అసైన్డ్ భూముల చట్టం... దశాబ్దాలుగా రాష్ట్రంలోని పేదలకు, ముఖ్యంగా దళితులకు వారి జీవితాలకు అండగా నిల్చిన చుట్టం! పెద్దలు, గద్దలు, బలవంతులు నయానో భయనో కొట్టుకుపోకుండా కాపాడిన చట్టం.. అలాంటి బలమైన రక్షణ దడిని.... ఇడుపుల పాయలో తాను చేసిన పాపం పండకుండా ఉండేందుకు తనకు శిక్షపడకుండా తప్పించుకునేందుకు తనలాంటి పెద్దలకూ, గద్దలకూ ఇకమీదటెలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు... ఒక్క కలం పోటుతో కుమ్మేసిన ఘనత మహానేత అని పిలుచుకునే వైఎస్ఆర్ ది! దళితుల క్షేమం మావల్లే... జగన్ మళ్లీ తెస్తానంటున్న రాజన్న రాజ్యం లో దళితులకు జరిగిన అన్యాయం చూతము రారండీ! పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకోవటం కోసం అత్యంత పటిష్ఠమైన అసైన్డు భూముల చట్టానికి వైఎస్ సర్కారు తూట్లు పొడిచింది. చట్టానికి సవరణలను తేవటాన్ని హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకున్నా, వైఎస్ సర్కారు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. సవరణ చట్టాన్ని పెద్దలకు ఒక ఆయుధంగా పనికొచ్చేలా చేసి దాని ద్వారా విలువైన భూములన్నీ వారి పరం అయ్యేలా పావులు కదిపింది. అసైన్డు భూములను లాక్కోవటానికి ప్రాంతాలను నోటిఫై చేసి మరీ పేదల పొట్టకొట్టింది.
అసైన్డు భూముల చట్టానికి సవరణలు తేవటానికి ముందు సాక్షాత్తూ వైఎస్, ఆయన కుటుంబ సభ్యుల అధీనంలోనే ఇడుపులపాయలో భారీగా అసైన్డు భూములుండేవి. ఈ విషయం బయట పడటంతో వాటిని తిరిగి ఇచ్చేస్తున్నట్టుగాను, వాటి తొలి లబ్ధిదారులు ఎవరో తెలియదు కనుక భూములను విద్యా సంస్థలకు అప్పగిస్తున్నట్లు అప్పట్లో వైఎస్ ప్రకటించారు. చట్టం ప్రకారమైతే పేదల భూములను ఇంతకాలం అనుభవించినందుకు వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు శిక్షార్హులు. కానీ... ఆ భూములు ఎప్పుడో తమ కుటుంబ సభ్యుల పేర రిజిస్టరై ఉన్నాయిగనుక... ఆ తప్పు రిజిస్ట్రేషన్ అధికారులదేగాని తమది కాదంటూ వైఎస్ సమర్థించుకున్నారు. తర్వాత అసైన్డ్ భూముల చట్ట సవరణ చేశారు. ఇడుపులపాయ భూములను అప్పగిస్తున్న సమయంలోనే ఎవరి వద్దనైనా అసైన్డ్ భూములున్నట్లెతే 90 రోజుల్లో ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ వైఎస్ ప్రకటించి అదే విషయాన్ని చట్ట సవరణలో చేర్చారు కూడా! అలా చట్ట సవరణతో వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు శిక్ష నుంచి బయటపడగలిగారు.
అంతే కాదు, తన సొంత స్థలం అయిన ఇడుపులపాయ ఎస్టేట్ కోసం వైఎస్ ఎన్నో అడ్డగోలు జీఓలు ఇచ్చి, ఇడుపులపాయ ఎస్టేట్ తను సేద తీరటానికి ప్రభుత్వ డబ్బులు తగలేశారు... ఆ ఎస్టేట్ లో ఏమి చేసేవారో తెలీదు కాని, చిన్న చీమ కూడా లోపలకి పోయే అవకాసం లేకుండా తన సొంత ఫాక్షన్ బ్యాచ్ తో, పహారా కాసే వారు... ఎకో పార్క్ అని, పీకాక్ పార్క్ అని, ఇలా ప్రభుత్వ డబ్బులతో ఇడుపులపాయ ఎస్టేట్ లో నిర్మించుకుని, ఎంజాయ్ చేసేవారు... 85 కోట్లు పెట్టి, తన ఎస్టేట్ కోసం 4 లేన్ రోడ్ వేయించారు... చివరకి అక్కడ హెలిపాడ్ కూడా నిర్మించారు... ఈ ఇడుపులపాయ ఎస్టేట్ లోనే, ఎన్నో వ్యవహారాలు నడిచేవి... అప్పటి స్కాంలు అన్నీ జగన్, ఇక్కడ నుంచే చేసేవారు... ఇప్పుడు జగన్ తన పాదయాత్ర తొలి అడుగు ఇక్కడ నుంచే వేశారు... ఇది ఇడుపులపాయలో, తండ్రి కొడుకులు కలిసి చేసిన ముడుపుల మాయ...