పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు... పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు.. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలని, అందరూ చంద్రబాబు వెనుక ఉంటారని, కాని కాంప్రమైజ్ అవ్వద్దు అని అన్నారు... అంతే కాదు, కేంద్రం పై, ముఖ్యంగా మోడీ, అమిత్ షా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు... మోడీ, అమిత్ షా హిస్టరీ చాలా భయంకరమైనది అని, వారికి అడ్డు వస్తే, చంపెయ్యటానికి కూడా వెనకాడరని అది చరిత్ర అని ఉండవల్లి అన్నారు...
ఆ భయంతోనే చాలా మంది సరెండర్ అవుతున్నారు అని అన్నారు... ఈ ఇద్దరి చరిత్రే అది అని అనంరు... చంద్రబాబు ఇలా చంపేస్తారని భయపడుతున్నారా, లేక కేసులు వేసి ఇబ్బంది పెడతారానికి అని భయపడుతున్నారా అంటూ, ఉండవల్లి చంద్రబాబుని జాగ్రత్తగా ఉండమన్నారు... వారి హిందూ ఎజెండా కోసం, ఎలా చేస్తున్నారో చూస్తున్నామని అని అన్నారు.. బీజేపీ పార్టీ ఫిలాసఫీ కంటే, మోడీ, అమిత్ షా ఫిలాసఫీ చాలా భయంకరమైనది అని అన్నారు... వీరికి అధికారంలోకి కొనసాగటం ఏకైక ఎజెండా అని, దాని కోసం ఏమైనా చేస్తారు అని, అవసరమైతే అడ్డు అనుకుంటే, చంపేస్తారు అని అన్నారు...
పోలవరం విషయంలో, దానికి సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, దాని కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అందరూ పోరాడాలి అని అన్నారు... పెరిగిన ఖర్చులు అన్నీ కేంద్రమే పెట్టుకోవాలని అని అన్నారు.. దాంట్లో వేరే ఆలోచనే ఉండకూడదు అని అన్నారు... చంద్రబాబు దీని కోసం ఇక పోరాడాలి అని, ఆయన పోరాడితే, రాష్ట్రం మొత్తం ఆయన వెనుకే ఉంటుంది అని, చివరకి రాష్ట్రంలోని బీజేపి నాయకులు కూడా పోలవరం విషయంలో ఆయన వెనుకే ఉంటారు అని, చివరకి జగన్ పార్టీ కూడా ఆయన వెంట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని, లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అని, అందరూ చంద్రబాబు పోరాటం చేస్తే, సహకరించాలి అని అన్నారు...