పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు భరిస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన సహజ ధోరణికి భిన్నంగా స్పందించారు... ఏంటో ఓర్పుగా ఉండే చంద్రబాబు, ఇవాళ కేంద్రం పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాఫర్‌ డ్యామ్‌ ఆపమని ఉత్తరం రాయటంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు, తీవ్రంగా స్పందించారు... మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా, పోలవరం జోలికి వస్తుంటే మాత్రం తట్టుకోలేను అంటూ, బాధని వ్యక్తం చేశారు..

cbn serious 30112017 1

అంతే కాదు, అందరూ ఆశ్చర్యపోయేలా, పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు... ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా, అక్కడ విలేకరులు ఖంగు తిన్నారు...ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు...

cbn serious 30112017 2

కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని మీడియాకు ఆయన వివరించారు. విభజన హామీల సాధనలో రాజకీయం చేయనని చంద్రబాబు తేల్చిచెప్పారు. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు...

స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాఫర్‌ డ్యామ్‌ ఆపమని కేంద్రం చెప్పటంతో, రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి... పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్న కేంద్రం పదే పదే కొర్రీలేస్తూ పనులు ముందుకు సాగకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేస్తోందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది... దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు... పోలవరం పనులు ఆపాలన్న కేంద్రం లేఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు... గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్ని్ంచానని, ఆయన లండన్ లో ఉన్నారని, గడ్కరీ లండన్ నుంచి రాగానే మాట్లాడుతానని చెప్పారు... పోలవరం కోసం ఇంకా 60 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, 98 వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయని అన్నారు...

polavaram 301120177 2

కేంద్రం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, పోలవరం టెండర్ల పై ముందుకు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు... ముఖ్యమంత్రి సూచన ప్రకారం, టెండర్లను ఆన్లైన్ లో ప్రభుత్వం అప్లోడ్ చేసింది... కేంద్రం ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, పనుల్లో మాత్రం జాప్యం జరగకూడదు అని, అనుకున్న ప్రకారం ముందుకు వెళ్ళమని చంద్రబాబు ఆదేశించారు... ప్రాజెక్ట్ పనులకు 1483 కోట్లతో టెండర్లు పిలిచారు... స్పిల్ వేకు రూ.683 కోట్లు, స్పిల్ చానెల్ కు 850 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలకు డిసెంబర్ 20 వరకు గడువు...21న టెక్నికల్ బిడ్, 23న ఫైనాన్షియల్ బిడ్ తెరవాలని నిర్ణయించారు...

polavaram 301120177 3

అంతే కాకుండా, బీజేపీ ప్రజాప్రతినిధులలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు... ఈ భేటీలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గున్నారు... పోలవరం టెండర్ల నిలిపివేత, పునర్విభజన చట్టం ప్రత్యేక ప్యాకేజీ ఆర్ధికసాయంపై చర్చించారు... కేంద్రం మీద మీరు కూడా ఒత్తిడి తేవాలని బీజేపీ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.. మరో వైపు కేంద్రం నిర్ణయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కేంద్రం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు... రాజకీయలు ఎలా ఉన్నా, పోలవరం ఆపాలి అనుకోవటం దారుణం అని, కేంద్రం వెంటనే తన వైఖరి మార్చుకోవాలని, పోలవరం పూర్తి చెయ్యటానికి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలి అని అంటున్నారు...

పదిహేనేళ్ల క్రితం ప్రెసిడెంటునే తెచ్చినోడు.. ఆయన కట్టిన నగరానికి ఇవాళ ఒక ప్రెసిడెంటు కూతుర్ని తీసుకొచ్చి, ఆయన కట్టి ఇఛ్చిన కన్వెన్షన్ సెంటర్లోనే ఈవెంట్ చేసుకుంటూ ఆయన్నే ఎగతాళి చెయ్యాలని చుసిన వారికి చిన్న షాక్... ఆయన అంటే ఏంటో తెలుసా... మీరు సమ్మిట్ లు చేసుకుంటుంటే, ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు... ఆయన స్థాయి అది.... ఆయన్ను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది అందుకే... ఆయన్ను చూసి, మిగతా రాష్ట్రాలు అసూయ పడేది అందుకే... ఒకే రోజు రెండు టాప్ కంపెనీలు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చాయి... ఒకటి ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అశోక్ లేల్యాండ్, మరొకటి ఎంఎఫ్‌సీజీ తయారీ రంగంలో ముందున్న విప్రో ఎంటర్‌ప్రైజెస్...

cbn ashok 29112017 2

బుధవారం సచివాలయంలో విప్రో సంస్థ సీఎఫ్‌వో రాఘవ్ స్వామినాథన్, అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధంగా వున్నామని రాఘవ్ స్వామినాథన్ ముఖ్యమంత్రికి తెలిపారు. రూ. 200 కోట్లు నుంచి రూ. 350 కోట్లు పెట్టుబడి పెడతామని, తమ యూనిట్ నెలకొల్పేందుకు రాష్ట్రంలో 40 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. సబ్బులు, ఎల్‌ఈడీ ఉత్పత్తుల తయారీని చేపట్టాలని భావిస్తున్నట్టు వివరించారు.

cbn ashok 29112017 3

కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో అశోక్ లేల్యాండ్ బస్ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌కు సంబంధించి ప్లాన్‌ వివరాలను ముఖ్యమంత్రికి వినోద్ కె దాసరి అందించారు. మొత్తం 75 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌ ఏడాదికి 4,800 బస్సులు తయారు చేసే సామర్ధ్యం కలిగివుంటుందని, 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. బస్సుల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కేంద్రం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూకేటాయింపులు, ఇతర అనుమతులు పూర్తిగా వచ్చిన ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వరుస సమావేశాల్లో వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ సాల్మన్ ఆరోకియారాజ్ పాల్గొన్నారు.

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం పూర్తిచేయాలని ఎంతో, ఓర్పుతో బాధను దిగమింగి పోరాడుతున్నా... కొర్రీలుపెడుతూ సహకరించను అంటుంది కేంద్రం... మొన్న కాఫర్ డ్యాం ఆపెయ్యమంది... ఓ కమిటీ వేస్తామని చెప్పెంది... అప్పటి దాకా ఆగమంది.... కాని ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు... తాజాగా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్లు ఆపాలని హుకుం జారీ చేసింది... ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది... ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై కేంద్రం పెడుతున్న కొర్రీలకు ఇబ్బంది పడుతున్న రాష్ట్రం, ఇప్పుడు స్పిల్‌ వే, చానల్‌ టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు... పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్న కేంద్రం పదే పదే కొర్రీలేస్తూ పనులు ముందుకు సాగకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ..

poloavaram 3012017 1

ఈ ఏడాది అక్టోబరు 13న నాగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి, పోలవరం కాంక్రీట్‌ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని, 2018కి గ్రావిటీ ద్వారా 2019కి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి టెండర్లు పిలుస్తామని వివరించారు. కాంక్రీట్‌ పనుల కోసమే టెండర్లను పిలుస్తున్నందున, మైనస్‌ 14 శాతానికి మించి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం బృందం వివరించింది... కొత్త టెండర్లకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లుగా పేర్కొనడంతో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు సంబంధించి మిగిలిన రూ.1395.30 కోట్ల మేర పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. కానీ ఈ టెండర్లను నిలుపుదల చేయాలంటూ.. ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాశారు... టెండర్లుకు తక్కువ సమయం కేటాయించారనే కారణం చూపి, ఇవి ఆపేయాలి అని లెటర్ లో రాసారు...

poloavaram 3012017 2

ఒక్క రోజు లో రిటైర్ అవుతుండగా, కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌, పోలవరం పనులు నిలిపివేయాలి అంటూ, రాష్ట్రానికి ఉత్తరం రాశారు... చంద్రబాబు గారి ఓర్పుని, మంచితనంని చేతకాని తనంగా తీసుకొంటే బీజేపికి కూడా కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో. కేంద్రం అన్ని నిధులు ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది అని డబ్బాలు కొట్టుకునే బీజేపీ, పోలవరం గురించి ఎందుకు మీ అధిష్ఠానంని నిలదీయడం లేదు. బాబు గారు మా రాష్ట్ర భవిష్యత్ కోసం, మా ప్రజల కోసం అన్ని భరిస్తూనారు. ఇలాగే చేస్తే చంద్రబాబు తిరగబడటానికి ఆలోచిస్తారు ఏమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు... పోలవరం మన నినాదం... పోలవరం మన హక్కు... పోలవరం మన జీవ నాడీ... పోలవరం మన ఆత్మ... పోలవరం మన ఊపిరి... పోలవరం మన శ్వాస... పోలవరం మన సర్వం... కాదు కూడదు అని అడ్డుపడితే, చరిత్రని అడగండి, ఆంధ్రా వాడి దమ్ము ఏంటో... జై ఆంధ్రప్రదేశ్... జైజై అమరావతి... జైజైజై పోలవరం...

Advertisements

Latest Articles

Most Read