నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, నోటికి ఏమి వస్తే అది చెప్పేస్తున్నారు... అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ... ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, 45 ఏళ్ళకే మీకు పెన్షన్ ఇస్తా ఇంట్లో కూర్చోండి అనేదాకా వెళ్ళింది...క పక్క కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఫోటోషాప్ ఎక్స్పర్ట్స్ కి తోడు, బీహార్ బ్యాచ్ ఇచ్చిన స్క్రిప్ట్ కి తగ్గట్టు, డ్రామాలు, డైలాగ్స్ రాసే స్క్రిప్ట్ రైటర్స్ కి కూడా మాంచి డిమాండ్ ఉంది.. వీళ్ళు అంతా పెర్ఫార్మన్స్ బాగానే ఇస్తున్నారు కాని, జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి, కింద స్థాయి కార్యాకర్తల దాకా, అందరూ లాజిక్ మర్చిపోయి, దొరికిపోతున్నారు...

jagan 24212017 2

ఇప్పుడు తాజాగా, జగన్ ఆరోగ్య శ్రీ పథకం అంటూ కొత్త పధకం అని చెప్పి, వెయ్య రూపాయలు డాక్టర్ బిల్ దాటితే చాలు, ఆరోగ్య శ్రీ పథకం కింద వర్తిస్తుంది అని ప్రకటించేశారు... మీరు అందరూ గెట్టిగా ప్రార్ధన చెయ్యండి, నేనే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకోండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే, వెయ్య రూపాయలు డాక్టర్ బిల్ దాటితే చాలు, ఆరోగ్య శ్రీ పథకం వర్తింప చేస్తాను అనేసారు..ఈ రోజుల్లో ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, వెయ్య రూపాయలు అవ్వకుండా ఉండదు.. అంటే, దాదాపుగా ఇక డాక్టర్ దగ్గరకు వెళ్తే చాలు, మీకు అన్నీ ఫ్రీ...

jagan 24212017 3

ఇప్పటికే చంద్రబాబు అంత అనుభవం ఉండి కూడా, ఆయన చెప్పిన పధకాలు తీర్చటానికి ఎంతో శ్రమిస్తున్నారు... ఒక పక్క రాష్ట్రానికి డబ్బులు లేవు, మరి జగన్ ఇవన్నీ ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు ? 45 ఏళ్ళకే పెన్షన్ అంటేనే ఈయన చిత్తశుద్ది అర్ధమవుతుంది, మరి, ఇప్పుడు వెయ్య రూపాయలు దాటికే ఆరోగ్య శ్రీ అంటే, ప్రజలు అసలు నమ్ముతారా ? ఇప్పటి వరకు, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటున్నారు కాని, ఒక స్కూల్ కడతాం, ఒక హాస్పిటల్ కడతాం, ఒక రోడ్ వేస్తాం, రాజధాని ఇలా కడతాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఇలా కడతాం, అనే మౌలికమైన సమస్యల జోలికి వెళ్ళకుండా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటే, ప్రజలు నమ్ముతారా ? ఇవన్నీ ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఆదాయం పెంచాలి, నువ్వు అలా ప్రభుత్వ ఆదాయం పెంచుతావ్ అనే భరోసా కూడా ప్రజలకు ఇవ్వాలి కదా ? నువ్వు ప్రజలకి బిస్కట్ వేస్తే, ప్రజలు నీకు క్రీం బిస్కట్ వేస్తారు...

ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ 2019 నాటికి పూర్తి చెయ్యాలి అని ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతుంటే, కేంద్రం వైపు నుంచి మాత్రం ఆ రకమైన వేగం లేదు... కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం దగ్గర వచ్చిన ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది... కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చింది, కాని వెంటనే నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ అభ్యంతరం చెప్పింది... కాఫర్‌ డ్యామ్‌ కి, హైడ్రో పవర్‌ కి సంబంధం ఏంటో ఇప్పటి వరకూ ఎవరికీ తేలీదు... ఎన్‌హెచ్‌పీసీ బృందం ఇప్పటిదాకా కాఫర్‌ డ్యామ్‌ పై నివేదిక ఇవ్వలేదు.. ఎప్పటికి ఇస్తుందో తెలీదు...

polavaram 24122017

మరో పక్క ఒకరి తరువాత ఒకరు కేంద్రం నుంచి వస్తున్నారు... పోలవరంలో ఎన్‌హెచ్‌పీసీ బృందం పర్యటించాక వాప్కోస్‌ బృందం వచ్చింది. ఆ తర్వాత.. పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్‌ పర్యటించారు. ఆయన పర్యటనలో ఉండగానే కేంద్ర మంత్రి గడ్కరీ ఓఎస్డీ ఖోలాపుర్కర్‌ వచ్చారు. త్వరలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ రానున్నారు. జనవరి మొదటి వారంలో ఎవరు ఎందుకు వస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలీదు... పోలవరం అథారిటీ సీఈవో సౌమిత్రహల్దార్‌ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో అతివేగం పనికి రాదని అంటారు... నిన్న వచ్చిన గడ్కరీ సాంకేతిక సలహాదారు సంజయ్‌ కోలా పుల్కర్‌, తొందరగా పూర్తి చెయ్యాలి అంటారు...

polavaram 24122017

ఒకరేమో, ఎగువకాఫర్‌ డ్యామ్‌ విడిగా కట్టకూడదు ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం జరగాలి అంటారు... నిన్న వచ్చిన ఆయనేమో, అసలు అలా ఎలా కడతారు, అది పెద్ద తప్పు అంటారు... ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు రావటం, ఎవరి అభిప్రాయం వారు చెప్పటం, మరింత కన్ఫుజన్ క్రియేట్ చేసి, మరింత క్లిష్టంగా సమస్యను తయారు చేస్తున్నారు.. ఇంత కన్ఫుజన్ లో చివరకి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు... సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. 23 సార్లు స్వయంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, 42 సార్లు వర్చువల్‌ సమీక్షలు నిర్వహించి పనులను పరుగులెత్తించారు. సరిగ్గా కీలకమైన కాఫర్‌ డ్యామ్‌ దగ్గరకు వచ్చేసరికి కొర్రీలు మొదలయ్యాయి... ఇది ఎప్పటికి సెట్ అవుతుందో ఏంటో...

నిన్న వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రతిపాదనల ఆమోద బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తపరిచారు... నవ్యాంధ్ర నిర్మాణానికి ఇంత కష్టపడుతుంటే, కొంత మంది ఐఏఎస్‌ లు తీరు విచాత్రంగా ఉంది అని అన్నారు... హైదరాబాద్‌ నుంచి వచ్చిపోతున్న కొంత మంది ఐఏఎస్‌ అధికారులకు ఈ రాష్ట్రంపై మమకారం కనిపించడం లేదని, మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి పనిచేస్తేనే ఈ ప్రాంతంపై మమకారం వస్తుందని, మొక్కుబడిగా వచ్చే వారిలో ఆ తపన ఎక్కడ ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు..

cbn 24122017 1

ఇక్కడ ఉన్న నగరాలకన్నా పెద్ద నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు అక్కడే హాయిగా కార్యాలయాలు పెట్టుకోవచ్చు. మనం ఏవైనా ప్రోత్సాహకాలు ఇస్తేనో లేదా బాగా సహకరిస్తామనో అనుకొంటేనే ఇక్కడ దాకా వస్తారు. కంపెనీలు వస్తేనే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోటళ్లు పెరుగుతాయి. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి కనిపిస్తుంది. మేం ఊరూరా తిరిగి పెద్ద కంపెనీలను రమ్మని ఆహ్వానిస్తున్నాం. తీరా వచ్చిన తర్వాత మనవాళ్లు రకరకాల కొర్రీలు వేసి వాళ్లను విసిగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి పోతున్న వారిలో కొందరికి ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టడం లేదు. ఇక్కడకు పెట్టుబడులు, కంపెనీలు రావాలన్న తపన వారిలో కనిపించడం లేదు, అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు...

cbn 24122017 1

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ విశాఖలో తన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసామని, వారు విశాఖలో అంతర్జాతీయ స్థాయి డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పెట్టడానికి ముందుకు వచ్చారని అన్నారు. ఆ కంపెనీ 40 ఎకరాల స్థలం అడిగింది. మనం ఒప్పుకున్నాం. కొందరు అధికారులు ఆ ప్రతిపాదన పై రెండు మూడు కొర్రీలు వేశారు. వాటికి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీకి కేవలం పది ఎకరాల స్థలం చాలని ప్రతిపాదన పంపారు. ఏం పద్ధతి ఇది?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌ కలిసి విశాఖలో ఎనిమిదేళ్లలో రూ.455 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. అధికారుల తీరుపై సీఎం ఆగ్రహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకొని కొంత చల్లార్చారు. కొందరు అధికారులతో ఇబ్బంది ఉన్నా చాలామంది బాగా చేస్తున్నారని, కష్టపడేవారిని కూడా చూడాలని ఆయన అనడంతో సమావేశంలో వాతావరణం చల్లబడింది.

అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... రాజధాని శంకుస్థాపనకు నన్ను పిలవద్దు, నేను రాను అన్నోడు, అదే రాజధాని గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు... రాజధానిలో ఒక్క ఇటుక అయినా పేర్చారా అని హేళన చేస్తున్నారు... రికార్డు టైంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కట్టిన, సచివాలయం కనిపించలేదు ఈయనకు... రెండు జాతీయ స్థాయిలో టాప్ యూనివర్సిటీలు మొదలైనా కనిపించిలా... సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు, మరిన్న రోడ్డులు పూర్తవుతున్నా, ఇంకా ఎన్నో పనులు జరుగుతున్నా కనిపించలా... సంవత్సర కాలం నుంచి, జరుగుతున్న విషయాలు తెలియవు ఏమో పాపం...

amaravati 24122017 2

ఇలాంటి వారి కోసం సిఆర్డీఏ 156 పేజీల స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ మూడు సంవత్సరాల్లో అమరావతిలో ఏమి జరిగింది, డేట్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది... ఎన్ని పనులు జరుగుతున్నాయో సవివరంగా చెప్పింది.. అంతే కాదు భూములు త్యాగం చేసిన రైతన్నల కోసం ఏమి చేస్తుంది చెప్పింది... పెన్షన్లు, నైపుణ్య శిక్షణ, ప్లాట్ల కేటాయింపు ఇలా అన్ని వివరాలు చెప్పింది.... 91 పేజిలో దాదాపు 46 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయని అని వివరించి, ఎంత పెట్టుబడి పెట్టేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చేది, ప్రస్తుతం ప్రాజెక్ట్ స్థితి ఇలా అన్నీ వివరించింది.

amaravati 24122017 3

ప్రపంచం లోనే ఇంత వేగం గా ఒక కొలిక్కి వస్తున్న నూతన రాజధాని నిర్మాణం అమరావతి ఒక్కటే ..అది కూడా ప్రభుత్వం దగ్గర తగినంత భూమి , నిధులు లేకపోయినా కూడా...కేవలం ఒకే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో, 33 వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసారు రైతులు... అమరావతి మీద విషం చిమ్ముతూ, నిత్యం దాన్ని నాశనం కోరుకునే సైకోలకి, ఈ రిపోర్ట్ అంకితం... మీకు బుర్ర ఉంటే ఇలాంటివి చదివి అర్ధం చేసుకు చావండి... ఈ డిటైల్డ్ రిపోర్ట్ చూడండి, రాజధాని కోసం, ఏ రోజు ఏ పని చేసారో, ఏ పనులు జరుగుతున్నాయో తెలుస్తుంది. https://crda.ap.gov.in/crda_norifications/NOT12085176/01~APCRDA%20Project%20status%20Report%20Edition-3.pdf

Advertisements

Latest Articles

Most Read