కొత్త జిల్లాల అంశం, రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వేడిని రగిలిచింది. కొత్తగా వేడి ఏముందిలే అంటారా. ఒక సమస్యను పక్కదోవ పట్టించటానికి మరో సమస్యను ప్రభుత్వం తెచ్చి ముందు పెట్టింది. మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా, ప్రజలు ఎలా కొట్టుకుంటున్నా, ఎన్టీఆర్ జిల్లా పై వైసీపీ, బ్లూ మీడియా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అసలు ఎన్టీఆర్ కు తామే వారసులం అన్నట్టు బిల్డ్ అప్ ఇస్తూ, చంద్రబాబు పై ఎదురు దా-డి చేస్తున్నారు. మా జగన్ కు కృతఙ్ఞతలు చెప్పాలని గోల గోల చేస్తున్నారు. దీని పై టిడిపి అదిరిపోయే కౌంటర్ అటాక్ ఇచ్చింది. రోశయ్య కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టారని, అప్పుడు రోశయ్యను జగన్, ఆయన తల్లి కృతజ్ఞత చెప్పరా అని ప్రశ్నించటంతో, వైసీపీకి సౌండ్ లేకుండా పోయింది. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి, అన్న క్యాంటీన్ లు ఎత్తేసిన విషయం, ఎన్టీఆర్ పేరుతో ఉన్న పధకాలు ఎత్తేసిన విషయం చెప్తూ, ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఉంటే, ఇవి ఎందుకు ఎత్తేసారని, ఎన్టీఆర్ విగ్రహాలు ఎందుకు కూలగొడుతున్నారని, ఎన్టీఆర్ కూతురు పై విష ప్రచారం ఎందుకు చేసారని, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు, ఎన్టీఆర్ పేరు తీసేసిన విషయం, ఇలా మొత్తం డేటాతో కౌంటర్ ఇచ్చే సరికి, వైసీపీకి సౌండ్ లేకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతుందో. జనవరి నెల జీతాలు, ఫిబ్రవరి ఒకటో తారీఖున, కొత్త పీఆర్సి ప్రకారం వేయాలని, ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగుల పై ఒత్తిడి తెస్తుంది. వాళ్ళు మాత్రం, తాము పాత పీఆర్సి ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేస్తామని అంటున్నారు. అయితే ఈ రోజు ప్రభుత్వం వారికి వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, వార్నింగ్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్యోగ సంఘాలు, తమకు పాత పీఆర్సి ప్రకారమే జీతాలు వేయాలని, తమను బెదిరించి చర్యలు తీసుకుంటాం అంటే, ఇప్పుడే సమ్మెకు దిగుతాం అని వార్నింగ్ ఇస్తున్నారు. సచివాలయం ఉద్యోగులు ఈ రోజు కూడా మధ్యాహ్న నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఒక ర్యాలీగా సచివాలయం లో అన్ని బ్లాకులు తిరుగుతూ తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామి రెడ్డి కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భం గా ఆయన కొన్ని కీలక మైన వ్యాఖ్యలు చేసారు. సోమవారం నుంచి సచివాలయం లో కూడా రిలే నిరాహార దీక్షలు చేపడతామని ,ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

employees 27012022 2

ఈ నిరసన కార్యక్రమం ఈ నెల ఆఖరి వరకు జరుగుతాయని తెలిపారు . మరో వైపు ప్రభుత్వమేమో నిన్న అర్ధరాత్రి అధికారులకు లకు కొత్త PRCని అమలు చేసి ఫిబ్రవరి 1 వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఒక సర్కులర్ ఇచ్చింది . ఆ సర్కులర్ గురించి కూడ వెంకట రామి రెడ్డి తీవ్రంగా మండి పడ్డారు. పాత జీతాలే వెయ్యాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. కొత్తగా జీతాలు వేస్తే మా ఉద్యమం ఆగదని కూడా ఆయన స్పష్టం చేసారు. సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలకు పూర్తిస్థాయిలో సిద్దం అవ్వాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. ఈ కొత్త PRC తో ఉద్యోగుల జీతాలు తగ్గుతాయి అని చెప్పినా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన మండి పడ్డారు. ఇదే జీతాలు ఇస్తే గనుక ఉద్యోగులు జీవితాంతం నష్ట పోతారని ,ఈ ఉద్యమం చేయక పోతే మా భవిష్యత్ తరాలు కూడా నష్ట పోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల కమిటీ ఈరోజు స్టీరింగ్ కమిటీ కి పిలిచినప్పటి కూడా ఉదోగస్తులు తాము రావని కూడా తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే వాటిలో ముఖ్య కారణం ఆనాడు జగన్ ఇచ్చిన హామీలే. అందులో అతి ముఖ్యమైనది క్రిస్టియన్ చర్చిలు ఫాదర్ లకు తాము అధికారం లోకి రాగానే 5 వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు అర్హులో జాబితా తయారు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ చర్చి ఫాదర్ ల జాబితా విడుదల చేసారు . కాని ప్రభుత్వం విడుదల చేసిన ఈలిస్టు షాక్ కు గురిచేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్ధికంగా వెనుక బడిన చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం కింద 5 వేలు ఇస్తామని ఎలక్షన్స్ టైం లో హామీ ఇచిన సంగతి తెలిసిందే. ఐతే ఏకంగా 16 వేల పాస్టర్లు ఈ గౌరవ వేతనం పొందటం కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల్లో ఎంతమంది అర్హులో తేల్చమని గ్రామా సచివాల వాలంటీర్లకు ఈ పని అప్పచెప్పింది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని కోసం 16 వేల మంది దరఖాస్తు చేయగా కేవలం 500 మందినే అర్హులుగా తేల్చారు. అయితే ఈ పధకానికి అర్హత పొందాలంటే ప్రభుత్వం పెట్టిన షరతులు ఇవే .. ఆ చర్చికి మినిస్ట్రీస్ రిజిస్టేషన్ ఉండాలట. మరొకటి ఆ చర్చి ఉన్న స్థలంకు ఆ సొసైటీ పేరు ఉండాలట. ఆఖరిది ఆ చర్చి పాస్టర్ కి వేరే ఇతర ఆదాయాలు ఉండకూడదట.

pastors 27012022 2

ఈ కారణాలు చూపిస్తూ వైసిపి ప్రభుత్వం కేవలం 500 మందినే ఈ పధకానికి అర్హులుగా తేల్చింది. దీనితో కేవలం 500 ఇవ్వటంతో షాక్ అయ్యారు. ప్రభుత్వం పైన పాస్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీనితో మళ్ళి నిభందనలు మార్చే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో కానీ, మరో హామీ గాలిలోకి కలిసి పోయేలా ఉంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ, అన్ని హామీలను గాల్లో కలిపేస్తున్నాడు. ఈ ఏడాది ఇవ్వాల్సిన అమ్మ ఒడి ఇప్పటికీ ఇవ్వలేదు. జూన్ లో ఇస్తామని అంటున్నారు. ఇక ఉద్యోగులకు పెట్టిన షాక్ అయితే మామూలు షాక్ కాదు. రెండు చేతులతో ఓట్లు వేసిన వారికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా పాస్టర్ లు. జగన్ గెలుపులో పాస్టర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ పాస్టర్లకు కూడా జగన్ షాక్ ఇచ్చారు. ఆర్ధిక కష్టాలో, మరే కష్టాలో కానీ, 16 వేల మంది ఎక్కడ, 500 మంది ఎక్కడ ? మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రభుత్వం నిబంధనలు మార్చి, వీరి సంఖ్య పెంచుతుంది ఏమో చూడాలి మరి.

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే జగన్ రెడ్డి జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారని చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ జగన్ రెడ్డి ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలి కానీ...ఇలా స‌మ‌స్యలు త‌లెత్తేలా నిర్ణయాలు ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామ‌ని టిడిపి నేత‌లు అన్నారు. ఎన్టీఆర్ ను ఎవ‌రు గౌర‌వించినా తాము స్వాగ‌తిస్తాం అన్నారు. అయితే ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాద‌ని....ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్ట్ కు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించినా కూడా......తాము వైఎస్ పేరు క‌డ‌ప జిల్లాకు పెట్టిన‌ప్పుడు వ్యతిరేకించ‌లేద‌ని చెప్పారు. టిడిపికి ద్వంద విధానాలు ఉండ‌వ‌ని అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.....అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్టును నిలిపివేసిన జ‌గ‌న్ ప్రభుత్వం....ఎన్టీఆర్ పై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మర‌ని అన్నారు.

cbn 27012022 2

చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీల‌ను కూడా జ‌గ‌న్ నిలిపి వెయ్యడం నిజం కాదా అని అన్నారు. జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేశారు. ప్రజ‌ల ఆకాంక్షల‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు జ‌రిగిన కార‌ణంగానే.....చాలా చోట్ల నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. వైసిపి లోనే కొత్త జిల్లాల నిర్ణయంపై వ్యతిరేకత వ‌స్తుంద‌ని టిడిపి నేత‌లు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టవద్దని కేంద్రం స్పష్టం చేసినా...... ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారు. తొంద‌ర‌పాటు నిర్ణయాల‌తో ఇప్పటికే రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం చేసిన సిఎం జ‌గ‌న్... ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు త‌లెత్తే ప‌రిస్థితి తెచ్చారు. క‌నీసం కేబినెట్ లో కూడా స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌కుండా....రాత్రికి రాత్రి నోటిఫికేష‌న్ విడుద‌ల చెయ్యాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్రశ్నించారు. 21వ తేదీ జ‌రిగిన కేబినెట్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. అయితే 25వ తేదీ రాత్రికి రాత్రి మంత్రుల‌కు నోట్ పంపి ఆమోదం పొందాల్సినంత అత్యవ‌స‌ర ప‌రిస్థితి ఏమి వ‌చ్చింది? రాజ‌ధానుల త‌ర‌లింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీల‌క అంశాల‌పైనా రాజ‌కీయ ప్రయోజ‌నం పొందాల‌ని చూస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read