మొన్నటి దాకా రాష్ట్రంలో ఏ నేరాలు జరిగినా, వాటికి నేర నిర్థారణ చేసి దొంగలకి, కేడీ గాళ్ళకి శిక్ష పడాలి అంటే, హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించి, వారిచ్చే రిపోర్ట్ కోసం, ఎదురు చూస్తూ ఉండేవారు మన పోలీసులు... అయితే ఇప్పుడు త్వరలోనే ఈ బాధ తీరనుంది... నేర నిర్థారణ కోసం, ఇక నుంచి హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన అమరావతిలోనే స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించింది.. ఆమోదించటమే కాదు, శంకుస్థాపన ముహూర్తం కూడా రెడీ అయ్యింది...

forensic 26122017 2

రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామానికి నైరుతి వైపున స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానున్నది. ఈ నెల 28 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ కి మూడు ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. అలాగే ప్రతి జిల్లలో ఒక రీజనల్‌ సైన్స్‌ ల్యాబరేటరీ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి సంభందించి స్టేట్‌ లెవల్‌ లాబ్‌రేటరీ ప్రస్తుతం హైద్రాబాద్‌ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, మన పోలీసులు హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ మీద ఆడరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా తీవ్రమైన కాలయాపన చోటుచేసుకోవడం, కేసు విచారణ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించ లేకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారు.

forensic 26122017 3

రాజధాని అమరావతిలో స్టేట్‌ లెవల్‌ ల్యాబ్‌ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించటంతో, ఇక ఈ కష్టాలు తీరనున్నాయి. నేరపరిశోధనలో ఈ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదికలే కీలకం. డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా ఈ ల్యాబ్‌లో జరుగుతాయి. తుళ్లూరు పరిసరాలలో ఏదో ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి కోరామని, రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్‌ ఏర్పాటు కాబోతుండటం సంతోషంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పోలీసు డిపార్టుమెంటు కూడా, ఈ ల్యాబ్ తొందరగా పూర్తయితే, హైదరాబాద్ మీద ఆదారపడకుండా, త్వరతిగతిన నేరాలు రుజువు చేసే అవకాసం ఉంటుంది అని అంటున్నారు.

నిన్నేమో కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదు అని, తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది, మేము డబ్బు రాజకీయం చెయ్యం, మేము ధర్మం వైపు నిలబడతాం, మేము పోటీ చెయ్యం అనే స్క్రిప్ చదివింది జగన్ పార్టీ. ఇక శిల్పా చక్రపాణి అయితే, నేను వదిలేసిన ఎమ్మెల్సీని, తెలుగుదేశం నాయకులు ఎరుకుంటున్నారు అంటూ హేళనగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు... అక్కడ జరిగిన విషయం ఏంటో అందరికీ తెలిసినా, కొంచం షో చేసాడు శిల్పా.. అయితే ఈ నిర్ణయంతో సొంత పార్టీ కార్యకర్తల్లో గందరగోళం రావటంతో, జగన్ చివరి నిమిషంలో చిన్న గేమ్ ఆడారు...

jagan mlc 26122017 2

నిజానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి జగన్ కు అభ్యర్ధి లేరు.. అందుకే నోటిఫికేషన్ వచ్చిన తరువాత కనీసం ఒక సమీక్ష కూడా చెయ్యలేదు.. నిన్న అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం అంటూ వైసిపి ప్రకటించటంతో, కార్యకర్తలు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి చిన్న ఎలక్షన్ కి కూడా కాండిడేట్ లేకపోతే రేపు 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కాండిడేట్ ఎలా దొరుకోటారో అంటూ నిరాశలోకి జారుకున్నారు... విషయం తెలుసుకున్న జగన్, చిన్న గేమ్ ప్లే చేసారు. ఇవాళ ఉదయం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అనంతపురం వెళ్తున్నాను అని మీడియాకు చెప్పారు. వెళ్లి కలిసారు కూడా.

jagan mlc 26122017 3

యధావిధిగా మీడియా, కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్ అంటూ హడావిడి చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గౌరు వెంకటరెడ్డి పోటీ చేస్తారు అంటూ హడావిడి చేసింది. , అయితే, పార్టీ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్ ఆయనకు స్పష్టం చేశారు. దీంతో గౌరు వెంకటరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదంతా కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నంలో చివరి నిమిషంలో అద్భుతమైన డ్రామా వేసారు జగన్... మనకి అభ్యర్ధులు ఉన్నారు, నేనే పోటీ పెట్టటంలేదు అనే ఫీలర్ ఇచ్చారు... 2019లో నేను ముఖ్యమంత్రి అయ్యి తీరుతాను అనే భరోసా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలిగించారు.

తెలుగు సినీ పరిశ్రమను రాజధాని అమరావతికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అమరావతి రాజధాని నగర పరిధిలోని అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

cbn 26122017 2

మీడియా నగరంలో సినీ - టెలివిజన్‌ పరిశ్రమ, నిమేషన్ ‌- వీఎఫ్‌ఎక్స్ ‌- గేమింగ్, డిజిటల్‌ యాడ్‌ - సోషల్‌ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో20 నుంచి 30 ఎకరాల్లో స్టూడియో నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర (ఎకరం రూ. 50లక్షలు)కు భూములిస్తామని ప్రకటించింది. ఇక్కడ సినిమాను నిర్మిస్తే ప్రొడక్షన్‌ ఖర్చులో కొంత మొత్తాన్ని రీయింబర్స్‌ చేయడం, నగదు ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. సినిమాలకు సింగిల్‌ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు న్యూస్‌ చానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది.

cbn 26122017 3

అయితే చంద్రబాబు ప్రయత్నానికి ఎంత మంది సినీ పెద్దలు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతం వారే ఉన్నారు... కాని వీరు అందరూ హైదరాబాద్ లో స్థిరపడి పోయారు... వీరికి అమరావతి అంటే అంత ప్రేమ లేదు అనే విషయం వివిధ సందర్భాల్లో రుజువైంది... మరి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలకి వారు ఎలా స్పందిస్తారో చూడాలి... మరో పక్క న్యూస్‌ చానళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది.. ఇప్పటికే స్టూడియో ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్, బాలీవుడ్‌ ప్రముఖుడు సుభాష్‌ ఘయ్‌లను ఆహ్వానించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మరి మన టాలీవుడ్ నుంచి మొదటి ఎవరు వస్తారో చూడాలి...

సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందుడుగుగా భావించే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఫలాలు ప్రజలందరికీ విస్తరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. ప్రధాని మోదీ కలగన్న డిజిటల్‌ ఇండియాకు ఏపీ నుంచే అంకురార్పణ జరగనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఏపీలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రాన్ని 'డిజిటల్ ఏపీ'గా తీర్చిదిద్దే 'ఫైబర్ గ్రిడ్' ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు సేవలు లభిస్తాయి.

cbn fiber 26122017 2

15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, 250 చానెళ్ల ప్రసారానికి రూ.149 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రసారాల కోసం ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (ఐపీటీవీ), జిగాబైట్‌ యాక్టివ్‌ పాసివ్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ (జీపాన్‌) బాక్సులను అందజేస్తారు. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు అందించే సెట్‌టాప్‌ బాక్సుల కంటే.. ఏపీ ఫైబర్‌ నెట్‌ అందించే ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులు అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల ఈ బాక్సుల ధర రూ.4000 దాకా ఉంటుంది. ఇంత భారాన్ని సామాన్యులపై ఒకేసారి వేయడం సరికాదని భావించిన ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌.. నెలకు రూ.100 చొప్పున 40 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించింది.

cbn fiber 26122017 3

ఫైబర్‌గ్రిడ్‌ పథకంలో భాగంగా ట్రిపుల్‌ ప్లే సర్వీసు, విలువ ఆధారిత సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ట్రిపుల్‌ ప్లే సర్వీసుల కింద వాయి్‌స(టెలిఫోన్‌), వీడియో(టీవీ చానల్స్‌), డేటా(ఇంటర్నెట్‌) సేవలు అందిస్తారు. దీనిలో ఐపీ టెలివిజన్‌ (250 చానల్స్‌- హెచ్‌డీ చానళ్లతో సహా), అన్‌ లిమిటెడ్‌ హైస్పీడ్‌ వైఫై (గృహాలకు 15 ఎంబీపీఎస్‌, గృహేతరాలకు 100 ఎంబీపీఎస్‌), ఉచిత టెలిఫోన్‌ కనెక్షన్‌ (ఏపీ ఫైబర్‌ ఖాతాదారుల మధ్య ఉచిత అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌) ఉంటాయి. ఇక విలువ ఆధారిత సేవల విభాగంలో కోరుకున్న సినిమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం, ఇ-కామర్స్‌, చదువు, వైద్యం, వ్యవసాయ సంబంధిత సమాచారం, టెలిమెడిసిన్‌, ప్రోగ్రామ్‌ రికార్డింగ్‌, ఆన్‌లైన్‌ బిల్‌ పేమెంట్స్‌, క్యాచప్‌ టీవీ, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌, క్లౌడ్‌ ఆధారిత సేవల వంటివి అందిస్తారు. సేవలను పొందాలంటే మరిన్ని వివరాల కోసం 1800-599-5555 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేయాలి.

Advertisements

Latest Articles

Most Read