చక్కగా ఇవాంకా ట్రంప్ వచ్చింది.... హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ జరిగింది... అన్ని చానల్స్ హడావిడి చేశారు.... అంతా బాగానే ఉంది.... మధ్యలో మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఏడుపు ఎందుకు ? చంద్రబాబుని ఆహ్వానించలేదు అని వెటకారాలు ఎందుకు ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవంకా కోసం చాలా ప్రయత్నించింది, కాని తెలంగాణా చేతిలో ఓడిపోయింది అనే ఎత్తిపొడుపు కట్టు కధలు ఎందుకు ? మీ హైదరాబాద్ మీడియా చానల్స్ యాంకర్స్, మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వెటకారం చేస్తూ ట్వీట్ లు ఎందుకు ? తెలంగాణా మీద, హైదరాబాద్ మీద ప్రేమ తప్పు కాదు.... కాని మధ్యలో మా ముఖ్యమంత్రిని చులకన చెయ్యటం ఎందుకు ? ఇవన్నీ చూస్తున్న, కొంత మంది సోషల్ మీడియాకు కొత్తగా వచ్చిన పిల్ల కాయలు మరింత రెచ్చిపోవటం... ఇవాంకా ట్రంప్ వచ్చినా, మరో తురుం ఖాన్ వచ్చినా ఎందుకో తెలుసా ? వీరంతా కెసిఆర్ ని చూసి రాలేదు.... కేటీఆర్ ఇంగ్లీష్ చూసి రాలేదు... హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక వసతులు చూసి వచ్చారు... ఇవాంకా ట్రంప్ తో పాటు, మరో 1500 మంది విదేశీ ప్రతినిధులు కూర్చున్న వేదిక, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)... ఈ వేదిక కట్టింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అసలు ఈ పిల్లకాయలకి, మతి మరుపు వచ్చి విషయాలు మర్చిపోయిన ముసలి వాళ్లకి చెప్పేది ఏంటి అంటే, మీకు హైదరాబాద్ ఉందేమో... మాకు హైదరాబాద్ ని విశ్వనగరంగా తయారు చేసిన చంద్రబాబు ఉన్నాడు... హైదరాబాద్ కి చంద్రబాబు ఏమి చేశాడు అని అడుగుతారా ? చాంతాడు అంత ఉంది చెప్పటానికి....
చంద్రబాబు 1995లో సీఎం అయ్యాక, కొన్ని వందల గంటలపాటు మేధో మథనం చేసి విజ్ఞాన ఆధారిత కంపెనీలు తెస్తేనే ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయని నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ ఢిల్లీ వస్తుంటే ఆయనను కలవాలని అపాయింట్మెంట్ అడిగారు చంద్రబాబు. తనకు రాజకీయ నాయకులతో పని లేదని, కలిసే ఉద్దేశం లేదని బిల్ గేట్స్ బదులిచ్చారు. ఎంతో ప్రయత్నం చేస్తే చివరకు ఐదు నిమిషాలు మాత్రం టైం ఇచ్చారు. కానీ ఆయన చంద్రబాబుతో 45 నిమషాలు మాట్లాడారు. విజ్ఞాన ఆధారిత సమాజం పై చంద్రబాబు ఆలోచనలు, భారతకు ఆ విషయంలో ఉన్న బలాలను ఆయనకు వివరించారు. బిల్ గేట్స్ ఆశ్చర్యపోయి ఏం కావాలని చంద్రబాబుని అడిగారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్యా లయం పెట్టాలని చంద్రబాబు కోరారు. అమెరికా దాటి బయటకు రాదల్చుకొంటే హైదరాబాద్ వస్తామని ఆయన చెప్పారు. తర్వాత అమెరికా లోని ఆయన కార్యాలయానికి వెళ్ళారు చంద్రబాబు. దావోస్‌లో కలిసి మాట్లాడారు. ఇన్నిసార్లు తిరిగితే బిల్ గేట్స్ అమెరికా బయట తన మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టారు. ఇది మొన్న విశాఖ పర్యటనలో బిల్ గేట్స్ స్వయంగా చెప్పింది కూడా విన్నాం... మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఒరాకిల్, TCS, Deloitte, Cognizant, ఇన్ఫోసిస్... ఇలా వరుసగా అనేక కంపెనీలు ఇక్కడకు తరలి వచ్చాయి. ఇందుకోసం న్యూయార్కులో 18 రోజులుండి ఫైళ్లు మోసుకుంటూ తిరిగారు చంద్రబాబు. హైదరాబాద్ ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెబుతూ ఒక విధంగా మార్కెటింగ్ చేశారు. అంత శ్రమ వల్లే నేడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారింది. ఒక ఐటీ జాబ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఇతర రంగాల్లో ఐదు ఉద్యోగాలు వస్తున్నాయి.
ఐఎస్బీని ముంబై, బెంగళూరు, చెన్నైలో పెట్టాలని ఆలోచన చేస్తే.. దేశంలోని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు స్వయంగా ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు టిఫిన్లు వడ్డించి హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఐటీ కంపెనీలు రావడానికి అన్ని సదుపాయాలు ఉన్న ఆవరణలు కావాలని ముంబైలోని రహేజా కార్యాలయానికి చంద్రబాబు వెళ్ళి మాట్లాడారు. ప్రతి వెయ్యి ఉద్యోగాలకు ఒక ఎకరం చొప్పున లక్ష ఉద్యోగాలకు వంద ఎకరాలు ఇచ్చారు. మైండ్ స్పేస్ పేరుతో ఒక అందమైన ఆవరణను వారు హైదరాబాద్ లో నిర్మించారు. ఇప్పుడు అందులోనే లక్షన్నర మంది పనిచేస్తున్నారు. బేగంపేట విమానా శ్రయం చాలదని దేశంలో మొదటిసారి ప్రైవేట్ రంగంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని శంషాబాద్‌లో ప్రతిపాదించి కట్టించారు చంద్రబాబు.... ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వేసిన ఐటి ముద్ర... ఇది చేరిపేస్తే చెరిగిపోయేది కాదు... అమలాపురం నుంచి, ఆదిలాబాద్ దాకా, ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసుకుని, చేతిలో సర్టిఫికేట్ లు పట్టుకుని, హైదరాబాద్ లో గౌరవంగా ఉద్యోగాలు చేసిన వారని అడిగితే చెప్తారు... గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళు, చంద్రబాబు పుణ్యమా అని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి, నెలకు నాలుగు అంకెల జీతం తీసుకున్న వాళ్ళు చెప్తారు, వారికి చంద్రబాబు ఏ విధమైన భవిషత్తు ఇచ్చారో... చంద్రబాబు ప్రోత్సాహంతో, అమెరికాలో ఉద్యోగాలు చేసిన వారు చెప్తారు... వాళ్ళకి ఆ విశ్వాసం ఇప్పటికీ ఉంది... దానికి ఉదాహరణే మొన్నటి చంద్రబాబు అమెరికా పర్యటన... అమెరికాలో, ఏ సిటీలో దిగినా, అక్కడ తెలుగువారు ఆయనకు ఆహ్వానం పలికిన తీరే నిదర్శనం.
హైటెక్ సిటీకి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటో, చంద్రబాబుకి సమ ఉజ్జీ అయిన, ఆయన ప్రత్యర్ధి రాజశేఖర్ రెడ్డి మాటల్లోనే తెలుస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఒకసారి హైటెక్ సిటీ ముందు నుంచి వెళుతూ మనం చంద్రబాబును ఎన్ని తిట్టినా ఇవన్నీ బాగా కట్టాడు అని సన్నిహితులకు చెప్పారు రాజశేఖర్ రెడ్డి. మరి ఇవాళ ఆయన అభిమానులం అని చెప్పుకు తిరిగుతూ, అధికారం కోసం, రాష్ట్ర వినాసకానికి కూడా వెనుకాడని సైకో లని ఏమి అనాలి ? 1998 లో కొండల్లో, గుట్టలో హైటెక్ సిటీ అని బిల్దింగ్స్ కడితే, ఎవడు వెల్తాడు అని ప్రతిపక్షాల హేళన, ఇప్పుడు తెలంగాణాకి 46,000 కోట్ల ఆదాయం ఒక్క హైటెక్ సిటీ నుండే వస్తుంది... e-seva పెడితే దాని వల్ల ప్రజలకి ఎమైనా ఉపయోగమా అని, బాబు పైన సేటైర్లు, జోకులు. రెండు రాష్ట్రాల్లో e-seva సేవ మీద 2 లక్షల మందికి ఉపాది, ఇంకా e-seva ఉపయోగం ఏంటో అందరికీ తెలుసు ఇప్పుడు. విమర్సలు తాత్కాలికం.... భవిష్యత్తు ముఖ్యం... అది చంద్రబాబు గారికి ఎవరూ చెప్పనవసరం లేదు... ఇన్ని మంచి పనులు చేస్తూ, వాటి ఫలాలు పొందుతూ, వారే ఆయన్ను విమర్శించటం, బహుశా ఈ ప్రపంచంలోనే ఇలాంటి వింత లేదేమో... మనం విచెక్షణ కోల్పోయి, మనకు కులం, మతం, ప్రాంతం ఎక్కువైనప్పుడు, మనల్ని అన్ని విధాలుగా పైకి తీసుకువచ్చిన వారే, శత్రువులుగా కనిపిస్తారు...
హైటెక్ సిటీ, ఐటి, రోడ్లు, ఫ్లైఓవర్లూ, రింగ్ రోడ్లూ, స్టేడియంలూ, స్పోర్ట్స్ విలేజ్ లూ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లూ, ప్రణాళికా బద్దంగా పెంచిన స్కూళ్ళూ, కాలేజీలూ, నేషనల్ గేమ్స్, టైం తప్పకుండా రైతులకు విద్యుత్తూ, హైద్రాబాద్ కు ఇరవై నాలుగ్గంటలూ నిరంతరాయ విద్యుత్తూ, విజన్ 2020, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టూ, ఎంఎంటిఎస్, తొలిసారి అత్యంత వైభవంగా పుష్కరాలూ, పట్టిసీమ, సుందరీకరించిన బీచ్ లూ, పరిశుభ్రమైన నగరాలూ, తాగు సాగు నీరూ, అమరావతి, నూతన సచివాలయ నిర్మాణం, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, విద్యుత్ ఆదా, అటవీ సంపద పరిరక్షణ, పరిశ్రమలూ, పెట్టుబడులూ, కొత్త ఒప్పందాలూ,ఇంకా ఎన్నెన్నో... అసలు రెండు రాష్ట్రాలకీ తలెత్తుకొని చూపించుకోగలిగిన రాజధానులు ఉన్నా... వస్తున్నా అది ఆయన పడ్డ కృషి, తపన ఫలితమే.... తెలుగు రాష్ట్రాలకి ఇందులో కనీసం మూడో వంతు పనిచేసిన వాడిని ఎవడినన్నా చూపించి అప్పుడు చంద్రబాబుని విమర్శించండి... మేము ఎదురు చెప్పం... చూపించలేకపోతే మాత్రం...మూసుకుని కూర్చోండి ప్లీజ్..
హైదరాబాద్ విశ్వనగరంగా చంద్రబాబు తయారు చేసిన సమయంలో లాగుల వేసుకి తెరిగిన బ్యాచ్ కి, ఇంకా కొంత మంది అమ్మ ఒడిలో పురిటి వాసన కూడా పోని పిల్ల కాకులకి, చంద్రబాబు బిల్ గేట్స్ ని బ్రతిమాలి మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చారని చెప్పినా, హైదరాబాద్ బిర్యానీ వాసనకొచ్చారని వాదిస్తారు.. ఇప్పటి లాగుల బ్యాచ్, రేపు అమరావతికి ఆవకాయ వాసన కోసం, నుజివీడు మామిడి పళ్ళ కోసం, ఉలవచారు కోసం, గుంటూరు మిర్చి కోసం, నెల్లూరు చేపల పులుసు కోసం, వచ్చారు అనే, వాదన తెస్తారేమో... హైదరాబాద్ విశ్వనగరంగా అవ్వటానికి మొదటి వ్యక్తి చంద్రబాబు.... హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే... దాన్ని ప్రారంభించింది చంద్రబాబే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధి చేసింది చంద్రబాబే... హైదరాబాద్ ని నెంబర్ 1 చేసింది చంద్రబాబే... ఇప్పుడు నవ్యాంధ్రను నెంబర్ 1 చేస్తుంది చంద్రబాబే.... రేపు అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరం చేసేది ముమ్మాటికి చంద్రబాబే... హైదరాబాద్ చరిత్ర, అమరావతి భవిష్యత్తు... ఇవన్నీ మీరు చేర్పిస్తే చెరిగిపోని గుర్తులు... ఫ్లై ఓవర్లు, నెక్లేస్ రోడ్డు, బుద్దుడి విగ్రహం, ట్యాంక్ బండ్ విగ్రహాలు, ఇండోర్ స్టేడియం, ఐమ్యాక్స్ లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ విలేజ్, హైటెక్ సిటీ, కాన్వెన్షన్ సెంటర్, శిల్పారామం ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఏదైనా, వీటిని చూసి మీ దగ్గరకు వస్తున్న ఎవరైనా... కళ్ళు మూసుకుని, మీ మనస్సాక్షిని అడగండి.... చంద్రబాబు అంటే ఏంటో తెలుస్తుంది... మా ముఖ్యమంత్రి కాట్టిన మోలిక వసతులతో వంద ఇంటర్నేషనల్ సమ్మిట్ లు చేసుకోండి.... కాని మా ముఖ్యమంత్రి మీద ఏడవకండి..... ఆయనే మా భవిష్యత్తు.... మా జీవితాలను బాగు చేసిన వాడిని, మేము గుండెల్లో గునపం పెట్టి గుచ్చం, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం...