, వీరి సామర్ధ్యం తెలిసి, పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌తో పాటూ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, బావర్, కెల్లర్, బీకెమ్, ఫూట్జ్‌మీస్టర్, పెంటా సంస్థలకు పనులు అప్పగించి, పనులు పరిగెత్తించారు...

కాంక్రీట్ పనులకు వచ్చే సరికి ట్రాన్స్‌ట్రాయ్‌ సంగతి తెలిసే, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లు పిలిచి కొత్త సంస్థకు పనులు అప్పగించాలని భావించారు. టెండర్లను కూడా పిలిచారు. అయితే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాము టెండర్లను ఎందుకు పిలవాల్సి వచ్చిం దో వివరించేందుకు ముఖ్యమంత్రి బృందం ఇటీవల ఢిల్లీలో జలనవరుల మంత్రి నితిన్‌ గడ్కరీనీ కలిసిన సంగతి తెలిసిందే. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ఆర్థికంగా చితికిపోయిందని, కాంక్రీటు పనుల్లో కొంత భాగం కొత్త సంస్థకు అప్పగించాలని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ట్రాన్‌స్ట్రాయ్‌కు మరో రెండు నెలలు గడువిద్దామని కేంద్ర మంత్రి చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోపే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తిచేయాలని.. లేదంటే ఒక నీటి సంవత్సరం నష్టపోతామని చంద్రబాబు ఎంత చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. దక్షిణ కొరియా పర్యటన సమయంలోనూ గడ్కరీతో ముఖ్యమంత్రి ఈ అంశంపై ఫోన్లో మాట్లాడారు. అయితే గడ్కరీ తన వాదనకే కట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా, ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే అప్పుడు కొత్త కాంట్రాక్టుర్ కోసం వెతకాల్సిందే... లేకపోతే కేంద్రం ఇంత జరిగినా, ట్రాన్‌స్ట్రాయ్‌ను మార్చకపోతే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో, అసలు అవుతుందో లేదో కూడా చెప్పలేం...

రాష్ట్ర సమస్యల పై ఇప్పటి వరకు మిత్రపక్షానికి గౌరవం ఇస్తూ సహకరించిన తెలుగుదేశం పార్టీ, ఇక రాష్ట్ర సమస్యల పై ఉపేక్షించేది లేదు అనే సంకేతాలు ఇచ్చింది.. మిత్రపక్షంలో ఉంటూ బీజేపీతో తెలుగుదేశానికి ఇబ్బంది ఉన్నా, వైసీపీ ఏ నాడూ రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదియ్యలేదు... దీంతో ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోవటంతో, ఇక మిత్రపక్షమైన తెలుగుదేశమే రంగంలోకి దిగింది... మా సమస్యలు గురించి చెప్పండి అంటూ, నిన్న కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరీ నిలదీసి ఆశ్చర్యపరిచారు.. ఇవాళ రామ్మోహన్ నాయుడు, గల్లా జయిదేవ్ పార్లమెంట్ లో ప్రైవేటు మెంబెర్ బిల్ పెట్టి, కేంద్రం మీద హీట్ పెంచేశారు...

jaydev 29122017 3

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతో పటు, సవరణలపై లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, ప్యాకేజీ పదేళ్ల పాటు అమలయ్యేలా చట్టబద్దత కల్పించాలని ఆయన అన్నారు. కేంద్ర సహాయ ప్రాజెక్టులకు పదేళ్లపాటు కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకి ఖర్చు అంతా కేంద్రమే పెట్టుకోవాలి అని అన్నారు...

jaydev 29122017 2

అలాగే మరో పక్క, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ లో రైల్వే జోన్ పై ప్రైవేటు బిల్ ప్రవేశపెట్టారు... మరో పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి పోలవరం పై కేంద్రంతో చర్చలు జరుపుతూ రంగంలోకి దిగారు... అలాగే కాపులు రిజర్వేషన్ అంశం కూడా ఇప్పటికే కేంద్రం కోర్ట్ లో ఉంది... ఇలా అన్ని వైపుల నుంచి ఇప్పటి వరకు కేంద్రం అవలంభిస్తున్న తీరు పై, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుంది. కేంద్రం ఈ రెండు బిల్లుల పై తన వైఖరి స్పష్టం చేయ్యనుంది... ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు వివరిస్తుంది... ఈ విధంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి, పనులు పూర్తి చెయ్యటానికి, తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ ఎంపీల చేత పార్లమెంట్ లో హీట్ పెంచేస్తుంది.

నిన్న శుక్రవారం కదా... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి శుక్రవారం గురించి బాగా తెలుసు... రాష్ట్రాన్ని దోచేసి, సర్వ నాశనం చేసిన వారిని విచారించే రోజు... 16 నెలలు జైలు జీవితం అనుభవించి, షరతుల పై బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు A1, A2... దేశ అత్యున్నత విచారణా సంస్థలు అయిన సిబిఐ, ఈడీ 11 కేసులు పెట్టి లోపల వేశారు.. అందుకే ప్రతి శుక్రవారం ఎక్కడ ఉన్నా విచారణకు హాజరు అయ్యే జీవితాలు అవి... ఇంత గొప్ప ఘనకీర్తి కలవారు, రాజ్యసభ ఉంది అనే వంకతో A2 శుక్రవారం కోర్ట్ ఎగ్గొట్టి, భారత దేశ ప్రధానిని కలిసారు.... 11 కేసుల్లో దొంగలు అని దేశ అత్యున్నత విచారణా సంస్థలు అయిన సిబిఐ, ఈడీ అభియోగాలు మోపి, విచారణ జరుగుతున్న సందర్భాలో, దేశ ప్రధాని, ఇలా A2ని కలవచ్చా ?

vijayasai 30122017 1

సరే, కలిసారు... ఈ భేటీ నిన్న ఉదయం 11:20కి, 15 నిమిషాలపాటు జరిగింది... నిన్న రాత్రి దాకా, అసలు ఈ భేటీ అజెండా ఏంటో బయటకు రాలేదు... మర్యాదపూర్వకంగా కలిశారు అని ప్రచారం జరిగింది... సామాన్యంగా ప్రధానిని కలిస్తే నానా హంగామా చేస్తారు... ఇక సాక్షి అయితే, రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ మేము ఉద్దరిచ్చేస్తున్నాం అన్నంత బిల్డ్ అప్ ఇస్తుంది... కాని ఈ సారి అలా జరగలేదు... రాత్రి దాకా అసలు ఈ భేటీ ఎందుకు జరిగిందో ఎవరికీ తెలీదు... చివరకు సాక్షి కవరింగ్ చేస్తే, ఒక స్టొరీ అల్లింది... ఆ భేటీ ఎందుకు జరిగిందో చెప్పింది... ఆ భేటి ఎజెండా వింటే ఎంతో కామెడీగా ఉంటుంది...

vijayasai 30122017 1

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయానికి, విజయసాయి రెడ్డి ముగ్ధుడు అయ్యి, ప్రధానిని అభినందించారు అంట.. అంతేనా, నిన్న వైకుంఠ ఏకాదశి కదా, అందుకే విష్ చెయ్యటానికి వెళ్లారు అంట... ఈ రెండిటితో ఆపితే అది సాక్షి ఎందుకు అవుతుంది... అసలు కామెడీ ఇది... వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర వివరాలను, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి ప్రధాని మోదీకి తెలిపారు అంట.. ఆ స్పందన గురించి తెలుసుకున్న ప్రధాని, ఆశ్చర్యపోయారు అంట... ఇది ఆ భేటీ ఎజెండా అని సాక్షి తెలిపింది... ఇది విషయం... ఇలాంటి అవినీతి కేసుల్లో ఉన్నోడిని, ప్రధాని స్థాయి వ్యక్తి కలిసి సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారో ?

Advertisements

Latest Articles

Most Read