కడప నుంచి చెన్నైకి విమానం మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది. టర్బో మేఘా అయిర్ వేస్ కు చెందిన, ట్రూజెట్‌ సర్వీస్ మొదటిసారిగా, కడప నుంచి చెన్నైకు నడిపింది... శుక్రవారం కడప విమానాశ్రయం డైరెక్టర్‌ పి.శివప్రసాద్‌రెడ్డి విమాన ప్రయాణికులకు టిక్కెట్లు అందజేశారు... విమాన సామర్థ్యం 72 మంది ప్రయాణికులు కాగా 68 మంది ప్రయాణికులు తొలిరోజు చెన్నైకి టికెట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ట్రూజెట్‌ విమానం ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం చెన్నైకు నడిచే ట్రూజెట్‌ విమానం మైసూరు వరకు వెళుతుందని తెలిపారు.

kadapa 19112017 2

మైసూరు నుంచి చెన్నైకు అక్కడి నుంచి కడప వస్తుందన్నారు. కడప ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. త్వరలోనే విజయవాడకు కూడా విమానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. టర్బో మేఘా అయిర్ వేస్ కు చెందిన, ట్రూజెట్‌, కడప నుంచి చెన్నై కు, టికెట్ ధర అన్నీ కలిపి రూ.699 గా ఉంది... అదే రోజు, ట్రూ జెట్, నాందేడ్ ముంబాయి మధ్య కూడా అదే రోజు విమాన సర్వీస్ ను ప్రరంభించిని.. దీంతో మధ్య, దక్షిణ భారత దేశంలో 12 గమ్య స్థానాలకు, ట్రూజెట్‌ సర్వీస్ లు నడుపుతుంది...

kadapa 19112017 3

త్వరలోనే కడప నుంచి, విజయవాడకు కూడా విమానాన్ని అందుబాటులోకి తెస్తామని ట్రూ జెట్ తెలిపింది. ఈ సర్వీస్ ప్రారంభంలో ఎస్పీఎఫ్‌ ఇన్‌ఛార్జి అశోక్‌రెడ్డి, విమానాశ్రయం టెర్మినల్‌ మేనేజరు కేపీ.ప్రకాశన్‌, కడప ట్రూజెట్ మేనేజరు భవ్యన్‌కుమార్‌ తదితరులు పాల్నొన్నారు. మొదటి సారి, కడప నుంచి చెన్నై వెళ్తున్న కడప ప్రజలు సంతోషించారు... అలాగే, కడప నుంచి విమానాశ్రయానికి రావాలంటే ఇబ్బందిగా ఉందని, కడప టౌన్‌ నుంచి ఆటోలుగాని, సిటీ బస్సులుగాని విమానాశ్రయానికి లేవని, అధికారులు గమనించి టౌన్‌ బస్సులు నడిపితే బాగుంటుందని ప్రయాణికులు చెప్పారు.

37 కొరియా కంపెనీలు సుమారు రూ. 4 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి తరలిరానున్నాయి. వీటి ద్వారా 7 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వీటిల్లో అత్యధికం ఆటోమొబైల్ రంగానికి చెందినవి. వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి కార్యరూపం దాల్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే కొరియన్ సిటీలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశంలోని పలు కంపెనీలు సిద్ధంగా వున్నాయని దక్షిణ కొరియా కౌన్సిల్ జనరల్ కిమ్ హంగ్ టే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు.

korea 19112017 2

శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కిమ్ హంగ్ టే మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక వృద్ధిరేటు, స్నేహపూర్వక వాతావరణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వంటి అంశాలు తమను ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయని కిమ్ హంగ్ టే ఈ సందర్భంగా చెప్పారు. ఏపీతో ఆర్ధిక సంబంధాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తమదేశం భావిస్తోందని తెలిపారు. ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్స్, చీరలు ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

korea 19112017 3

అనంతపురం జిల్లాలో త్వరలో ఏర్పాటుచేసే ‘కొరియన్ సిటీ’ అంశంపైనా ఇరువురు చర్చించారు. విజ్ఞాన సముపార్జనలో భాగంగా ఇరుప్రాంతాల విద్యార్ధుల పరస్పర మార్పిడికి ఒక ప్రణాళిక రూపొందించాల్సి వుందని అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ‘కొరియన్ సిటీ’ నిర్మాణానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం సృష్టించామన్న ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం పరిష్కరిస్తామని చెప్పారు. దక్షిణ కొరియా నుంచి తరలివచ్చే కంపెనీల కోసం ఏపీఈడీబీ, ఇంకా తమ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిస్తున్నాయని అన్నారు. కొరియా లాంగ్వేజ్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని కిమ్ హంగ్ టే ముఖ్యమంత్రిని కోరారు. మన రాష్ట్రంలోని యువతను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియాకు చెందిన కోచ్‌లతో శిక్షణ అందిస్తామని అన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక జట్ స్పీడుగా సాగనుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు నిర్మాణాలపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్జీటి ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన వెంటనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. రాయపూడి- లింగాయపాలెంల మధ్య, ఎన్‌-10 రహదారిని కృష్ణానదికి అవతలి వైపున ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ నిర్మించదలచిన ఈ బ్రిడ్జికి రూ.1434.26 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.

amaravati 19112017 2

6 వరుసలతో, 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మితమయ్యే ఈ వంతెనకు సంబంధించిన సర్వే పనుల నుంచి డిజైన్‌ రూపకల్పన, నిర్మాణం వరకూ టెండర్లు పొందిన సంస్థే బాధ్యత తీసుకోవాలి. ‘ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌)’ విధానంలో నిర్మించే ఈ వంతెన పూర్తయిన తర్వాత 10 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 18వ తేదీ వరకూ గడువునిచ్చారు.

amaravati 19112017 3

మరో పక్క అమరావతికి, హడ్కో ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పటికే రుణం మంజూరు కావడంతో పనుల వేగం పెంచాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం పర్యావరణానికి హాని చేస్తోందంటూ వస్తున్న విమర్శలకు ఎన్జీటీ పూర్తిగా చెక్ పెట్టినట్లు అయింది. కొండవీటి వాగును బూచిగా చూపే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది. గ్రీన్ ట్రిబ్యుల్ తీర్పు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచింది.

జగన్ ఈ క్షణాన ఎవర్నిన్నా నమ్ముతున్నాడు అంటే, అది అరువు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ని... ప్రశాంత్ కిషోర్ తిమ్మిని బొమ్మని చేసి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాంత్రికుడిగా పేరు... ముఖ్యంగా సోషల్ మీడియాలో, పేకే బ్యాచ్ చేసే రచ్చ ఇంతా అంతా కాదు... ఇదే పని లోటస్ పాండ్ లో, జగన్ కిరాయి బ్యాచ్ చేస్తున్నా, జగన్ మాత్రం, పేకే బ్యాచ్ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు... పేకే ఆంధ్రప్రదేశ్ వచ్చిన కొత్తలో, ఈ ఫేక్ ఎకౌంట్లతో హడావిడి చేసి దొరికిపోయాడు... అస్సాం, బీహర్, జమ్మూ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు, మన రాష్ట్రం గురించి తెలుగులో పోస్ట్లు పెడుతూ, దొరికిపోయారు...

bharati 19112017 2

తరువాత, చాలా జాగ్రత్తగా ఆ ఎకౌంట్లు పేర్లు మార్చేశారు... తెలుగు పేర్లు పెట్టుకుని, హడావిడి చేస్తున్నారు... ఈ క్రమంలో, జగన్ ఫ్యామిలీ పేరుతో కూడా ఎకౌంటులు ఓపెన్ చేపెంచి, ఎప్పటికప్పుడు చంద్రబాబు మీద దుమ్మెత్తి పోస్టు ఉంటారు... సహజంగా ఆడవారు పోస్ట్ చేస్తే సింపతీ ఎక్కువ వస్తుంది అని, పీకే ఆలోచన... అయితే శనివారం, జగన్ భార్య వైఎస్ భారతి ట్విట్టర్ ఎకౌంటు లో, జగన్ పచ్చిని పొలాల మధ్య నీళ్ళు తాగుతున్న ఫోటో పోస్ట్ చేశారు... ఇది కూడా భారతి పేరున, పీకే బ్యాచ్ నడుపుతున్న ఎకౌంటు... అయితే, ఇది రివర్స్ అయ్యి, తెలుగుదేశం ఈ ఫోటో అనుకూలంగా మార్చుకుని, పచ్చని పొలాలు, నీరు చూస్తుంటే, మా ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తుందో అర్ధమవుతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు.... 

bharati 19112017 3

ఇది ఒక పక్క ఇబ్బందిగా ఉండగా, ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం బయటకు వచ్చింది.. అసలు ఆ ఫోటో జగన్ ఫోటో కాదు, ఎవరో జగన్ అభిమాని ఫోటో... ఈ విషయం బయటకి రావటంతో, కనీసం భర్తని కూడా వైఎస్ భారతి పోల్చుకోలేదా అంటూ కౌంటర్ లు మొదలయ్యాయి... ఈ విషయం వైఎస్ భారతి దాకా వెళ్ళటంతో, ఆమె ప్రశాంత్ కిషోర్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు... మీ ఫేక్ వేషాలతో, నా పరువు తీసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇదే విషయం జగన్ కు కూడా ఫిర్యాదు చేశారు... ఇది తీవ్రమైన పరిణామం అని, ఎవరో ఫోటో పోస్ట్ చేసి, జగన్ ని చెప్పి, నా పరువు తీసారు అని, జగన్ దగ్గర పీకే టీం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరి జగన్ ఏమి చేస్తారో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read