అమరావతిలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కు, చంద్రబాబు టెక్నాలజీ విప్లవం అంటే ఏంటో చూపించనున్నారు... ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెరపై.. దానిపై ఒకేసారి రాష్ట్రంలోని వందల ఊళ్లలోని సర్వెలైన్సు కెమెరాల నుంచి అక్కడ తాజా స్థితి ప్రత్యక్ష పసారం, మరోవైపు పరిష్కార వేదికద్వారా వందల మంది సిబ్బంది లక్షల్లో వస్తున్నా ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్షప్రదర్శన... ఇంకో వైపు పీపుల్స్ హబ్... ఈ ప్రతిగతి, తాళం వేసి ఉన్న ఇళ్లకు గస్త్రీకాస్తున్న పోలీసు కెమెరా కళ్లు... వాతావరణ ప్రత్యక్ష స్థితి... ఒకటా, రెండా. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో తనకున్న అపార అనుభవపాఠ సోయగాన్ని ప్రదర్శించనుంది.

kovind 27122017 2

ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తోంది. ఇందు కోసం అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కేంద్రాన్నిబుధవారం ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందు రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన కోసం అనుసరిస్తున్న సాంకేతిక పద్దతులను ఆయన ముందు ప్రదర్శించబోతోంది. రాష్ట్రపతి దాదాపు ఇక్కడ అరగంట పాటు గడపడానికి సమయం కేటాయించారంటే దాని ప్రాముఖ్యత ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం తన సాంకేతిక నైపుణ్యతలను ఆయన ముందు ఒక సాంకేతిక ఇంద్రధనస్సు తరహాలో ఒకదాని తరువాత ఒకటి వెనువెంటనే తెర పై ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

kovind 27122017 3

ఇందుకోసం ప్రతి చిన్న ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు,సూచనలు, సలహాలు మేరకు ఆర్టీజీఎస్ సీఈవో బాబు, ఈ బృందం రేయింబవళ్లు శ్రమిస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్ర కార్యాలయంలో తొలుత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన పరంగా అనుసరిస్తున్న పలు సాంకేతిక నైపుణ్యాలు వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలు ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆధునీకరించిన 2.0 వెర్షన్ కోర్ డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) ద్వారా రాష్ట్రంలో 20 వేల సర్వెలెన్సు కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 8 వేల కెమెరాలను ఏర్పాటు చేసింది. చిట్టచివరిగా రాష్ట్రపతి కోవింద్ ఒకేసారి వేల మంది ప్రజలతో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి ముఖాముఖిగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని మారుమూల ప్రాంతాలకు చెందిన పంచాయితీలను దీనికోసం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రామ్నాధ్ కోవింద్ కొంత మంది ప్రజలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం అనంతపురం పర్యటన నిమిత్తం, గన్నవరం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అనంతపురంలోని నీటి పారుదల ప్రాజెక్ట్ పనులు పరిశీలించటానికి వెళ్లారు. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

devineni 26122017 2

ఈ కాన్వాయ్ ప్రమాదంలో మంత్రి దేవినేని, డ్రైవర్, ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. రెండు కార్లు దెబ్బతిన్నాయి... మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరే కారులో అనంతపురం చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీకి అధికారం దక్కలేదన్న బాధతో సీఎం చంద్రబాబునాయుడి పై జగన్ విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు.

devineni 26122017 3

ప్రజా సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో కాకుండా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) డైరెక్షన్ లో జగన్ ముందుకు వెళుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను దేవినేని ప్రస్తావించారు. జవనరి 2వ తేదీ నుంచి ‘జన్మభూమి’, ‘మా ఊరు’, ‘ఇంటింటికి టీడీపీ’లో అందిన అర్జీలను పరిష్కరించనున్నట్టు దేవినేని చెప్పారు.

రాజధాని అమరావతిలో మరో భారీ సదస్సు జరగనుంది. గుంటూరులోని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే భారత ఆర్థిక సంఘం (ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్) శతాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐఈఏ సమావేశాలను ప్రారంభిస్తారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు ఉద్దండులైన ఆర్థికవేత్తలంతా హాజరు కానున్నారు. 99వ వార్షిక సదస్సు కూడా గత ఏడాది తిరుపతిలోనే జరిగింది. ఒకే రాష్ట్రంలో వరుసగా రెండోసారి ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.

iea 26122017 1

ఉమ్మడి రాష్ట్రంలో 1981లో తిరుపతిలో, 1991లో అనంతపురంలో ఈ సదస్సు జరిగింది. గత ఏడాది తిరుపతిలో జరగ్గా.. మళ్లీ ఇప్పుడు అమరావతిలో జరగనుంది. ఈ సదస్సులో దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక స్థితిగతులపై చర్చ జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్ర పరిస్థితిపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. నూతన రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం నుంచి మౌలిక సదుపాయాల వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, జరగాల్సిందేంటి? ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఈ సదస్సులో ప్రత్యేక సెషన్‌ ఏర్పాటు చేశారు.

iea 26122017 1

తొలిసారి రాజధాని ప్రాంతానికి రాష్ట్రపతి హాజరవుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా గూఢాచారి వ్యవస్థను, బాంబ్‌ నిర్వీర్య బృందాలను, సాయుధ బలగాలను, క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లను, బాంబ్‌ డిటెక్టివ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఇందుకుగాను ముగ్గురు అదనపు ఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 32 మంది సీఐ/ఆర్‌ఐలను, 68 మంది ఎస్సైలు, 63మంది ఏఎస్సై/హెచ్‌సీలు, 492 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 19 మంది మహిళా కానిస్టేబుళ్లను, 130 మందితో ఆర్ముడ్‌ ఫోర్స్‌ను, రెండు గ్రేహౌండ్స్‌ బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రపతి పాల్గొనే ప్రాంతాన్ని పోలీసులు అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.

భార‌త రాష్ట్ర‌ప‌తి స‌తీమ‌ణి, దేశ తొలి మ‌హిళ స‌విత‌ కోవింద్‌ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు ప‌ర్యాట‌క, భాషా సాంస్కృతిక‌ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. స‌వితా కోవింద్ తొలిసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తుండ‌గా, ఆమె ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క శాఖకు అప్ప‌గించింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్ కోవింద్ దంప‌తులు ఉద‌యం 9.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకుంటారు. రాష్ట్ర‌ప‌తి అక్క‌డి నుండి నేరుగా నాగార్జున విశ్వ‌విద్యాల‌యం చేరుకుంటారు. విమానాశ్ర‌యం వ‌ద్ద‌ ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌, ఎపి టిడిసి ఎండి హిమాన్హు శుక్లా త‌దిత‌రులు స‌వితా కోవింద్‌ను స్వాగ‌తించి, ప‌ర్య‌ట‌న ముగిసే వ‌ర‌కు ఆమెతోనే ఉంటారు.

president 26122017 2

తొలుత ప్ర‌ధ‌మ మ‌హిళ‌ విజ‌య‌వాడ‌ స్వ‌రాజ్య మైదానంలో జ‌రుగుతున్న గులాబీల ప్ర‌ద‌ర్శ‌న స్థ‌లానికి చేరుకుంటారు. ప్ర‌ద‌ర్శ‌న తిల‌కించిన అనంత‌రం స‌విత ఇంద్ర‌కీలాద్రిపై కొలువు తీరిన క‌న‌క దుర్గ‌మ్మ చెంత‌కు చేరుకుని, అమ్మ‌వారిని సంద‌ర్శించుకుని దీవెన‌లు అందుకుంటారు. దేవాల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి సూర్య‌కుమారి ఏర్పాట్ల‌కు నేతృత్వంలో దేవాల‌య అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. 11.30 గంట‌ల‌కు దేవాల‌యం నుండి బ‌య‌లుదేరి భ‌వానీపురం పున్న‌మి ఘాట్‌కు చేరుకుంటారు. అక్క‌డ ప‌ర్యాట‌క శాఖ నూత‌నంగా నిర్మించిన అతిథి గృహాల‌ను సంద‌ర్శించి స్వ‌ల్ప విశ్రాంతి తీసుకుంటారు. ఇక్క‌డ ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ హిహాన్హు శుక్లా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌థ‌మ‌ మ‌హిళ‌కు వివ‌రిస్తారు. అక్క‌డి నుండి న‌దీ విహారం ద్వారా భ‌వానీ ఐలండ్‌కు చేరుకుంటారు. భ‌వానీ ద్వీపంలో సాంస్కృతిక శాఖ విశేష ఏర్పాట్ల‌ను చేయాల‌ని స‌మీక్ష నేప‌ధ్యంలో ముఖేష్ కుమార్ మీనా అధికారుల‌ను ఆదేశించారు.

president 26122017 3

క‌ళా బృందాల‌తో తొలి మ‌హిళ‌ను ద్వీపంలోకి స్వాగ‌తించాల‌ని సాంస్కృతిక శాఖ సంచాల‌కులు విజ‌య‌భాస్క‌ర్‌కు సూచించారు. తెలుగు సంస్కృతి, సాంప్ర‌దాయాలను ప్ర‌తిబింబించేలా కొమ్ముకోయ‌, స‌వ‌ర‌, డ‌ప్పులు, గ‌ర‌గ‌లు, కూచిపూడి నృత్య‌రీతుల‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శింప‌చేస్తారు. మ‌రోవైపు తెలుగుద‌నానికి చిహ్నంగా భాసిల్లే కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను ప‌రిశీలించి హ‌స్త‌క‌ళాకారుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడ‌తారు. అనంత‌రం భ‌వానీ ఐలండ్ నుండి బ‌య‌లు దేరి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు వెల‌గ‌పూడి స‌చివాల‌యం చేరుకుంటారు. ఇక్క‌డి నుండి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్ కోవింద్‌తో క‌లిసి గ‌న్న‌వ‌రం చేరుకుంటారు. మ‌రోవైపు రూట్ మ్యాప్ వంటి అంశాల‌పై పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ముఖేష్ కుమార్ మీనా ఎపిటిడిసి అధికారుల‌ను ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read