మూడేళ్ళ నుంచి ప్రతి ఆంధ్రుడి ఆవేదన ఇది... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడు ఇన్నాళ్ళు నలిగి పోయారు... హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు వాగటం... హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రం మీద విషం చిమ్మటం.... లేకపోతే హైదరాబాద్ నుంచి పొద్దున్నే ఫ్లిట్ కి గన్నవరం దిగి, ఇక్కడ షో చేసి, సాయంత్రానికి హైదరాబాద్ చేక్కేయటం, సాయంత్రం 8 గంటలకు కొన్ని హైదరాబాద్ చానల్స్ పనికిమాలిన చర్చలు పెట్టి, తెలంగాణా వారిని ఆ చర్చల్లో కూర్చో పెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని తిట్టటం.. ఇది వరస... కాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని ఉపేక్షించారు... తెలంగాణా ముఖ్యమంత్రిలా, చానల్స్ బ్యాన్ చెయ్యలేదు... ఈ మెతక వైఖరి, చేతకాని తనంగా చేసుకుని రెచ్చిపోయింది హైదరాబాద్ మీడియా....
మన ఖర్మకు, అన్నీ ఈ చానల్స్ అవ్వటంతో, ఎంతో మనోవేదనతో, మనల్ని హైదరాబాద్ లో కూర్చుని తిట్టినా భరించాం... చంద్రబాబు ఇలా ఖటినంగా వ్యవహిరించే వారు కాదు, మనం చేసేది ఏమి లేదు అనుకున్నాం... కాని, నంది అవార్డులు పుణ్యమా అని, హైదరాబాద్ రోత చానల్స్, హైదరాబాద్ లో కూర్చున్న కొంత మంది మాఫియా, మన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ, హైదరాబాద్ లో ఉండే మరో రాజకీయ పార్టీ కలిసి, ఎంత రచ్చ చేసారో చూసాం.... చంద్రబాబుకి ఇక ఓర్పు నశించింది.... నిన్న, నంది అవార్డు రగడ పై స్పందిస్తూ, హైదరబాద్ లో కూర్చుని, మా రాష్ట్రం గురించి ఏ నాడు, ఏమి పట్టించుకోని మీరు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... దానికి కొనసాగింపుగా, ఇవాళ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు...
లోకేష్ మరింత ముందుకెళ్ళి, నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్ళు అంటూ, హైదరాబాద్ లో కూర్చుని మన రాష్ట్రము మీద విషం చిమ్ముతున్న వారిని అభివర్ణించారు...ఇక్కడ ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేని వారు హైదరాబాద్లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అంటూ కొందరు హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో విజయవాడకు వచ్చి ధర్నా చేసి మధ్యాహ్నం విమానానికి తిరిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు...ఇద్దరు ముగ్గురు మాత్రమే చేసే విమర్శలను ఒకటి రెండు ఛానెళ్లు ప్రధానంగా చూపించడం వల్లే అది పెరిగిందని అభిప్రాయపడ్డారు.... ఇలాంటి వైఖరే ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది... హైదరాబాద్ లో కూర్చుని, మా రాష్ట్ర ఆత్మాభిమానం దెబ్బ తింటుంటే చూస్తూ ఊరుకోము అంటూ, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, ప్రతి ఆంధ్రుడు సమర్ధిస్తారు... ఇలాంటి చానల్స్, సినీ మాఫియా, దొంగ రాజకీయ పార్టీలతో ఇదే వైఖరి కొనసాగించి, మా ఆత్మాభిమానం కాపడుతారని ఆశిస్తున్నాం...