గుజరాత్ ఎన్నికల్లో, కాంగ్రెస్, బీజేపీ పోరు... వాటి తరువాత, ఇవాళ వచ్చిన ఫలితాలు... బీజేపీ అన్నీ తట్టుకుని నిలబడటం.. ఏ ఒక్క ఆకర్షణీయ సంక్షేమ పధకాలు బీజీపీ ప్రకటించకపోయినా, రిజర్వేషన్లు ఇవ్వను అన్నా, ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపటం, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, అన్నీ ఫ్రీ అని చెప్పినా, అడిగినవారికి అందరకీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పినా, కాంగ్రెస్ ఓడిపోవటం, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ టెలి కాన్ఫరెన్స్ లో విశ్లేషించుకున్నారు. బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ ది నైతిక విజయం అని విశ్లేషకులు అంటున్నా, గెలుపు గెలుపే కాబట్టి, గుజరాత్ ఫార్ములా మనం కూడా వర్క్ అవుట్ చేద్దాం అని నిర్ణయానికి వచ్చి, రెండు నిర్ణయాలు తీసుకున్నారు...
మొదటిది, గుజరాత్ లో చివరి వరకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గెట్టి పోటీ ఇచ్చింది.. కాని చివర్లో ప్రధాని నరేంద్ర మోడి ప్రచారం, ప్రజల్లో భావోద్వేగాన్ని రగిల్చింది... ప్రధాని స్థాయి వ్యక్టి తన స్థాయికి దిగజారి, నన్ను చంపటానికి సుపారీ ఇచ్చారు అని, నన్ను నీఛ్ అంటున్నారు అని, నన్ను తప్పించటానికి పాకిస్తాన్ తో చేతులు కలిపారు అని ఇలా ప్రచారం చేశారు... ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది... ఒక్కసారిగా బీజేపీ వైపు వేవ్ వచ్చింది.. అందుకే జగన్ కూడా తన పంధా మార్చాలి అని నిర్ణయించుకున్నారు... మొన్నటి దాకా చంద్రబాబుని కాల్చేస్తా, ఉరి వేస్తా, చెప్పుతో కొడతా, చీపురు పెట్టి కొడతా అన్న జగన్, ఇప్పుడు స్టైల్ మార్చి, నన్ను చంపటానికి చంద్రబాబు చూస్తున్నారు... నన్ను చంపటానికి విదేశాల్లో స్కెచ్ వేశారు అనే ప్రచారం చేసి, ప్రజల్లో సానుభూతి పొందటానికి ప్రయత్నం చెయ్యనున్నారు...
రెండోది, రిజర్వేషన్ల విషయం... గుజరాత్ లో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతుంటే, మోడీ మాత్రం, రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు.. అయినా, ఆయన్ను అక్కడ ప్రజలు గెలిపించారు... అందుకే జగన్ కూడా, ఈ ఫార్ములా వైపు మొగ్గు చూపుతున్నారు... ముద్రగడతో అర్జంట్ గా కటీఫ్ కొట్టి, ఇలాంటి రిజర్వేషన్లు మంచివి కావు అనే వాదన పైకి తేవటానికి ప్రయత్నం చెయ్యనున్నారు... ఎసి రిజర్వేషన్ల అంశంలో కూడా, దానికి నేను వ్యతిరేకం అని జగన్ చెప్పనున్నారు... ఈ విధంగా, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆకట్టుకోవొచ్చు అని, గుజరాత్ లో అదే జరిగింది అనేది జగన్, ప్రశాంత్ కిషోర్ ఆలోచన... మరి, వీటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి...