ఫైల్స్ పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. 20 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు హైదరాబాద్ పొందుతున్న ఫలితాలు కళ్ళముందే ఉన్నాయని చెబుతూ, అంతకంటే ఉన్నత సంస్కరణలతో రాష్ట్రం దూసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి చేదోడువాదోడుగా నిలవాలని ప్రభుత్వ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పాలనలో తీసుకొస్తున్న సంస్కరణల ఫలాలు తక్షణం ప్రజలకు చేరాలని, దానికి ఉద్యోగుల సహకారం అత్యంత అవసరమని అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఐవోటీ, ఐటీ, ఫైబర్ నెట్, రియల్‌టైమ్ గవర్నెన్స్ తదితర అంశాలపై వివిధ శాఖాధికారులతో సమీక్ష జరిపారు.

command control 24112017 2

సమీక్షకు హాజరైన వివిధ శాఖల అధికారులకు సచివాలయం మొదటి భవనంలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను స్వయంగా చూపించి, సెంటర్ ఏ విధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. వచ్చే ఆదివారం ఈ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించపోతున్నట్టు ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇకపై రియల్ టైం గవర్నెన్స్‌లో కీలక భూమిక పోషించనుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ అత్యున్నత సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని తయారు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు సూచించారు. కేంద్రంతో మాట్లాడి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నామని, ఈ టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఫైబర్ గ్రిడ్, డ్రోన్ కార్పోరేషన్, టవర్ కార్పోరేషన్, వర్చువల్ క్లాస్ రూములు, కంటెంట్ కార్పొరేషన్ వంటి వాటినన్నింటినీ సమీకృతం చేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని తీరాలన్నారు.

1,23,000 సెట్ టాప్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, వారానికి పది వేల బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఫైబర్ నెట్ సీఈవో అహ్మద్ బాబు తెలపగా, ఈ వేగం సరిపోదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మన టీవీ సేవలను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. దీని నిర్వహణ బాధ్యతలు ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. అన్ని స్కూళ్ళకు ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందించే ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలోచనలు, ఆవిష్కరణలు అనుకున్నట్టుగా అమలు చేయగలిగితే అద్భుతాలు చేయవవచ్చునని చెప్పారు. ఇ- ప్రగతి ద్వారా ప్రతి శాఖను అనుసంధానం చేసి ప్రజలకు రియల్ టైములో సేవలు అందించాలని కోరారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతిరోజు ఉదయాన్నే రియల్ టైం గవర్నెన్స్ కోసం ఒక గంట సమయం వెచ్చిస్తున్నట్టు తెలిపారు.

సరిగ్గా 15 రోజుల క్రిందట కడప జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక ఛాలెంజ్ చేశారు.... "చంద్రబాబు, నీకు 15 రోజులు టైం ఇస్తున్నా, నాకు విదేశాల్లో ఒక్క రూపాయి ఉన్నట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా" అంటూ ఛాలెంజ్ విసిరారు జగన్... ఈ ఛాలెంజ్ , హరిశ్చంద్రుడు వారసుడు చేసినట్టు, లోటస్ పాండ్ భజన బృందాలు చెలరేగిపోయాయి... నిరూపించు బాబు, నిరూపించు, అంటూ హడావిడి చేశారు... కట్ చేస్తే, సరిగ్గా 15 రోజులు అయ్యాయి... ఈడీ (Enforcement Directorate) ఇచ్చిన జాబితాలో, నల్లధనంను తెల్లధనంగా మార్చుకోవటం కోసం నకిలీ కంపెనీలు సృష్టించిన వారి లిస్టు తీస్తే, దేశంలోనే టాప్ 10మందిలో, మన ప్రతిపక్ష నేతకు ప్లేస్ ఇచ్చింది Enforcement Directorate..

jagan 24112017 1

జగన్ మొత్తం 31 షెల్ కంపెనీలతో, రూ.368 కోట్లు మనీలాండరింగ్‌కి పాల్పడి, ఆ టాప్ 10 లిస్టులో పేరు సంపాదించుకున్నారు... ఈ టాప్ జాబితాలో కంపెనీలు ఉండగా, రాయకీయ నాయకుల్లో జగన్ ఉన్నారు... దక్షిణ భారత దేశంలో టాప్ 10 జాబితాలో జగన్ మాత్రమే ఉన్నారు... అలాగే, పెద్ద ఎత్తున విదేశాలకు తరలించిన వ్యక్తుల సమాచారాన్ని గతేడాది పనామా పేపర్లు, ఈ ఏడాది ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల బయటకు వచ్చిన ప్యారడైజ్ పేపర్లలో భారత్‌కు చెందిన 714 మంది పేర్లు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉంది.

jagan 24112017 2

తాజాగా లెక్కల్లో చూపని సంపాదనను అక్రమ మార్గాల ద్వారా చలామణిలోకి తీసుకొస్తూ, షెల్ కంపెనీలను నడుపుతోన్న వారి జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది. హవాలా ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో తరలించి తిరిగి పెట్టుబడుల రూపంలో వాటిని తెచ్చుకుంటున్న తొలి 12 సంస్థల జాబితాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారని ఈడీ తెలిపింది. డొల్ల కంపెనీలు పెట్టి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 10 లిస్టు లో జగన్ ఉన్నారు... మరి ఇంత స్పష్టంగా, ఈడీ, అంతర్జాతీయ నిఘా సంస్థలు జగన్ విదేశాల నుంచి మనీలాండరింగ్‌ చేశారు అని స్పష్టంగా చెప్తున్నాయి... మరి జగన్, ఛాలెంజ్ ఒప్పుకుంటారా ? చంద్రబాబు గారు మాట్లాడరు... చట్టం తనపని తాను చేసుకుపోతూంది... వాటి చర్యలు మాట్లాడుతాయి...

నంది అవార్డుల ముసుగులో, హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ, కులాల మధ్య గొడవలు పెట్టి, సైకిల్ అవార్డ్స్, కమ్మ అవార్డ్స్ అంటూ, హడావిడి చేసిన బినామీ బండ్లకు, ఇవాళ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్ట్ సైకిల్ అవార్డు ఇచ్చింది... చెల్లని చెక్కులు ఇస్తూ, సొంత సినిమా వాళ్ళనే మోసం చేస్తున్న బినామీ బండ్లకు కోర్ట్ జైలు శిక్షతో పాటు, జరిమానా కూడా విధించింది... సామాన్య క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి, పెద్ద హీరోలతో బడా సినిమాలు ఎలా తీస్తున్నాడో అర్ధం కాని వాళ్లకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది...

bandla 24112017 2

‘టెంపర్‌’ సినిమాకు సంబంధించి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వాసు ఫిర్యాదు చేయగా, శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి.... బండ్ల గణేష్‌కు ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు, రూ.15.86లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు... ఇలాంటి వారు కూడా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేంతటి వారు... వీళ్ళు మన రాష్ట్రం మీద రాళ్లు వేస్తూ ఉంటే, మనం మాత్రం వీళ్ళని ఏమి అనకూడదు....

bandla 24112017 3

ఏమన్నా అంటే, పోసాని లాంటి వాళ్ళు వచ్చి, మన అర్హతల గురించి ప్రశ్నిస్తారు... ఇలాంటి వారిని, మన జగన్ బ్యాచ్ సమర్ధిస్తుంది, ఎగదోస్తుంది... బొత్సా సత్యన్నారాయణ బినామీగా పేరు ఉన్న బండ్ల, ఒక రోజు ఆడియో ఫంక్షన్ లో, నేను మర్డర్ చేసినా, నన్ను బొత్సా వచ్చి రక్షిస్తారు అన్నాడు అంటే, ఏ స్థాయిలో ఇతగాడు ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు... ఇలాంటి 420 చీటింగ్ చేసే వాళ్ళు, మన దేశంలోనే విజనరీ రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుని నిందిస్తాడు... మనం చూస్తూ ఊరుకోవాలి... మన ఖర్మ కదా ఇది... ఇలాంటి వాడితో మాటలు పడటం...

ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తుంది... కేంద్రం మాత్రం సాంకేతిక కారణాలు చూపించి, ఫైల్ తిప్పి పంపింది... అయినా చంద్రబాబు, మళ్ళీ అవే పేర్లు కేంద్రానికి పంపించారు, రెండో సారి కూడా కేంద్రం తిప్పి పంపింది... దీంతో చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు... మా రాష్ట్రంలో అధికారిని నియమించటానికి కూడా ఇంత రాద్దాంతం చెయ్యలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాశారు... అయినా సరే, ఈ నెల 22న డిజిపి ఎంపిక కోసం జరగాల్సిన కమిటీ సమావేశం కూడా కేంద్రం వాయిదా వేసింది...

dgp 24112017 1

ఈ పరిణామాలు అన్నీ గమనించిన చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.... దీనికి సంబంధించి జిఓ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు... ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న సాంబశివరావు మరో నెల రోజుల్లో రిటైర్ అవనున్నారు... ఇప్పుడు పూర్తి స్థాయి డిజిపిగా నియమించటంతో, ఆయన పదవీ కాలాన్ని కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది... ఈ ఉత్తరువలకు సంబంధించి, కేంద్ర హోం శాఖతో మాట్లాడమని, చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రుల్ని పురమాయించారు... మరి కేంద్రం, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి... ఇక సాంబశివరావు గారి విషయానికి వస్తే, ఆయన సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరుంది...

dgp 24112017 3

గతేడాది జూలై నుంచి సాంబశివరావు ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్‌ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది...

Advertisements

Latest Articles

Most Read