నంద్యాల దెబ్బ ఇంకా జగన్ మైండ్ లో తిరుగుతూనే ఉంది... ఆ దెబ్బకు ఎలక్షన్ అంటేనే జగన్ షేక్ ఆడుతున్నారు... కర్నూల్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానుంది... ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఉత్సాహం చూపకపోవడంతో పోటీ నుంచి వైదొలిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. అయితే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే ముందు జగన్ నిర్ణయాన్ని కర్నూల్ జిల్లా నేతలకే వదిలేసారు.... మీరు పోటీ చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, లేకపోతే లేదు అని నిర్ణయం వారికే వదిలేసారు..
దీంతో అందరు షాక్ అయ్యారు.. దీని అర్ధం, జగన్ వైపు నుంచి పైసా కూడా రాదు, ఎవరు అయితే పోటీలో ఉంటారు ప్రతి రూపాయి వారే పెట్టుకోవాలి... ఈ నిర్ణయంతో, ఎవరూ ముందుకు రావటం లేదు... తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ప్రకటించగానే, మేము పోటీ చెయ్యట్లేదు అని, నెపం తెలుగుదేశం మీదకు నేట్టేయటానికి స్క్రప్ట్ కూడా రెడీ అయ్యింది... తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది, మేము డబ్బు రాజకీయం చెయ్యం, మేము ధర్మం వైపు నిలబడతాం, మేము పోటీ చెయ్యం అనే స్క్రిప్ ఈ రాత్రికి వైసిపి చదవనుంది...
జిల్లలో 1081 మంది ఓటర్లు స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది. వీరిలో అధికార తెలుగుదేశం పార్టీకి 55 శాతానికి పైగా బలం ఉందని రెండు పార్టీల తేడా సుమారు 200 ఓట్లకుపైగా ఉంటుందని వైసీపీ నేత ఒకరు తెలిపారు. శాసనసభ ఎన్నిక లకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో నాయకుల దృష్టి ఆ ఎన్నికలపై ఉందని మండలి ఎన్నికల్లో పోటీ చేయలేమని వెల్లడిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత స్పష్టం చేశారు. మొత్తం పరిస్థితిని పరిశీలించిన మీద పార్టీ ఉపఎన్నికలో అభ్యర్ధిని నిలబెట్టకపోవచ్చని అంటున్నారు. దీంతో శాసన మండలి ఉపఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మరో పక్క జగన్ ఇప్పటికే కర్నూల్ లో పాదయత్ర చేసారని, ఇప్పుడు కనీసం పోటీ కూడా చెయ్యకపోతే, నిలబెట్టటానికి అభ్యర్ధి కూడా లేడు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అని,ఇక జగన్ పాదయాత్ర ద్వారా ఇస్తున్న భరోసా ఏంటి అని సొంత పార్టీ నేతలే అంటున్నారు...