సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అంటే దొంగలకి, 420 కేటుగాళ్ళకి ఎంత భయమో వేరే చెప్పాల్సిన పని లేదు... సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం, జగన్‌ అక్రమ ఆస్తుల కేసులు అన్నీ సమర్ధవంతంగా దర్యాప్తు చేసిన హానెస్ట్ ఆఫీసర్ ఈయన... కాగా, ఆ సమయంలో జరిగిన ఓ కీలక పరిణామం ఇప్పుడు ఈడీ వెలుగులోకి వచ్చింది.

jd cbi 26102017 2

కోనేరు రాజేంద్రప్రసాద్‌.. రాజశేఖర్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగాడు... జగన్ పార్టీ తరుపున, 2014 ఎలక్షన్స్ లో, విజయవాడ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసారు..ఎమ్మార్‌ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్‌ను సీబీఐ కేసు నుంచి తప్పించడానికి ఆయన కుమారుడు కోనేరు ప్రదీప్‌ మాంసం ఎగుమతిదారు ఖురేషీ ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఈ "జే" గ్యాంగ్, లక్ష్మీనారాయణని తప్పించటానికి 6.5 కోట్లు దాకా ఖర్చు చేసింది... అంతే కాదు, ఈ "జే" గ్యాంగ్, లక్ష్మీనారాయణ లాంటి హానెస్ట్ ఆఫీసర్ కి పెట్టిన పేరు, 'హైదరాబాద్ డాగ్"... ఈ మాట వింటే రక్తం మరుగుతుంది కదూ... ఇది వీళ్ళ బ్రతకులు, అంటూ ఈడీ ఆ ఫోన్ సంభాషణ కూడా చార్జ్ షీట్ లో పెట్టింది...

jd cbi 26102017 3

16 వ తేదీ 2013న హైదరాబాద్ డాగ్ ఈజ్ కమింగ్ టూ ఢిల్లీ సేమ్ ప్లైట్ అజ్ డాడ్. .. ఖరేషీ కూడా రిప్లే ఇచ్చారు. వై డూ యూ థింక్ డాగ్ కమింగ్ దేర్ ఇప్ బాస్ నాట్ ఇన్ టౌన్..అని చేశారు. ఈ మెసేజ్ లను ఏ.పి. సింగ్ కు ఖురేషీ చూపించినట్లు ఈ.డీ. పెర్కొంది. మరో మెసేజ్ ఎప్రిల్ 30న జే.డీ. బదిలీ కోర్టు అదేశాల పై చేసినట్లు ఈ.డీ. తెలిపింది. అయితే జేడీ ట్రాన్స్ ఫర్ కోసం 5.7 కోట్ల రూపాయలను ఖురేషీకి ఇచ్చినట్లు కొనేరు ప్రదీప్ ఈ.డీ. విచారణలో ఒప్పుకున్నారు.

నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేస్తాను అని చెప్తున్న జగన్, అంతకంటే ముందు, ఆరు రోజుల పాటు లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు... ఈ నెల 28 నుంచి, ఆరు రోజుల పాటు లండన్ లో పర్యటించి, పాదయాత్రలో పాల్గుంటారు... ఆరు నెలల పాటు పాదయాత్ర చేస్తా అంటున్న జగన్, లండన్ లో చదువుకుంటోన్న కుమార్తె దగ్గరకు వెళ్తాను అని, పర్మిషన్ కావలి అని, కోర్ట్ ని అడగగా, కోర్ట్ దానికి ఒప్పుకుని పర్మిషన్ ఇచ్చింది...

jagan london 26102017 2

అయితే పోయిన నెలలోనే లండన్ వెళ్లి వచ్చిన జగన్, 40 రోజుల గ్యాప్ లోనే, మళ్ళీ లండన్ వెళ్ళటం ప్రాధాన్యత సంతరించుకుంది... కుమార్తె దగ్గరకు వెళ్తున్నా అని చెప్పినా, వేరే కారణాలు కూడా ఉన్నాయి అని, పార్టీ వర్గాలే అంటున్నాయి... నిజానికి, అవసరమైతే, కుమార్తెనే ఇక్కడకు పిలిపించుకోవచ్చు అని, కాలేజీలో జాయిన్ అయిన తరువాత హోం సిక్ హాలిడేస్ ఉంటాయి అని, అయినా జగనే స్వయంగా వెళ్ళటం వెనుక, పర్సనల్ విషయాలు ఏమున్నాయో అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి...

jagan london 26102017 3

నవంబర్ 6 నుంచి జరిగే పాదయాత్ర కోసం, జగన్ లండన్ లో కసరత్తు చేస్తారని... నడక నడవటం, ఆహారపు అలవాట్లు, త్రెడ్ మిల్ మీద నడవటం ప్రాక్టీస్ చేస్తారని అంటున్నారు... మరో పక్క జగన్, తండ్రిలాగా పంచె కట్టుతో పాదయత్ర చేస్తారు అంటున్న తరుణంలో, పంచె కట్టుకుని ప్రాక్టీస్ చేస్తారని, లండన్ లోని ఫజికల్ ట్రైనర్స్ దగ్గర, జగన్ పాదయత్ర కోసం మెలుకువులు నేర్చుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి..

టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే ముంబాయి కేంద్రంగా విజయవంతంగా నడుస్తున్న టాటా కేన్సర్ ఆసుపత్రి, విస్తరణలో భాగంగా దేశంలోని మరో అయిదు రాష్ట్రాలలో కేన్సర్ ఆసుపత్రులను ప్రారంభించాలని టాటా యాజమాన్యం నిర్ణయించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రధానమైన నగరాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. రోగుల సంఖ్య విపరీతం కావడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు టాటా యాజమాన్యం కోట్ల ఖర్చుతో ఆసుపత్రులను నిర్మించేందుకుముందుకు రావడం జరిగింది.

tata 26102017 2

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి లేదా విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఆసుపత్రిని నిర్మించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంగా టాటా ట్రస్ట్ స్థలానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకునే అవకాశాలున్నాయి. టాటా ట్రస్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

tata 26102017 3

రాష్ట్రం విడిపోయిన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన కేన్సర్ ఆసుపత్రి కూడా లేదు. దీంతో టాటా ట్రస్ట్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్,అసోం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా భారీ వ్యయంతో టాటా కేన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్నకేన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టు కోసం ఆసక్తితో ఎదురుచూస్తోంది.

దక్షిణాదిలో అధికారం కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి టార్గెట్ చేరుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి పోలవరం ప్రాజెక్టు ఇబ్బందిగా పరిణమించనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణమైన కాంట్రాక్టు సంస్థను మార్చేందుకు కేంద్రం ససేమిరా అంటున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ఇదంతా కావాలనే చేస్తుందా అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి అభిమతం. వాస్తవానికి జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులను కేంద్రమే నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నిత్యం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సోమవారం పోలవరం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష జరపడం, తరుచూ ప్రాజెక్టులను సందర్శించడం చేస్తున్నారు. ఎప్పటికప్పడు అధికారులను, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేస్తూ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం మందగించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు చేపట్టిన ప్రధాన కాంట్రాక్టర్ Transtroy సంస్థ వలనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పనులు సకాలంలో పూర్తికావనే నిర్ధారణకు వచ్చి, నిర్మాణ సంస్థను మార్చాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. గ్లోబల్ టెండర్ల ద్వారా కొత్త సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో జరుగుతుందని కేంద్రం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ఇప్పటికిప్పడు కాంట్రాక్ట సంస్థను మార్చితే నిర్మాణ వ్యవయం పేరుగుందనే అభిప్రాయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు. చంద్రబాబు స్వయంగా వెళ్లి కలిసినా, కేంద్రం వైఖరిలో మార్పు లేదు...

బీజేపీ పార్టీ నేతలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి కాకుంటే ఆ ప్రభావం బీజేపీ పై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థను మార్చకుంటే ఆ నెపాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కేంద్రం పై నెడుతుందని, అది అంతిమంగా ఏపీలో బీజేపీ ప్రతిష్టను దిగజార్చుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భూసేకరణ బిల్ పక్కన పెట్టటంతో అమరావతి, మిగతా ప్రాజెక్ట్ లు లేట్ అవుతున్నాయి అని, దానికి కేంద్రమే కారణం అని ప్రజల్లోకి బాగా వెళ్ళింది... దానికి తోడు, అచ్చు గుద్దినట్టు అదే విధంగా ఉన్న తెలంగాణా, గుజరాత్ భూసేకరణ బిల్ ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ బిల్ తొక్కి పెట్టారు అని, కేంద్రం పై ప్రజలు గుర్రుగా ఉన్నారు... ముఖ్యమంత్రి పోలవరం కోసం ఎంత తపన పడుతున్నారో, ప్రజలు చూస్తూనే ఉన్నారు... కేంద్రం ఇలాగే కావాలని కాలయాపన చేస్తే, ప్రజలు తీవ్రంగా స్పందించటం ఖాయం అని రాష్ట్ర బీజేపీ నేతలే అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read