తండ్రిలా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు... మరి పిల్లలకి హాని చేస్తే ఊరుకుంటారా ? ఊరి కాని ఊరిలో చదవుకుంటానికి వెళ్ళిన పిల్లలను ఇబ్బంది పెడితే, వెంటనే రంగంలోకి దిగారు... మీకు నేనున్నా అంటూ, మన పిల్లకి భారోసా ఇచ్చారు... మణిపూర్‌ రాష్ట్రంలోని ఎన్‌ఐటీలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థులు దాడులు జరిగాయి. స్థానిక విద్యార్థులు రౌడీలతో దాడులు చేయంచడంతో పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

cbn phone 08112017 2

కాలేజీలో లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయంలో విద్యార్థుల మద్య గొడవ జరిగింది. దీంతో మణిపూర్ ఎన్ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో తెలుగు విద్యార్థులంతా ఒకే గదిలో తలదాచుకున్నట్లుగా సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. స్వయంగా మణిపూర్ రాష్ట్ర డీజీపీ షాహీద్ క్యాంపస్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

cbn phone 08112017 3

మరోవైపు, ఈ గొడవ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది... దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, మణిపూర్ సీఎం బైరన్ సింగ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఎన్ఐ‌టీ‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఎన్ఐటీకి స్పెషల్ సీఎస్, అదనపు పోలీస్ బలగాలను పంపిస్తున్నామని చంద్రబాబుతో బైరన్ సింగ్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మణిపూర్‌ ఎన్‌ఐటీలో తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

నవ్యాంధ్ర జీవనాడి మీద కేంద్రానికి కన్ను పడింది.... దాన్ని ఎలా అయినా ఆపాలి అనే ఉద్దేశంతో ముందు నుంచి, పిర్ర గిల్లి, జోల పాడుతూ వస్తున్న కేంద్రం, ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగి, ఏకంగా పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం నిర్మాణం ఆపెయ్యమంది... ఈ కాఫర్ డ్యాం నిర్మించడం అవసరమా లేదా అన్నది తేల్చాలని, ఇందుకు ఓ కమిటీ వేస్తామని చెప్పెంది... ఆ కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధ్యనయం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కాఫర్ డ్యాం పై నిర్ణయం చెప్తాం అని చెప్పింది.. అంటే, ఇక ఇప్పట్లో అది జరిగే పని కాదు.... కాఫర్ డ్యాం నిర్మిస్తేనే 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వటం కుదురుతుంది... అందుకే, ఈ కాఫర్ డ్యాం నిర్మాణం లేట్ చేస్తే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అని, రాజకీయ నిర్ణయం తప్ప, ఈ నిర్ణయం దేనికీ పనికిరాదు...

polavaram 08112017 2

కాఫర్ డ్యాం కట్టటానికి ప్రధాన కారణం, ఏదైనా ప్రాజెక్టులో మెయిన్ డ్యాం నిర్మాణానికి ముందే ఎగువన, దిగువన కాఫర్ డ్యాంలు నిర్మిస్తారు. వరద నీటిని వాటి ద్వారా మళ్లించి పనులు సులభంగా, త్వరగా అయ్యేలా చేస్తారు. ఇది పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ కు చాలా అవసరం... కాఫర్‌ డ్యాం ఎత్తును 42 మీటర్లకు పెంచుకుంటే 2018 జూన్‌ తర్వాత నీళ్లు కాలువలకు వదిలిపెట్టి, ప్రధాన డ్యాం నిర్మాణం చెయ్యవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన.. ఆ మేరకు ప్రతిపాదనలు, చర్చలు, కేంద్ర జలసంఘం పరిశీలనకు వెళ్లాయి. కేంద్ర జలసంఘం కాఫర్‌ డ్యాం ఎత్తు మీ ఇష్టం అని కూడా చెప్పింది.. కాని ఇప్పుడు మళ్ళీ, ఈ ప్రాజెక్టుకు కాఫర్ డ్యాం అవసరమే లేదు.. దానికి ప్రత్యామ్నాయంగా కూడా పనులు చేయవచ్చు.. నిపుణులను పంపి అధ్యయనం చేసి తర్వాత ఆలోచిద్దాం.. అప్పటిదాకా పనులు ఆపేయండి అంటూ కేంద్రం ఆదేశించింది....

polavaram 08112017 3

ఇది నయవంచన అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు... దీనిని పూర్తి చేయాలనే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతగా ఉన్నప్పటికీ కేంద్రం వేసిన బ్రేకుల నేపథ్యంలో పని జరిగేదెలాగ అంటూ ప్రశ్నిస్తున్నాయి... చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి అని చూస్తుంటే, ఆదుకోవల్సింది పోయి, రాజకీయ నిర్ణయాల కోసం, రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని అంటున్నారు... ఒక పక్క తెలంగాణా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు ఇస్తూ, పోలవరం విషయంలో, ప్రతి సందర్భంలో కొర్రీలు పెడుతున్నారని అంటున్నారు... అమరావతి భూ సేకరణ బిల్లు కూడా ఇలాగే ఆపేసారని, తెలంగాణా, గుజరాత్ బిల్లులు ఒకే చేసారని అంటున్నారు..... చంద్రబాబు ఓర్పుని పరీక్షిస్తే, అసలుకే మోసం వస్తుంది అనే విషయం కేంద్రం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది... ఇప్పటికే నోట్లు రద్దు అని, GST అని ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్న కేంద్రం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది... చంద్రబాబు లాంటి మిత్ర పక్షం, ధిక్కార ధోరణి చూపిస్తే, రాజకీయంగా బీజేపికి అనేక ఇబ్బందులు మొదలవుతాయి... ఇప్పటి వరకు, రాజకీయంగా రాష్ట్రంలో బీజేపి నాయకులు ఎన్ని పిచ్చి వాగుళ్ళు వాగినా, చంద్రబాబు సంయమనం పాటిస్తూ ఉండమన్నారు... మిత్ర ధర్మం పాటిస్తూ వచ్చారు... ఆయన ఆశయమే పోలవరం, అమరావతి... వీటికి కొర్రీలు పెడుతూ, ఆయన సహనాన్ని పరీక్ష పెడుతున్న బీజేపి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంటో తెలుసుకుని నడుస్తుంది అని ఆశిద్దాం...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ పాదయాత్రలో, ప్రతి రోజు ప్రారంభానికి ముందు, స్థానికులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలు వినటం అనేది కాన్సెప్ట్... కాని, జగన్ ని రంజింప చెయ్యాలి కాబాట్టి, కాన్సెప్ట్ లో ప్రజల సమస్యలు కంటే, చంద్రబాబుని తిట్టటం అనేది హై లైట్ అవ్వాలి అని ప్రోగ్రాం ట్యూన్ చేశారు... మరి చంద్రబాబుని తిట్టాలి అంటే, ఆ సమస్యలు ఉన్నావాళ్ళని వెతికి పట్టుకోవాలి... అది జరిగే పని కాదు కాబట్టి, స్థానికంగా ప్రశాంత్ కిషోర్ టీం లోకల్ నాయకులకి కాన్సెప్ట్ చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది... వారు, జగన్ రాగానే మాట్లాడాలి... ఇలా ప్లాన్ చేసారు.. కాకపొతే, ఇవాళ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది... ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదో, ఆ అమ్మాయి సరిగ్గా స్క్రిప్ట్ ఫాలో అవ్వలేదో కాని, మొత్తానికి స్క్రిప్ట్ ఫెయిల్ అయ్యింది...

padayatra 07112017 2

రైతుల సమస్యల మీద, ఒక 16 సంవత్సరాల ఉన్న పాప లెగిసి మాట్లాడింది... అదేంటి రైతుల సమస్యలు మీద ఈ పాప ఏమి మాట్లాడుతుంది అనుకున్నారు అందరూ... పాపం రైతులు దొరక్క, ఈ పాపకి ట్రైనింగ్ ఇచ్చారు... ఈ పాప సరే, జగన్ గారి పాండిత్యం కూడా క్రింద వీడియోలో చూడండి.. ఇది వారి కామెడీ సంబాషణ... పాప: చంద్రబాబు రైతులకి 7 గంటలు కరెంట్ ఇస్తున్నాడు...మరి మీరు అధికారంలొకి వస్తే 9 గంటలు కరెంట్ ఇస్తారా ?... జగన్: దేనికి ?... (ఈయనగారికి 9 గంటల కరెంట్ ఇళ్ళకు ఆడుగుతారో, పొలాలకి అడుగుతారో కూడా తెలీదు).. పాప : పొలానికి... జగన్: మికు పొలాలు ఉన్నయా ? (ఉండబట్టేగా అడిగేది).. పాప: ఉన్నాయి... జగన్: ఎక్కడ ? (పొలాలు ఎక్కడ ఉంటాయి ?).. పాప: ఏట్లో ఉన్నాయి... (JAGAN ROCKS.... JANAM SHOCKS)...

padayatra 07112017 3

పొలాలు ఎక్కడ ఉంటాయో కుడ తెలియని వాళ్ళతో అబద్దాలు చెప్పించి, పబ్బం గడుపుకుంటున్నారు.. నిజానికి ఇది జగన్ బ్యాచ్ కి ముందు నుంచి అలవాటు... ఇది వరకు కూడా కాలేజీల్లో, యువత చేత ఇలాగే మాట్లాడిస్తూ, చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి... ఇలాంటి నీచమైన రాజకీయంతో, ప్రజల మనస్సులు ఎలా గెలవగలరు అనుకుంటున్నారో, ఏంటో ? ప్రజా సమస్యలు మీద చర్చలు జరగాలి, ప్రతిపక్ష నేతగా అవి ప్రభుత్వంతో పోరాడి సాధించాలి, అప్పుడు నీకు నాలుగు ఓట్లు పడతాయి...అప్పుడు నీ పాదయత్రకి సార్ధకత ఉంటుంది... అంతే కాని, ఎంత సేపు మా నాన్న, నేను గొప్పవాళ్ళం అని చెప్పుకోవటం, చెప్పించుకోవటం... చంద్రబాబుని అమ్మనా బూతులు తిట్టటం, తట్టించుకోవటం.. ఇది వరస.... ఈ పైడ్ ఆర్టిస్ట్ లతో, ఇంకో ఆరు నెలలు ఈ ఎంటర్టైన్మెంట్ తో అలరించనున్నారు, మన ప్రతిపక్ష నేత....

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న సేవలను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, లోక్ సభ స్పీకర్ శ్రీ శిరుమీన్ చౌదరి కోనియాడారు. బంగ్లాదేశ్ రాజధాని డాకాలో ఈ నెల 5నుండి 7వరకూ మూడురోజుల పాటు జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో బంగ్లా ప్రధాని, బంగ్లా లోక్ సభ స్పీకర్, భారతదేశ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తో కలసి వేదిక పంచుకున్నారు. 

bangaladesh 07112017 2

ఈ వేదికపై స్పీకర్ కోడెల మాట్లాడుతూ భారతదేశం లో మోడీ నాయకత్వంలో స్వచ్చభారత్, సీఎం చంద్రబాబు సూచనలకు అణుగుణంగా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, వెనుకబడిన గ్రామాల్లో మౌలికవసతుల కల్పను, విధివిధానాలను, ప్రత్యేకంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది.

bangaladesh 07112017 3

స్పీకర్ కోడెల స్పీచ్ విన్న బంగ్లా ప్రధాని, స్పీకర్ భారతదేశంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో , సత్తెనపల్లి నరసరావుపేట ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధివిధానాలు బంగ్లాదేశ్ లో కూడా అమలుచేయడానికి ప్రయత్నిస్తామని... ఆ విధివిధానాలు తమకు అందించాలని కోరారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అక్కడకు వచ్చిన ప్రతినిధులు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభినందించారు.

Advertisements

Latest Articles

Most Read