ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌పై, ఎంపీ రఘురామరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌ తనను పర్సనల్ గా టార్గెట్ చేసారని పిటీషన్ లో తెలిపారు. సిఐడి సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు చేస్తున్నారు అంటూ, గతంలో రఘురామకృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తరువాత కేంద్రం, సునీల్ కుమార్ కు నోటీసులు పంపించింది. ఇది ఇలా ఉంటే, ఈ కేసుని సాకుగా చూపించి, సునీల్ కుమార్ తన పై వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు అంటూ, తన పిటీషన్ లో తెలిపారు. అలాగే సునీల్ కుమార్ కు తన భార్యతో వివాదాలు ఉన్నాయని, ఆ వివాదాల్లోకి తనను కూడా లాగి టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అయితే రఘురామరాజు పిటీషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. రఘురామరాజు పిటీషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసు  విచారణను నాలుగు వారల పాటు హైకోర్ట్ వాయిదా వేసింది.

న్యాయమూర్తుల పై అనుచిత పోస్టింగ్ లు పెట్టిన కేసు, ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు, సిబిఐ విచారణ చేస్తున్న ఈ కేసు విచారణకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ట్విట్టర్ సంస్థ, ఏదైతే సిబిఐ కానీ, హైకోర్టు కానీ ఆదేశాలు ఇస్తున్నాయో, ఆ ఆదేశాలకు అనుగుణంగా ట్విట్టర్ వ్యవహరించటం లేదని, సిబిఐ తరుపున, ఇటు హైకోర్టు తరుపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైగా ట్విట్టర్ లో ఇక్కడ ఏదైనా పోస్ట్ ని ఇక్కడ డిలీట్ చేసినా కూడా, vpn అని కొడితే, ఆ పోస్ట్ మళ్ళీ ట్విట్టర్ లో దర్శనం ఇస్తుందని, న్యాయవాది అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ లో ఎవరైనా ఒక పోస్ట్ పెడితే, ఈ దేశం నుంచి, వేరే దేశం వెళ్లటం కానీ, లేదా నేషనాలిటీ మార్చినా వెంటనే మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయని, సిబిఐ తరుపు న్యాయవాది ర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ అంశం పై, ట్విట్టర్ పై సీరియస్ అయ్యింది. మీ మీద అసలు కోర్టు ధిక్కరణ కింద కేసు ఎందుకు నమోదు చేయకూడదు అంటూ, ట్విట్టర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, ట్విట్టర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

twitter 31012022 2

ఈ అంశం పైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, వచ్చే వారం లోపు తమ ముందు కౌంటర్ అఫిడవిట్ వెయాలని, ట్విట్టర్ ని ఆదేశించింది. అదే విధంగా ట్విట్టర్ కి సంబంధించి, భారత దేశంలో ఉండే, చట్టాలు, న్యాయ స్థానాలు, వీటి అన్నిటిపైన అవహగన తెచ్చుకోవాలని, వీటి పైన నిబంధనలు పాటించకపోతే మాత్రం, భారత దేశంలో మీరు వ్యాపారం ముసుకోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. మీ మీద పోలీసులను పంపి, మీ దగ్గర ఏదైతే జడ్జిల పైన పోస్టింగ్ లు ఉన్నాయో, ఆ మెటీరియాల్ మొత్తం స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు ఇస్తామని కూడా హెచ్చరించింది. దీంతో పాటుగా, న్యాయమూర్తుల పైన దూషణలకు దిగిన, విదేశాల్లో ఉన్న వారిని, అరెస్ట్ ఎంత వరకు వచ్చిందని, వారి అరెస్ట్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, వచ్చే వారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని , కేసు విచారణ నిర్వహిస్తున్న సిబిఐ ని కూడా ఆదేశాలు జారీ చేసి, వచ్చే సోమవారానికి కేసుని వాయిదా వేసింది హైకోర్టు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఏదైనా ప్రజల తరుపున పోరాటం విషయంలో వార్తల్లో ఉండాలి కానీ, ఇక్కడ మాత్రం నెగటివ్ విషయాలకు వార్తల్లో ఉంటున్నారు. చివరకు అధికార పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారు. సోము వీర్రాజు పాజిటివ్ కంటే, నెగిటివ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. నెగటివ్ ప్రచారానికే తాను వార్తల్లో ఉంటానని, తద్వారా జగన్ కు అనుకూలంగా ఉండొచ్చు అని ఏమో మరి. గత నెల రోజులుగా సోము వీర్రాజు చేస్తున్న పనులు ఇలాగే ఉన్నాయి. చీప్ లిక్కర్ 50 రూపాయలకు ఇస్తామని ఎవరైనా అంటారా ? హ-త్య-లు చేసే కడప వారికి ఎయిర్ పోర్ట్ ఎందుకు అని ఎవరైనా అంటారా ? దొంగ లం అని బూతులు మాట్లాడతారా ? ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ? చివరకు ఇవి రాజకీయంగా ఎవరికి బెనిఫిట్ అవుతున్నాయి అనేది కూడా అర్ధం అవుతుంది. అయితే సోము వీర్రాజు వరుస వివాదాల పై హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇక ముందు అయినా సోము వీర్రాజు జాగ్రత్తగా ఉంటారో, ఇదే నెగటివ్ ప్రచారం కోసం తపిస్తారో చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ప్రభుత్వం మధ్య , ఇప్పటి వరకు నేలకొన్న ప్రతిష్టంభన వీడే అవకాసం ఉందని, సమాచారం వస్తుంది. ప్రధానంగా ఉద్యోగుల ఆందోళన పై ప్రభుత్వం, ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం సియం ఆఫీస్ నుంచి, అధికారులు, మంత్రులు కమిటీలో ఉన్న మంత్రులు ఎక్కడ ఉన్నారో ఆరా తీసి, వారిని పిలిపిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా, ఉద్యోగులు పేర్కొంటున్న అంశాలు అయినా, హెచ్ఆర్ఏ ఉద్యోగులు కోరినట్టుగా కానీ , కొంచెం దగ్గరగా కానీ, కొన్ని కొత్త స్లాబులని ఏర్పాటు చేయటం, అలాగే డీఏ ఎరియర్స్ నుంచి తొమ్మిది నెలల ఐఆర్ ను మినహాయంపు ఇవ్వటం వలన, ప్రభుత్వానికి ఎదురు చెల్లించటం పై కూడా ఉద్యోగులు అభ్యంతరం చెప్తున్నారు. దీనికి ప్రత్యామ్న్యాయ మార్గాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, 70 ఏళ్ళకు 10 శాతం, 75 ఏళ్ళకు 15 శాతం, 80 ఏళ్ళ తరువాత 20 శాతం ఇచ్చే అడిషినల్ క్వాంటం అఫ్ పెన్షన్ లో 70, 75ఏళ్ళ స్లాబ్ ని ప్రభుత్వం తొలగించింది. దీన్ని మళ్ళీ ఇవ్వాలని కూడా ప్రభుత్వంలో ఆలోచన జరుగుతుందని చెప్తున్నారు. ఈ సమాచారం ఉద్యోగులకు చేరటంతో, ఈ రోజు జరుగుతున్న ఉద్యోగు సంఘాల సమావేశంలో కూడా ఈ విషయాల పై చర్చిస్తున్నారు.

sajjala 31012022 2

ప్రభుత్వం పై ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా కూడా, మూడు అంశాల మీద ఏదైతే పట్టుబడుతుందో, అసితోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టటం, పీఆర్సి జీవోలు రద్దు చేయటం, అదే విధంగా గత నెలకు పాత జీతం వేయాలని చెప్పటం, ఈ మూడు డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వస్తాం అని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు లీకులు ఇవ్వటంతో, దీని పై ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పై ఆలోచిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 3న తలపెట్టే చలో విజయవాడ కార్యక్రమం పై, ఎలా చేయాలి అనే అంశం పై కూడా చర్చిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం ఇలా లీకులు ఇస్తూనే, కొత్త పీఆర్సి ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని, ఆదేశాలు ట్రెజరీ అధికారులకు మరోసారి హుకుం జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం లోపు బిల్లులు మొత్తం పూర్తి చేయాలని గట్టిగా ఆదేశాలు జారీ చేసారు. ఒక వైపు చర్చలు అంటూనే, పీఆర్సి విషయంలో మాత్రం, కొత్త జీతాలతో వేయాల్సిందే అని అంటున్నారు. చలో విజయవాడ పెద్ద ఎత్తున జరుగుతుంది అనే సమాచారం ప్రభుత్వానికి రావటంతోనే, ఉద్యోగులను సైలెంట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read