కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పని చేసిన మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు వంటి డైనమిక్‌ ముఖ్యమంత్రి ఉన్నారని మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా అన్నారు. ఆయన చేపట్టిన కొత్త రాజధాని నిర్మాణం అమరావతి వల్ల పదేళ్లలో ఏపీలో అద్భుత ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థికసంఘం శతవార్షిక సమావేశాలకు గుంటూరు వచ్చిన సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

montek 30122017 2

అమరావతి నిర్మాణం అంటే ఉద్యోగాల కల్పనే అని, ఆంధ్రప్రదేశ్ కి విశాలమైన తీర రేఖ ఉండటంతో కొత్త పోర్టులకు అవకాశం ఉందన్నారు... కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చాలా తెలివైన పని. ఎన్నో పెట్టుబడులు వస్తాయి. దేశవిదేశాల నుంచి అనేకమంది ఇక్కడికి వస్తారు. రాత్రికి రాత్రి జరిగిపోదు కానీ, అమరావతి వల్ల పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పగలను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న వ్యక్తి సియంగా ఉండటం, రాష్ట్రానికి ఏంతో మేలు చేస్తుంది అని అన్నారు...

montek 30122017 3

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారని అన్నారు. రానున్న ఐదు, పదేళ్లలో 8 శాతం లక్ష్యంగా పనిచేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని అన్నారు. రెండుమూడేళ్లగా వ్యవసాయరంగ వృద్థి తగ్గుతూ వస్తోందని, వ్యవసాయ రంగానికి దూరమౌతున్న వారికి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఇతర రంగాల్లో ఉపాధి కల్పించాలని, ఇదే సమయంలో నగరాలను విస్తరించాలని అన్నారు. అమరావతి లాంటి కొత్త సిటీలు ఈ దేశానికీ ఎంతో అవసరం అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మంచి పనులు చేసుకున్నా ప్రచారం చేసుకోవటం చేతకాదు అనే అపవాద ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే జరిగే వాస్తవాలు తెలిసిందే... ఇక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అయితే సరే సరి... వారు ఎప్పుడూ కంప్లేట్ స్లీప్ మోడ్ లో ఉన్నారు. వారికి అసలు ఏదీ పట్టదు. అవతలి వారు అకారణంగా బురద జల్లుతున్నా మొత్తం తగలబడిన తరువాత తాపీగా వచ్చి, ఇది వాస్తవం అని చెస్తారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీ ఎలాగూ వారు చేసింది చెప్పుకోవటం లేదు మేమైనా వారు చేసిన మంచి చెప్తాం అనుకుంటారో ఏంటో, ప్రతి సారి వైసీపీ ఎంపీలు ఎంతో ఆశతో పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటం, ప్రతి సారీ కేంద్రం, లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పటం...

ycp mp 30122017 2

ఇలా ప్రతి సారి, రాష్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అని ప్రశ్నలు అడిగితే, అది బుమరాంగ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అనే వాదన బయటకు వస్తుంది. తాజాగా, మరో సారి ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకుని, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం వైసీపీ ఎంపీల ద్వారా, పార్లమెంట్ సాక్షిగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుంది అని ఆర్ధిక లోటు తగ్గిపోతుంది అని చెప్పెంది... 14వ ఆర్థిక సంఘం సూచించినట్లుగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. శుక్రవారం లోకసభలో వైకాపా సభ్యుడు వైవీసుబ్బారెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 3.94% మేర ఉన్న రాష్ట్ర ఆర్థిక లోటు 2017-18నాటి సవరించిన అంచనాల ప్రకారం 3%కి తగ్గినట్లు పేర్కొన్నారు.

ycp mp 30122017 3

ఇదే సమయంలో సొంత పన్ను ఆదాయం 5.67% నుంచి 7%కి పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదికి ఆంధ్రప్రదేశ్ కు రూ.4118 కోట్ల రెవిన్యూలోటు ఏర్పడినట్లు గుర్తించి ఇప్పటి వరకూ ప్రత్యేక సాయం కింద రూ.3980 కోట్ల అందించినట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా బదిలీ చేసిన ఆనంతరం ఏపీకి ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీ కోసం 2015-20 కాలానికి రూ.22,212 కోట్ల ఇవ్వాలని ఆర్థిక సంఘం సూచించిందన్నారు. అందులో ఇప్పటివరకూ రూ.14,862 కోట్లు ఇచ్చామన్నారు. 2015-16లో రూ.6609 కోట్లు, 2016-17లో రూ.4930 కోటు, 2017-18లో రూ.3323 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అలాగే ఇంకో ప్రశ్నలో ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయి అని అడిగి, అక్కడా అభాసు పాలయ్యారు.. మరో ప్రశ్నలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేంద్రాన్ని స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అడిగారా అని ప్రశ్న వేస్తే, ముఖ్యమంత్రి అడిగారని కేంద్రం సమాధానం చెప్పింది.. ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్పుకోవటంలో విఫలం అయితే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం వారి ప్రశ్నలతోనే, చంద్రబాబు పరిపాలన అద్భుతం అంటూ, సాక్ష్యాలతో సహా వారే స్వయంగా పార్లమెంట్ సాక్షిగా బయట పెడుతున్నారు...

రాష్ట్రానికి రావల్సిన మరో సంస్థ, కేంద్రం గుజరాత్ కి తీసుకెళ్ళి పోయింది... దేశంలో తొలిసారిగా రైల్‌ యూనివర్సిటీ పెడుతున్నారు అని తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా స్పందించారు.. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక రైల్‌ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదిస్తూ లెటర్ రాసారు... అయితే, అన్నిటి లాగానే, ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనల పై కూడా కేంద్రం నీళ్లు చల్లింది. ఈ విషయం స్వయంగా కేంద్రమే రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించింది.

cbn 30122017 1

ఈ యూనివర్సిటీని గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహెయిన్‌ శుక్రవారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైల్‌ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు గతంలోనే కోరినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిని వడోదరలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఈ నెల 20న ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పామని చెప్పారు...

cbn 30122017 1

భవిష్యత్తులో మరో రైల్‌ వర్సిటీని నిర్మించాలని భావిస్తే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టే విషయం పరిగణనలోకి తీసుకుంటామని బంపర్ ఆఫర్ ఇచ్చారు... దీంతో ప్రతిష్టాత్మక రైల్‌ యూనివర్సిటీ పై కూడా రాష్ట్రం ఆశలు వదులుకుంది... దీంట్లో రాష్ట్రానికి జరిగిన ఇంకో నష్టం ఏంటి అంటే, చంద్రబాబు రాష్ట్రంలో రైల్‌ యూనివర్సిటీ పెట్టమని ప్రతిపాదిస్తే, దానికి స్పందించి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని కేంద్రం అడగటం, దానికి రాష్ట్రం స్పందించి సవివరంగా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వటం, చివరకి అది చెత్త బుట్టలో పడేసి, ప్రాజెక్ట్ గుజరాత్ తీసుకుపోవటం చకచక జరిగిపోయాయి...

ఈ దొంగ సాక్షి, దొంగ రాతలు గురించి చెప్పీ చెప్పీ మాకు విసుగు వస్తుంది... కాని, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది కాబట్టి, వీరి దొంగ రాతలను ప్రజలకు తెలిసేలా చేసి, ఇలాంటి వారిని ఎండగట్టటం కోసం తప్పటంలేదు... రోజుకి ఒక తప్పుడు కధనం రాయటం, దానికి ఒక క్రియేటివ్ స్టొరీ అల్లటం, చంద్రబాబు టెక్నాలజీ వాడి ఆ దొంగ రాతలని పట్టుకోవటం... జగన్ పాదయత్ర మొదలైన దగ్గర నుంచి ఇదే సీన్... ఎన్ని సార్లు దొరికినా, ఎన్ని సార్లు మీవి తప్పుడు రాతలు అని చెప్పినా, సాక్షి మాత్రం అన్నీ వదిలేసి, అవే తప్పుడు కధనాలు రాస్తుంది...

sakshi 30122017 1

నిన్న ఒక అద్భుతమైన స్టొరీ అల్లింది... సినిమాల్లో సెంటిమెంట్ స్టొరీ లాగా, సీన్ బాగా పండింది... తీరా చూస్తే, ఎప్పటిలాగే దొరికిపోయారు... విషయంలోకి వెళ్తే, "ఆదుకునేవారే లేరప్ప!" అంటూ ఒక వికలాంగుడికి పెన్షన్ రావటం లేదు అని కధ సారంశం... ఇవన్నీ 1980 ఐడియాలు... ఇప్పుడు మనం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ కాలంలో ఉన్నాం... దొంగ ఇట్టే దొరుకుతాడు... అలా ఇలా కాదు, ఏ టైంలో, ఎక్కడ పెన్షన్ తీసుకుంది డీటెయిల్స్ అన్నీ రియల్ టైంలో బయటపడి పోతాయి.... సాక్షి దొంగ రాతలని పట్టుకున్నాకా, "ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకు, చంద్రబాబు ఆదుకున్నారప్పా" అని హెడ్డింగ్ రాయాలి..

sakshi 30122017 1

sakshi 30122017 1

చిత్తూర్ జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓబీ నాయక్‌ తాండాకు చెందిన బాలనాగమ్మ, జగన్ ను కలిసి నా భర్త అశోక్ నాయక్ కు జబ్బు చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి అని, ప్రభుత్వం పెన్షన్ ఇవ్వట్లేదు అని, రేషన్ ఇవ్వటంలేదు అని చెప్పినట్టు సాక్షి కధనం అల్లింది... తీరా రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో వివరాలు చూస్తే, జనవరి 2017 నుంచి ప్రతి నెలా 1500 పెన్షన్ తీసుకుంటున్నాడు (Pension ID : 110803761)... ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు... డిసెంబర్ నెలలో, డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటల 34 నిమషాల 59 సెకండ్లకు రేషన్ తీసుకున్నట్టు, రాగులు 3కేజీలు, 35 కిలోల బియ్యం తీసుకున్నట్టు డ్యాష్ బోర్డు చూపించింది... దీంతో సాక్షి రాతలని, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ మరోసారి పట్టేసింది...

Advertisements

Latest Articles

Most Read