రెక్కాడితేకానీ, డొక్కాడని నాయకపోడు కులస్తుల వాళ్ళు.... ఎన్నో ఏళ్ళుగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు... నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పుడో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిఓ ఇచ్చారు... అయితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని తొక్కి పట్టాయి... మళ్ళీ ఇన్నేళ్ళకు వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది... ఇన్నేళ్ళు నుంచి చేస్తున్న పోరాటం ఫలించింది... ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని కృషి దీని వెనుక చాలా ఉంది...
ఎందుకంటే ఈ నాయకపోడు కమ్యూనిటీ ఎక్కువగా కృష్ణా జిల్లా విస్సన్నపేట, ఏ. కొండూరు మండలం తిరువూరు నియోజకవర్గల్లో ఉన్నారు.. అందుకే కేశినేని నాని ఈ సమస్యకి ప్రాధాన్యత ఇచ్చారు... నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ కేశినేని నాని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది.... నాయకపోడు విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాన్ని గత పార్లమెంట్ సమావేశాలలో ఎంపీ నాని చర్చించడం జరిగింది....
ఈ సమస్య పై చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది... కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చుటకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాయకపోడు కమ్యూనిటీ విస్సన్నపేట, ఏ. కొండూరు మండలం తిరువూరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. నియోజకవర్గ ప్రజలు ఎంపీ కేశినేని నాని గారి కృషిని అభినందించడం జరిగింది. అలాగే ఇన్నాళ్లుకు తమ పోరాటాన్ని గుర్తించిన చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ నాయకపోడు కమ్యూనిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు...