ఆంధ్రప్రదేశ్ పాలనా రంగంలో త్వరలో ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు కానుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థని ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారు... మరో 20 రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత సన్నిహితం చేసే లక్ష్యంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ‘సాధికార మిత్ర’ల పేరుతో నాలుగు లక్షల మంది మహిళలతో స్వచ్ఛంద సేవా దళం రూపొందిస్తున్నారు. పూర్తిగా మహిళలతోనే ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది.

ap 21122017 1

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది సాధికార మిత్రలను ప్రభుత్వం నియమించింది. ప్రతి 35 కుటుంబాలను ఒక యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.04 కోట్ల గ్రామీణ కుటుంబాల సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ సాధికార మిత్రలను వినియోగించనున్నారు. సాధికార మిత్రల నియామకాలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ( సెర్ప్) ఇప్పటికే పూర్తి చేసేసింది. డ్వాక్రా సభ్యులై ఉండి సేవాభావం కలిగిన 35 ఏళ్ళ లోపు వయసు వారిని ఇందు కోసం ఎంపిక చేశారు. వీరికి కనీస అర్హత 8వ తరగతిగా నిర్ణయించారు.

అలాగే వీరు ఒక స్మార్ట్ ఫోన్ సైతం కలిగి ఉండాలి. వీరందరికీ సరైన శిక్షణ ఇచ్చి ఒక గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా వీరికోసం ఒక ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నారు. వీరి ఫోన్లలో ప్రభుత్వమే ఒక ఉచిత సిమ్ వేయిస్తుంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న 1100 కాల్ సెంటర్ లోనే అదనంగా మరో 250 మందితో మరో విభాగాన్నికూడా ఏర్పాటు చేయనున్నారు. మరో 20 రోజుల్లో ఇవన్నీ పూర్తయి రాష్ట్రంలో ఒక నూతన వ్యవస్థ ఏర్పడనుంది. ప్రజాసమస్యలు తక్షణం పరిష్కారం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇది ఒక శుభ పరిణామం... ఒక సంస్కారం ఉన్న నాయకుడు ప్రవర్తించే తీరుకు నిదర్శనం ఇది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్ధులు... జగన్, చంద్రబాబు వయసుకి, హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎన్నో సందర్భాల్లో ఏక వచనంతో సంభోదిస్తూ, బూతులు తిడుతూ, తిట్టిస్తూ, చివరికి ఉరి వెయ్యాలి, కాల్చేస్తాను అని కూడా అన్నారు. అయినా చంద్రబాబు తన సంస్కారం చూపించారు... హుందాతనం చూపించారు... ఇవాళ జగన్ మోహన్ రెడ్డి 45వ ఏట అడుగు పెడుతున్నారు...

cbn wishes 21122017 2

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , సీఎం నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మాల్దీవుల్లో హాలిడే లో ఉన్న చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా జగన్ మోహన్ రెడ్డికి విషెస్ చెప్పారు... "Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life." అంటూ ట్వీట్ట్ చేశారు. జగన్ మరి ఈ ట్వీట్ కు స్పందిస్తారో లేదో చూడాలి.. చంద్రబాబు ఎన్ని వైరాలు ఉన్నా, హుందాతనంగా స్పందించారు... ఇది వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా, సభ లోపలికి జగన్ రాగానే.. జగన్ సీటు వద్దకు వెళ్లిన చంద్రబాబు కరచాలనం చేసి బర్త్ డే విషెస్ చెప్పారు.

cbn wishes 21122017 3

ఇప్పటికైనా జగన్ తను ఒక రాజకీయ నాయకుడు అనే విషయం గుర్తుంచుకోవాలి... హుందా రాజకీయాలు చెయ్యాలి అని కోరుకుందాం... రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఉంటాయి, కాని హుందాగా ఉంటే అందరికీ మంచిది... ప్రజలకు కూడా మంచి సందేశం వెళ్తుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ట్వీట్ కి చాలా మంది రిప్లై ఇస్తూ, ఇలాంటి హుందా రాజకీయాలు కావలి అని కోరుకుంటున్నారు... జగన కూడా హుందాగా స్పందించి, మంచి సంప్రదాయానికి నాంది పలకాలని కోరుకుంటున్నారు... జగన్ కు ఇష్టం లేక పోయినా, కనీసం ఆ ప్రశాంత్ కిషోర్ అన్నా సలహా ఇచ్చి, చంద్రబాబుకి విషెస్ చెప్పినందుకు ధ్యన్యవాదుఅలు చెప్పాలి అని కోరుకుంటున్నారు...

1.7 లక్షల కోట్ల భారీ స్కాం అని కాగ్ ఆరోపించింది. సీబీఐ, ఈడీ దర్యాఫ్తు చేసి రూ.30,984 కోట్ల మేర స్కాం జరిగినట్టు కోర్ట్ కి తెలిపింది... కాని కోర్ట్, సరైన ఆధారాలు లేవు అని, స్కాంలో ఎవరూ నిందుతులు కాదు అని సింగల్ లైన్ లో తీర్పు ఇచ్చింది... మరి, ఆ 1.7 లక్షల కోట్లు ఎవరు తిన్నారు ? వారు దోషులు కాకపొతే, మరి దోషులు ఎవరు ? అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లూటి చేసింది అని ఆరోపించిన బీజేపీ పార్టీ ఇవాళ అధికారంలో ఉండి కూడా, తన చేతిలో సిబిఐని ఉంచుకుని కూడా సరైన ఆధారాలు ఎందుకు చూపించలేదు ? ఎందుకు ప్రూవ్ చెయ్యలేక పోయింది ? ఇంతకీ స్కాం అని జరిగిందా ? ఇవాళ తీర్పుని బట్టి చుస్తే, అసలు 2జీ స్కాం జరగనేలేదు అనే భావన వ్యక్తం అవుతుంది ? మరి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ? 1.7 లక్షల కోట్ల భారీ స్కాంలో, ఒక్కరు కూడా దొంగ కాదా ? ఒక్క ఆధారం కూడా సిబిఐ చూపించలేదా ?

2G 21122017 2

తరువాత బొగ్గు కుంబకోణం, కామన్ వెల్త్ స్కాం, గాలి జనార్ధన రెడ్డి స్కాం, జగన్ దోపిడీ, ఇవి కూడా జరగలేదు అని చెప్తారా ? ఒక్క కేసు కూడా కేంద్ర ప్రభుత్వం నిరూపించలేదా ? దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో దోషులు ఇంటికి వెళ్లి, ప్రధాన స్థాయి వ్యక్తి వాళ్ళతో గడిపి, ఈ దేశానికి ఏ సంకేతం ఇస్తున్నారు ? ఇదేనా మీరు చేసే అవినీతి మీద పోరాటం ? ఢిల్లీలో మీ నివాసిని వచ్చి, కరుణానిధిని సేద తీరమన్నారు అంటే, ఒక వేల జగన్ మోహన్ రెడ్డి తాత రాజా రెడ్డి బ్రతికి ఉంటే, ఆయన్ను కూడా ఇలాగే వచ్చి ఢిల్లీలో మీ నివాసంలో సేద తీరమనేవారు ఏమో ?

2G 21122017 3

ఎవరూ దోషులు కానప్పుడు, ఎవరూ స్కాం చేయ్యినప్పుడు, 2012 ఫిబ్రవరిలో అపెక్స్ కోర్ట్, 122 టెలికాం లైసెన్స్ లు ఎందుకు రద్దు చేసింది ? 9 కంపెనీలకు అలాట్ చేసిన స్పెక్ట్రమ్ లు ఎందుకు రద్దు చేసింది ? ఏ స్కాం జరగపోతే అప్పుడు ఇలా ఎందుకు జరిగింది ? ఇప్పుడు మళ్ళీ హై కోర్ట్ అని, సుప్రీమ్ కోర్ట్ అని, ఈ కేసు తేలే సరికి, 10జి యుగంలో ఉంటాం అంటే ఆశ్చర్యం కాదు ఏమో... ఎవరిని నిందించాలి ? రాజకీయ నాయకులనా ? సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలనా ? కోర్ట్ లనా ? వ్యవస్థనా ? లేక న్యాయం కోసం ఎదురు చూసే ఈ దేశపు పిచ్చి జనాలనా ? చూస్తా ఉంటే అందరూ మంచి వారే... న్యాయం కోసం చూసే జనాలే పిచ్చి వారు... సెల్యూట్ టు మై కంట్రీ... జై హింద్...

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు... ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లలో జరుగుతూ ఉండటంతో, అక్కడే ఆయన తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు.. అయితే, ఇవాళ 11 గంటల సమయంలో 2జీ స్కాం పై తీర్పు రావటం, అంత పెద్ద కుంబకోణంలో, ఎవరూ నిందితులు కాదు అని తేలటంతో జగన్ సంబారాలు రెట్టింపు అయ్యాయి... ఒక పక్క పుట్టిన రోజు జోష్ తో పాటు, 1.76 వేల కోట్లు స్కాం జరిగినా, ఎవరూ తప్పు చెయ్యలేదు అని, సరైన ఆధారాలు లేక కేసు కొట్టేస్తున్నాం అని సిబిఐ కోర్ట్ చెప్పటంతో, జగన్ ఎగిరి గెంతులు వేస్తున్నారు...

jagan 21122017 2

మోదీ వెళ్ళి కరుణానిధిని కలిసి దిల్లీలో నా దగ్గర ఉండి రెస్ట్ తీసుకో బాబాయ్ అన్నప్పుడే అందరకీ సినిమా అర్ధం అయ్యింది. అందరూ నిర్దోషులే అని తీర్పు రావటంతో, ఇక ఇవాళ సాయంత్రం నుండి జగన్ స్వరంలో ఉత్సాహం మరింత పెరగనుంది. ఇక డెయిలీ విజయసాయిరెడ్డి దిల్లీకి ఎక్కే ఫ్లయిట్ ! దిగే ఫ్లయిట్! ఇవే సీన్లు ఇక చూస్తూ ఉండవచ్చు.... పాపం జగన్, ఆయన తాత రాజా రెడ్డి లేడే అని బాధ పడుతున్నారు... ఒక వేళ జగన్ తాత రాజా రెడ్డి ఉండి ఉంటే, ఎదో ఒక రోజు మోడీ, లోటస్ పాండ్ వచ్చి, రాజా రెడ్డి గారు, మీరు వచ్చి ఢిల్లీలో నా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని ఉండే వారు, అని జగన్ ఆశ పడుతున్నారు...

jagan 21122017 3

ఏది ఏమైనా, ఇవాళ జగన్ బర్త్ డే రోజు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు... ఇక ప్రజలకి మరింత క్లారిటీ వచ్చింది... ఇక ప్రజలే అన్నీ అలోచించి, జరుగుతున్న పరిణామాలు చూసి, సరైన నిర్ణయం తీసుకోవాలి... కోర్ట్ ల కంటే, ప్రజలే ఇలాంటి నాయకులకి అంతిమ నిర్ణేతలు... ఇక త్వరలో మరిన్ని సీన్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడవచ్చు........ ఆవిధంగా అందరూ మంచివారే అని, వారు చేసిన కార్యక్రమములన్నియూ లోక కళ్యాణం కోసం ఒనర్చిన మహత్తర పుణ్యకార్యమలనియూ అని సూతమహాముని ఆశ్రమవాసులకు చెప్పి, తన నిజగృహమునకేగెను. ఆ పిమ్మట ఆ మంచివారందరూ పరమాత్ముని లో లీనమై పుణ్యపురుషులుగా పూజలందుకొనసాగిరి.... జై హింద్...

Advertisements

Latest Articles

Most Read