ముఖ్యమంత్రి కుర్చీ కోసం నవంబర్ 6వ తారీఖు నుంచి వై.సీ.పీ. ఆధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే... ప్రజాసంకల్పం పాదయాత్రపైనే ఆ పార్టీ శ్రేణులంతా 2019 ఎన్నికలపై గంపెడు ఆశలుతో ఉన్నారు. నిన్నమొన్నటి వరకు ప్రజా సంఘాలను పట్టించుకొని వై.సి.పి.అధిష్ణానం పాదయాత్రతో ఆ సంఘాలు గుర్తుకొచ్చి వారి సహకారాన్ని అధినేతే స్వయంగా సహకారం అడిగినట్లు తెలుస్తుంది.

jagan 31102017 2

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజాసంకల్పం యాత్రను జరిపి 125 నియోజకవర్గాలలో యాత్ర చేపట్టి ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలలో పాల్గొనున్నారు. ఈ యాత్రను విజవంతం చేసుకోవడానికి ప్రజాసంఘాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర విజయవంతం చేయడానికి నేతలు కరువవతారేమోనని ముందు చూపుతో వచ్చేనెల 10 నుంచి ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలకు వై.సి.పి. ఎమ్మేల్యేలు వై.సి.పి. ఫిరాయింపు దారులపై వేటు వేసేవరకు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణ చేస్తున్నామని పైపైకి చెప్పుకొస్తున్నారు. లోలోపలమాత్రం పాదయాత్రను విజయవంతం చేయడాని పక్కా వ్యూహమని రాజకీయ పరిశీలకులు వాఖ్యానిస్తున్నారు.

jagan 31102017 3

బి.సి., మైనారిటీలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలుచేయడంతో పాటు వై.ఎస్. హయాంలో అమలు జరిగిన సంక్షేమ పధకాలకంటే రెట్టింపులో సంక్షేమ పధకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. జగన్ యాత్ర నిర్వహించోప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలతో మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు... అయితే, ఇవి ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది జగన్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది... ఇన్నాళ్ళు మమ్మల్ని ఒక్కసారి అన్నా పిలిచారా ? మా సమస్యలు ఎప్పుడైనా విన్నారా ? ఇప్పుడు మీ రాజకీయ ప్రయోజనం కోసం మేమెందుకు సహకరించాలి అని కొన్ని ప్రజా సంఘాలు ప్రశ్నించటంతో, వైసీపీ పెద్దలు షాక్ తిన్నారు.. ఎదో సర్ది చెప్పినప్పటికీ, వారు సహకరిస్తారు అనే నమ్మకం మాత్రం కలగటం లేదు...

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా, అటవీ భుమాలైన 5,315 ఎకరాలు కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అనంతపురం,కర్నూలు, కడప జిల్లాల్లోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి అటవీశాఖకు బదలాయింపు చేసింది... రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం, తాడేపల్లిలో చిన్నపాటి కొండలు, గుట్టలలో నెలకొన్న అటవీ భూములను అమరావతికి కేంద్ర అప్పగించింది. దీనితో రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయి.

amaravati 31102017 2

రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో ముందస్తుగా అటవీ భూములు ఉన్నందున నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని ఆనుమానం వ్యక్తమైంది. ప్రస్తుతం అటవీ భూములకు సంబంధించిన 5,315ఎకరాలు రాజధాని నిర్మాణ పరిధిలోనికి రావటం, ఇప్పటికే 30వేల ఎకరాల అటవీ భూములను కూడా సిఆర్డిఏ వినియోగించుకోవటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో గడువులోపే రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాలకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకొని ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదికలు పంపినట్లు తెలుస్తోంది.

amaravati 31102017 3

ఈ భూములలో ప్రస్తుతం రైతులనుంచి స్వాధీనం చేసుకున్న పొలాలలో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, న్యాయమూర్తులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్, ఐపిఎస్.ఐఎఫ్ఎస్ ఆధికారులతోపాటు జనరల్ సర్వీసెస్ అధికారులకు, గజిటెడ్ ఆఫీసరు, నాన్గజిటెడ్ ఆఫీసర్లకు 4,016 నివాస గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే డిజైన్లను సింగపూర్, ఇతర దేశాల ఆర్కిటెక్టర్ల ద్వారా నమూనాలను తయారు చేసిపెట్టారు. ఇది ఇలా ఉండగా రాజధానికి అటవీ భూముల వ్యవహారం కేంద్రంతో రాష్ట్రం గత 3సంవత్సరాలుగా ఉత్తర ప్రశ్నోత్తరాలు జరపటంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించటంతో, ఎట్టకేలకు అటవీభూములను రాజధాని నిర్మాణానికి బదిలీ అయ్యాయి.

చంద్రబాబు ప్రభుత్వం నీరుకి ఎంత ప్రాదాన్యత ఇస్తుందో తెలిసిందే.. ఒక పక్క రాష్ట్రాన్ని కురువురహితం చేస్తూ, ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న చంద్రబాబు, జలసిరికి హారితి అంటూ, నీటిని పూజించమంటున్నారు. ముఖ్యమంత్రి మంచి మనసుతో చేసిన జలసిరికి హారతి కార్యక్రమం వల్ల ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉండి వరుణ దేవుడు కరుణించి రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. ఇది ఇలా ఉండాగా, 28 సాగునీటి ప్రాజెక్టులు పుర్తిచేయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఆ దిశగా అడుగులు వేస్తుంది...

cbn irrigation 30102017 2

డిసెంబరులోగా పూర్తిచేయాల్సిన 28 సాగునీటి ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయని జల వనరులశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు. కోగుళ్లు, ఎర్ర కాల్వ, కండలేరు లిఫ్టు, మారాల, చెర్లోపల్లి, సిద్ధాపురం, నర్సింహరాయ సాగర్, గోరకల్లు, అవుకు టన్నెల్, పెదపాలెం (గుంటూరు) చిన్నసాన ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తయిన 10 ప్రాజెక్టులకు మూడురోజుల పాటు వరుస ప్రారంభోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

cbn irrigation 30102017 3

గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేవిధంగా ఏ నిర్మాణ సంస్థయినా నిర్ధేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొండవీటివాగు డిసెంబరులోగా పూర్తిచేయాలని నిర్దేశించారు.

ఇవాళ మధ్యాహ్నం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు. వివిధ ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తున్న వేళ, గండికోట ప్రాజెక్టుకు వచ్చేసరికి, ఆ కాంట్రాక్టర్, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ వీడియో కాన్ఫరెన్స్ లో లేక పోవడం చంద్రబాబుకు కోపాన్ని తెప్పించింది.

cbn cm ramesh 30102017 2

గండికోట ప్రాజెక్ట్ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని, పనుల్లో జాప్యం జరిగితే తాను సహించబోనని హెచ్చరించారు... ఇదే వైఖరి, ఇదే లెక్కలేనితనం కొనసాగితే, తాను పోలీసు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రాజెక్టు సైట్ కు పోలీసులను పంపి అక్కడి సామాగ్రిని స్వాధీనం చేసుకుంటానని అన్నారు. ఇరిగేషన్ పనుల విషయంలో మాత్రం జాప్యాన్ని ఎంత మాత్రమూ సహించేది లేదని, ఎలాంటి వారినైనా ఉపేక్షించబోనని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn cm ramesh 30102017 3

తాను నిత్యమూ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తుంటే, తనను మించి శ్రమించాల్సిన వారు అశ్రద్ధతో ఉన్నారని, ఇంత నిర్లక్ష్యాన్ని ఇకపై సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పోలవరం మీద సమీక్షిస్తూ, పనులను లక్ష్యం మేరకు 2019లోగా పూర్తి చేయాలంటే 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read