వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే దారుణాలు ఎలా ఉంటాయో తెలిపే సంఘటన ఈరోజు గన్నవరం పట్టణంలో జరిగింది. వివరాలలోకి వెళితే ... ఈరోజు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆపార్టీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఆపార్టీపై అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఆపార్టీ నాయకులు పలువురు విద్యార్ధులను సంప్రదించి ర్యాలీకి మోటార్ సైకిళ్ళు పంపాల్సిందిగా కోరడం ప్రారంభించారు.

gannavarma 21122017 2

ఆ క్రమంలో బాజీ అనే యువకుడిని వారు సంప్రదించగా తాను తెలుగునాడు విద్యార్ధి సంఘం లో పనిచేస్తున్నానని, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు మినహా ఏ ఇతర పార్టీకి తాను సహకరించబోనని సమాధానం ఇచ్చాడు. ర్యాలీ అనంతరం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు మద్యం సేవించి బాజీ ఆచూకీ కొరకు ఆరా తీయసాగారు. సెయింట్ జాన్స్ స్కూల్ ప్రక్కన మరో ఇద్దరు టీ.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులతో కలిసి కూర్చుని ఉన్నారు అని తెలుసుకున్నారు..

gannavarma 21122017 3

ఆ 30 మంది వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు కర్రలు, సరుగుడు బాదులతో వారి దగ్గరకు వెళ్లి, పై దాడికి దిగి నిర్దాక్షిణ్యంగా కొట్టడంతోపాటు ఎన్టీఆర్ ఫోటో ఉన్న మోటార్ సైకిల్ ను క్రిందపడేసి ఫోటో పై మూత్రం పోశారు. బంగారం గొలుసును దౌర్జన్యంగా లాక్కుని తీసుకెళ్ళిపోయారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు బుట్టు రుషి, నార్ల సురేష్, అరుణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఒకరికి చెయ్యి విరగగా మరొకరికి వేళ్ళు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వై.ఎస్.ఆర్.సీ.పీ దౌర్జన్యకాండను దగ్గరలోని ఇంటిలో నివసించే వ్యక్తి వీడియో తీశారు. పోలీసులు కేసు పెట్టి, వారిని అరెస్ట్ చెయ్యాలి అని, గన్నవరం ఎమ్మల్యే వంశీ కోరుతున్నారు...

ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ తో కూల్ గా ఉన్నాయి... ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి 45వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఇవాళ చంద్రబాబు, జగన్ కి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అయితే దీనికి కూడా జగన్, వెటకారంగా రిప్లై ఇచ్చారు.... చంద్రబాబు ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ, ‘సంభ్రమాశ్చర్యానికి లోనయ్యానండీ. ధన్యవాదాలు’ అని జగన్ ట్వీట్ చేశారు.

jagna wishes 21122017 2

అసలు దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమి ఉందో జగన్ కే తెలియాలి... నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా అనేక సందర్భాల్లో చాలా మందికి విషెస్ చెప్పారు... ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు... పండగలప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు.... పోయిన ఏడాది, ఏకంగా అందరూ టీవీలో లైవ్ చూస్తూ ఉండగా, అసెంబ్లీ సమావేశాలు జారుతూ ఉండగా, జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు విషెస్ చెప్పారు... చంద్రబాబు స్వయంగా జగన్ సీట్ దగ్గరకు వెళ్లి విషెస్ చెప్పారు...

jagna wishes 21122017 3

జగన్ గారికి 45 ఏళ్ళు వచ్చాయి కదా, బహుసా, మతి మరుపుతో ఈ విషయం మర్చిపోయి ఉంటారు... అందుకే చంద్రబాబు విషెస్ చెప్పగానే, ఆశ్చర్యపోయారు... నిజానికి ఆశ్చర్యపోవాల్సింది చంద్రబాబు ట్వీట్ కి కాదు, జగన్ ఇచ్చిన రిప్లై కి... జగన్ ఏ నాడు అన్నా, ఆయన నోటితో, ఎవర్ని అన్నా సరే "అండి" అనటం విన్నామా ? ఇది ఆశ్చర్యం అంటే... కాలుస్తా, చెప్పుతో కొడతా, చీపురుతో కొడతా, ఉరి వేస్తా అంటూ, ఆడు, ఈడు అని మాట్లాడే జగన్, ఒకే సారి ఇలా "అండి" అని పిలిచే సరికి ప్రజలు ఆశ్చర్యపోయారు... మా ఆశ్చర్యాన్ని ఇలాగే ఉంచుతూ, రేపటి నుంచి కూడా ఇలాగే గౌరవప్రదంగా రాజకీయాలు చెయ్యాలని జగన్ గారికి మనవి...

ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ టీం, సీక్రెట్ గా సైలెంట్ గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది... ఏ కంపనీతో మాట్లాడుతుంది, ఏ కంపనీ రాష్ట్రానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది అన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నారు... అవగాహన ఒప్పందం కుదిరే ముందు రోజు మాత్రమే బయటకు ప్రకటిస్తున్నారు... ఇతర రాష్ట్రాల నుంచి పోటీని తట్టుకుని ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు అనుసరిస్తున్న వ్యూహమిది.. ఎందుకంటే, మనకి ఇక్కడ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా అన్ని సౌకర్యాలు లేవు... బయటకు తెలిస్తే, వాళ్ళు ఎక్కడ తన్నుకుపోతారో అని గోప్యత పాటిస్తుంది లోకేష్ టీం...

lokesh 21122017 3

మనకి సరైన వసతులు లేకపోయినా, పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తోంది. చాణుక్యుడిలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తోంది. ఒక పక్క చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మరో పక్క రాయితీలు కల్పిస్తామని ఐటీ కంపెనీలను రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో రాష్ట్ర ఐటీ శాఖ సక్సెస్ అవుతుంది. ఇటీవల గూగుల్‌ ఎక్స్‌ కంపెనీ రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దానిపై గత ఆరునెలలుగా కసరత్తు జరుగుతోంది. కాని ఒప్పందం అయ్యేదాకా ఎవరికీ తెలీదు... అదేవిధంగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాన్‌డ్యుయెంట్‌, ఏఎన్‌ఎస్ ఆర్‌, ఫిడెలిటీ తదితర కంపెనీల విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరించారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కంపెనీ విశాఖపట్నంలో జనవరిలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ సంస్థ 2,800 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

lokesh 21122017 2

కాండ్యుయెంట్‌ కంపెనీ కూడా జనవరిలోనే విశాఖకు రానుంది. ఫలితంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. జనవరిలో మంగళగిరి ఐటీ పార్కులో సుమారు 12 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌లో ఒక పెద్ద ఐటీ కంపెనీ రానుంది. ఈ కంపెనీ ద్వారా 900 మందికిపైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నందున కంపెనీ పేరును ప్రస్తుతానికి బహిరంగపర్చడం లేదు. మరోవైపు ఒక ప్రముఖ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీని జనవరిలో రాష్ట్రానికి తెచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇక్కడ లోకేష్ టీం మరో వ్యుహ్యం కూడా అములు చేస్తుంది, ఒప్పందం కుదుర్చుకుని, కంపనీ పెట్టేనాటికి, కంపెనీ మనసు మార్చుకునే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని గ్రహించి, ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో తొలుత కంపెనీలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ఐటీ శాఖ కల్పిస్తోంది. ఫలితంగా ముందు ఆయా కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు, యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం వోట్ బ్యాంకు సంపాదించటానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక నాలుగు సీట్లు భిక్ష పడేయటానికి, 2019 ఎన్నికల్లో సియం అభ్యర్ధి ఎవరో సోము వీర్రాజు నిర్ణయించటానికి, ఇంకా కుదిరితే, సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటానికి, ఉత్తర్ ప్రదేశ్ నుంచి బైకులు వచ్చాయి... ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగకపోవటానికి కారణమేమిటో సోము వీర్రాజుజు తెలిసిపోయింది.. అందుకే యూపీలో బ్రహ్మాండమైన ఘనవిజయానికి కారణమైన బైకులను బెజవాడ తెప్పించారు... ఇక ఈ బైకులు వేసుకుని, ఊరు ఊరు తిరిగి, 2019 ఎన్నికల్లో సియం అభ్యర్ధి ఎవరు అనేది నిర్ణయించనున్నారు సోము వీర్రాజు...

bjp bikes 21122017 2

యూపీ నుంచి యూపీ రిజిస్ట్రేషన్‌తోనే బైకులు బెజవాడ వచ్చయి.. దాదాపు ఒక 100 బైకులు తెప్పించారు... బైకులు కూడా అక్కడ నుంచి తెప్పించాలా అని అడిగితే, వీటితో అక్కడ పని లేదు, అక్కడ ముఖ్యమంత్రి మా వాడే, ఇక్కడ మేము ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి, ఈ బళ్ళు తెప్పించాం... ఈ బైకుల మీద తిరిగి, ఆంధ్రప్రదేశ్ మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి, 2019 ఎన్నికల్లో సియం అభ్యర్ధి ఎవరు అనేది నిర్ణయిస్తారు సోము వీర్రాజు... అందుకే ఇవి యూపీ రిజిస్ట్రేషన్ బైకులు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించి, అవి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు అని ఎక్కడ లోపల వేస్తాడో అని, ముందుగానే బెజవాడలో రీ రిజిస్ట్రేషన్ చేపించారు...

bjp bikes 21122017 3

ఇక టైం చూసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి, సోము వీర్రాజు గారు వీటిని ప్రారంభించి, సరా సరి ఈ బైకులు వేసుకునే 2019లో అమరావతి అసెంబ్లీలో అడుగు పెట్టి, ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారు... ఎలాగు సోషల్ మీడియాలో పనీ పాట లేకుండా కొంత మంది దేశం కోసం పోరాడుతూ, గో సంరక్షణ చేస్తున్నారు... అలాంటి వీర దేశ భక్తులకు ఈ బైకులు అందచేసి, తన వీర ప్రతాపాన్ని చూపించబోతున్నారు, సోము వీర్రాజు... ఈ పరిణామాలు చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, భయపడి పోయి, సోము వీర్రాజుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.. ఎలాగు, 2019 ఎన్నికల్లో సియం అభ్యర్ధిని నిర్ణయించేది ఆయనే కదా, అందుకని...

Advertisements

Latest Articles

Most Read