మూడేళ్ళ నుంచి ప్రతి ఆంధ్రుడి ఆవేదన ఇది... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడు ఇన్నాళ్ళు నలిగి పోయారు... హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు వాగటం... హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రం మీద విషం చిమ్మటం.... లేకపోతే హైదరాబాద్ నుంచి పొద్దున్నే ఫ్లిట్ కి గన్నవరం దిగి, ఇక్కడ షో చేసి, సాయంత్రానికి హైదరాబాద్ చేక్కేయటం, సాయంత్రం 8 గంటలకు కొన్ని హైదరాబాద్ చానల్స్ పనికిమాలిన చర్చలు పెట్టి, తెలంగాణా వారిని ఆ చర్చల్లో కూర్చో పెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని తిట్టటం.. ఇది వరస... కాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని ఉపేక్షించారు... తెలంగాణా ముఖ్యమంత్రిలా, చానల్స్ బ్యాన్ చెయ్యలేదు... ఈ మెతక వైఖరి, చేతకాని తనంగా చేసుకుని రెచ్చిపోయింది హైదరాబాద్ మీడియా....

cbn 20112017 2

మన ఖర్మకు, అన్నీ ఈ చానల్స్ అవ్వటంతో, ఎంతో మనోవేదనతో, మనల్ని హైదరాబాద్ లో కూర్చుని తిట్టినా భరించాం... చంద్రబాబు ఇలా ఖటినంగా వ్యవహిరించే వారు కాదు, మనం చేసేది ఏమి లేదు అనుకున్నాం... కాని, నంది అవార్డులు పుణ్యమా అని, హైదరాబాద్ రోత చానల్స్, హైదరాబాద్ లో కూర్చున్న కొంత మంది మాఫియా, మన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ, హైదరాబాద్ లో ఉండే మరో రాజకీయ పార్టీ కలిసి, ఎంత రచ్చ చేసారో చూసాం.... చంద్రబాబుకి ఇక ఓర్పు నశించింది.... నిన్న, నంది అవార్డు రగడ పై స్పందిస్తూ, హైదరబాద్ లో కూర్చుని, మా రాష్ట్రం గురించి ఏ నాడు, ఏమి పట్టించుకోని మీరు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... దానికి కొనసాగింపుగా, ఇవాళ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు...

cbn 20112017 3

లోకేష్ మరింత ముందుకెళ్ళి, నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రా వాళ్ళు అంటూ, హైదరాబాద్ లో కూర్చుని మన రాష్ట్రము మీద విషం చిమ్ముతున్న వారిని అభివర్ణించారు...ఇక్కడ ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు లేని వారు హైదరాబాద్‌లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అంటూ కొందరు హైదరాబాద్‌ నుంచి ఉదయం విమానంలో విజయవాడకు వచ్చి ధర్నా చేసి మధ్యాహ్నం విమానానికి తిరిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు...ఇద్దరు ముగ్గురు మాత్రమే చేసే విమర్శలను ఒకటి రెండు ఛానెళ్లు ప్రధానంగా చూపించడం వల్లే అది పెరిగిందని అభిప్రాయపడ్డారు.... ఇలాంటి వైఖరే ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది... హైదరాబాద్ లో కూర్చుని, మా రాష్ట్ర ఆత్మాభిమానం దెబ్బ తింటుంటే చూస్తూ ఊరుకోము అంటూ, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, ప్రతి ఆంధ్రుడు సమర్ధిస్తారు... ఇలాంటి చానల్స్, సినీ మాఫియా, దొంగ రాజకీయ పార్టీలతో ఇదే వైఖరి కొనసాగించి, మా ఆత్మాభిమానం కాపడుతారని ఆశిస్తున్నాం...

ఒక పక్క ప్రతిపక్ష పార్టీ ఎమ్మల్యేలు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటుంటే, అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీలో పోషిస్తున్నారు... ఇవాళ అసెంబ్లీలో, గన్నవరం ఎమ్మల్యే వంశీ, పెనమలూరు ఎమ్మల్యే బోడె ప్రసాద్, ఒకింత కటువుగానే, ప్రభుత్వాన్ని నిలదీశారు... సమస్య తీవ్రత తెలుస్కున్న ప్రభుత్వం, వెంటనే స్పందించింది.... సంక్రాంతిలోపే మొదలు పెడతామని, సంబధిత మంత్రి హామీ ఇవ్వటంతో, నియోజకవర్గ ప్రజలు కూడా, సంతోషం వ్యక్తం చేస్తున్నారు... వివరాల్లోకి వెళ్తే...

vamsi 20112017 2

విజయవాడకు అతి దగ్గర్లో ఉన్న రామవరప్పాడు గ్రామ ప్రజలు వంతెన సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వంశీ లేవనెత్తారు... ఈ గ్రామంలో ఇప్పుడు 30వేల జనాభా ఉందని వంతెన సరిగ్గా లేకపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రూ. 6 కోట్లకు వంతెనను ప్రతిపాదన చేశారని వంశీ తెలిపారు.

vamsi 20112017 3

అయితే అధికారులు మాత్రం పట్టించుకోకుండా సాగదీస్తున్నారు అని, ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే ఎస్టిమేట్ పెంచాలి, రివైన్ చేయాలని చెబుతున్నారు. అయితే పక్క నియోజకవర్గాల్లో ఇలా వంతెనలు నిర్మించాల్సి వస్తే వీటినేం పట్టించుకోకుండానే నిర్మించేశారని వంశీ చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ, సంక్రాంతి పండుగ లేపు విజయవాడ దగ్గర్లోని రామవరప్పాడు గ్రామానికి వెళ్లే వంతెనకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు... అలాగే బోడె ప్రసాద్‌‌ లేవనెత్తిన వంతెన నిర్మాణం కూడా అదే సమయంలో చేపడతామని చెప్పారు.. డిసెంబర్‌‌లో టెండర్లు పూర్తి చేసి జనవరిలో శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణాలను సర్కార్ చాలెంజ్‌‌గా తీసుకుని జూన్ లోపే నిర్మాణం పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు....

దేశంలోనే మొదటిసారిగా, "సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ " నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. విజయవాడ వేదికగా రెండు రోజులు కార్యక్రమం జరగింది. గూగుల్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా, యూట్యూబ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. నిన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో, ఇవాళ సిద్ధర్దా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది... ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇండియా హెడ్ సత్య రాఘవన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి అఖిల ప్రియ హాజరయ్యారు..

social media events 19112017 2

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే, హీరో రానా దగ్గుబాటి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తదితరులుకు అవార్డు లు లభించాయి...సోషల్ మీడియాలో వివిధ దశల్లో సమాజానికి ఉపయోగపడే పలు అంశాలపై స్పందించిన వారికి కూడా అవార్డులు దక్కాయి... అలాగే దాదాపు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం దాదాపు 30 అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది.. నిన్న జరిగిన చర్చల్లో, సోషల్ మీడియా పాత్ర, సామాజికంగా ప్రజలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, విబ్రూ మీడియా సిఈవో అశోక్ విద్యాసాగర్, యూట్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్య ప్రతినిధి సత్య రాఘవన్, ఫేస్‌బుక్ మీడియా రీజనల్ పార్టనర్ ప్రతినిధి అంకూర్ మెహతా, ట్విటర్ ఆసియా ఫసిఫిక్ క్రీడా భాగస్వామి ప్రతినిధి అనీష్ మధాని వారి అభిప్రాయాలు చెప్పారు..

social media events 19112017 3

ఈ అవార్డులు వెనుక ప్రధాన ఉద్దేశం, అమరావతికి మరింత ప్రచారం కల్పించటం, ఆంధ్రప్రదేశ్ లో టూరిజంను ప్రోత్సహించడం - స్టార్ల సందడితో సినీ పరిశ్రమ చూపును నవ్యాంధ్రప్రదేశ్ వైపు పడేలా చేయడం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి ఎందరో టాలీవుడ్ - కోలివుడ్ - బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానుండటంతో, నేషనల్ మీడియా ఫోకస్ కూడా అమరావతి మీద ఉంటుంది అని, తద్వారా అమరావతికి మరింత బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని, మన అమరావతి గురించి అందరూ మాట్లాడుకుంటారని ప్రభుత్వం ఉద్దేశం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే హైదరాబాద్ లో కూర్చునే ప్రతి ఒక్కడికే అలుసే.. చంద్రబాబు మంచితనాన్ని, హుందా తనాన్ని, చేతకాని తనంగా తీసుకుని, ఇష్టం వచ్చినట్టు వాగాతమే ఆ హైదరబాద్ బ్యాచ్ చేసే పని... నంది అవార్డుల విషయంలో అది పరాకాష్టకు చేరింది... ఈ సినిమా వాళ్ళ గోలకు తోడు, హైదరబాద్ మీడియా చానల్స్ కూడా రెచ్చిపోయాయి... సినిమా అవార్డులకి కులం ఆపాదించి, హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ లో అభిమానుల మధ్య కులం చిచ్చు పెట్టే ప్రయత్నం చేసాయి... ఏ నాడు ఆంధ్రప్రదేశ్ వంక కన్నెత్తి చూడని, బజారు గాళ్ళు కూడా, చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో కూర్చుని వాగారు... సహనం నశిస్తే ఏమి అవుతుందో, ఇవాళ ప్రభుత్వ స్పందన చుస్తే అర్ధమవుతుంది...

award 19112017 2

నంది అవార్డుల వివాదం పై, కొంత మంది ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్‌ సీరియస్‌ అయింది. ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మూడేళ్ల అవార్డులు ప్రకటించినా వివాదం చెలరేగడం పై ప్రభుత్వ పెద్దలు మనస్థాపం చెందారు. కళాకారులను గౌరవించాలన్న సదుద్దేశాన్ని అర్ధం చేసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసమే అవార్డుల ప్రకటన అన్నారు.

award 19112017 3

అవార్డు గ్రహీతలెవరూ ప్రస్తుతం ఏపీకి చెందినవారు కాదని. దాదాపు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారేనని, వీరిలోఎవరికీ కనీసం ఏపీలో ఓటు హక్కు కూడా లేదని చెప్పారు. కేవలం తెలుగు సినిమా అన్న కారణంగానే అందరికీ అవార్డులు ఇచ్చామని అన్నారు. బాలీవుడ్‌ సినిమాలు ఏపీలో రిలీజ్‌ అవుతున్నా అవార్డులు ఇవ్వడం లేదు కదా అని ప్రశ్నించారు. లేని దురుద్దేశాలు అంటగడుతూ, హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు వేస్తే, అవార్డుల రద్దుకైనా వెనుకాడబోమని ప్రభుత్వం హెచ్చరించింది..

Advertisements

Latest Articles

Most Read