పోలవరం ప్రాజెక్ట్ అంశం మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోయిన వారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీని కలిసారు... కేంద్ర మంత్రులని కలిసినా, లేకపోతే విదేశాలకు వెళ్ళినా, ఎవరన్నా అతిధులు అమరావతి వచ్చినా, వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువా కప్పి, వెంకటేశ్వర స్వామి ప్రతిమ కాని, బొబ్బిలి వీణ కాని ఇచ్చి, తిరుమల లడ్డులు ఇస్తూ ఉంటారు... చంద్రబాబు వస్తున్నారు అంటే, తిరుపతి లడ్డూ ఇస్తారని ఢిల్లీ పెద్దలుగా ఎదురు చూస్తూ ఉంటారు... ఇదే సంప్రదాయం ప్రకారం, ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసినప్పుడు, ఆయనకు ఇలాగీ శాలువా కప్పి, బొబ్బిలి వీణ ఇచ్చారు..
ఈ సందర్భంలో శాలువా మడతల్లో ఉన్న ఒక పేపర్, గడ్కరీకి శాలువా కప్పే క్రమంలో ఆ పేపర్ కింద పడింది... తరువాత గడ్కరికీ బొబ్బిలి వీణ కూడా ఇచ్చారు... ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కిందకు వంగి, ఆ పడిన పేపర్ తీసి తన వెనుక ఉన్న వారికి ఇచ్చి, డస్ట్ బిన్ లో వెయ్యమన్నారు...ఈ దృశ్యం చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారు... కింద పడిన పేపర్ ని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు తియ్యటం నిజంగా సుభ పరిణామం అని, స్వచ్ఛ భారత్ లక్ష్యంతో పని చేస్తున్న మనం, ఇలా ప్రవర్తించటం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది అని అన్నారు... ప్రధాని మోడీ కూడా ఇటీవల, పుస్తక ఆవిష్కరణ సమయంలో, పేపర్ కింద వెయ్యకుండా, ఆయన జేబులో పెట్టుకని అందరినీ ఆశ్చర్యపరిచారు...
ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, కింద పడిన పేపర్ తీసి డస్ట్ బిన్ లో వెయ్యటంతో, అక్కడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు... నిజానికి చంద్రబాబు ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు... వెలగపూడి సచివాలయంలో, చిన్న పేపర్ ముక్క కూడా కనపడకుండా అద్దంలా ఉండేలా ఆఫీస్ ను ఉంచుతున్నారు... బయట నుంచి ఎవరన్నా వచ్చి ముఖ్యమంత్రిని కలసినా, అక్కడ పచ్చదనం, క్లీన్ గా ఉన్న పరిసరాలు చూసి, అభినందిస్తున్నారు... అందరూ ఇలా బాధ్యతగా ఉంటే, స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ భారత్ లక్ష్యం చాలా తొందరగా చేరుకోవచ్చు...