అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం... ఇప్పుడు ఇది టాక్ అఫ్ ది వరల్డ్... ఎందుకంటే ఇక్కడ నిర్మించే నిర్మిస్తున్న ‘కియ’ ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ప్లాంటుగా గుర్తింపు తెచ్చుకోనుంది... దేశంలోనే అతి పెద్ద విదేశి పెట్టుబడి ఇది... ఒక పక్క ‘కియ’ కార్ల పరిశ్రమ పనులు శరవేగంగా జరుగుతుంటే, ఇప్పుడు కియా మరో అద్భతమైన వార్తా చెప్పింది...
కియాతో పాటు, మరో 20 అనుబంధ సంస్థలు వచ్చాయి. ఈ కొంపెనీలలో దాదాపు 20000 ఉద్యోగాలు రానున్నాయి. అయితే, ఇందులో సగం మందిని, స్థానికంగా ఉన్న మహిళలకే ఉద్యోగాలు ఇవ్వటానికి కియ నిర్ణయించుకుంది... మహిళలకు ఆటోమొబైల్ తయారీ పరిశ్రమకు సంబంధించి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికే ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది... కియా తీసుకున్న నిర్ణయంతో, ఆటోమొబైల్ రంగంలోని దిగ్గజాలు షాక్ అయ్యాయి... అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లలో, అదీ మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వటం, సాహసోపేత నిర్ణయం అని, సరైన శిక్షణ ఇవ్వాలి అని అంటున్నాయి... దీంతో స్థానికంగా ఉన్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు... ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు విజ్ఞప్తి ఉంది అని, అధికారవర్గాలు చెప్తున్నాయి... మహిళా సాధికారకత అనే మాటలు చెప్పే ప్రభుత్వాలే కాని, ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున నిజం చేసి చూపిన ప్రభుత్వాలు లేవు అని స్థానిక నాయకులు అంటున్నారు..
2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. 2018 మార్చి నాటికి ట్రయల్ రన్, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.