తన పాదయాత్ర సక్సెస్ అవ్వాలి అని, దాని కోసం మీరంతా కృషి చెయ్యాలి అని, నా పాదయాత్ర తప్ప మీ పేపర్ లో, టీవీలో ఇంకా ఏ రకమైన న్యూస్ రాకూడదు అని, జగన్ నిన్న మీడియా, పత్రికా అధిపతులకి పిలుపు ఇచ్చారు... పాదయాత్ర ఆశీర్వాదం కోసం, మీడియా, పత్రికా అధిపతులను లోటస్ పాండ్ కి ఆహ్వానించారు జగన్... అంతకు ముందు రోజే ఈనాడు అధిపతి రామోజీ రావుని కలిసి, 40 నిమషాల పాటు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.. మరి ఏమైందో కాని, రామోజీ అంతటి శత్రువు అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం పిలుపు రాలేదు... ఆంధ్రజ్యోతి, ఏబిన్ తప్ప, మిగతా అన్ని చానల్స్, పత్రికల అధిపతులను జగన్ తన ప్యాలస్ కు ఆహ్వానించారు...

jagan lotus pond 25102017 2

నిన్న ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ లోటస్ పాండ్ లో జరిగింది... అందరినీ మీటింగ్ హాల్ కి కాకుండా, నేరుగా లోటస్ పాండ్ లోని డైనింగ్ హాల్ కి తీసుకువెళ్ళారు జగన్... దీంతో, ఆ ఇంటీరియర్ అంతా చూసి, మూర్చ పోయినంత పని అయింది ఆ మీడియా అధిపతులకి... నిజానికి ఈ మీడియా ప్రతినిధులు ఆషామాహీ వారు కాదు... బాగా సంపాదించారు కూడా... అయినా, జగన్ లోటస్ పాండ్ చూసి, వారికి దిమ్మ తిరిగింది అంటే, ఇక ఏ రేంజ్ లో మనోడు, ఇంటీరియర్ పెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు... చంద్రబాబు దుబాయ్ లో రాజ వంశీకులాని కలిసిన వీడియో చూసాం అని, ఆ రాజ వంశీయులకు కూడా, జగన్ లోటస్ పాండ్ కి ఉన్న ఇంటీరియర్ లేదు అని, ఆశ్చర్యపోయారు... ఇవన్నీ జగన్, ఏ దేశం నుంచి తీసుకువచ్చారో అని గుసగుసలాడుకున్నారు...

jagan lotus pond 25102017 3

ఈ షాక్ నుంచి తేరుకోక ముందే, జగన్ ఇంకో షాక్ ఇచ్చారు... సమయం 11 దాటింది, అందునా డైనింగ్ హాల్ లో కూర్చోబెట్టాడు, మాంచి లంచ్ చేసి వెళ్ళచ్చు అనుకున్నారు అంతా... తీరా చుస్తే, బ్రిటానియా బిస్కట్ లు పెట్టి, టీ ఇచ్చి పంపారు అంట జగన్... కనీసం ఏదైనా గిఫ్ట్ ప్యాక్ వస్తుంది అనుకున్న వారు కూడా, అసంతృప్తితో బయటకు వచ్చారు... కేవలం ఆయన చెప్పాల్సింది చెప్పి, కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని, అన్నారు మీడియా ప్రతినిధులు... మీరు మీడియా కవరేజ్ లో నాకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వండి, ఫార్మాలిటీస్ సాయన్న మాట్లాడతారు అని చెప్పి, జగన్ వెళ్ళిపోయారు అని సమాచారం..

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అంటూ, వైశ్యుల పై అనుచితంగా పుస్తకం రాసి, సమాజంలో కులాల మధ్య గోల పెట్టిన కంచ ఐలయ్య గోల విజయవాడని తాకింది... ఈయనగారు హైదరాబాద్ లో కూర్చుని ఏ గోల అయినా చేసుకున్నా పరవాలేదు... కాని ప్రశాంతంగా ఉన్న విజయవాడ మీద ఈయన కన్ను పడింది... కొంత మంది అనుచగణంతో కలిసి ఈ నెల 28న ఛలో విజయవాడ అని పిలుపి ఇచ్చి, బారి మద్దతు సభకు సన్నాహాలు చేశాడు కంచె ఐలయ్య... కంచె ఐలయ్యకు సన్మానం చేస్తామని, జింఖానా గ్రౌండ్స్‌లో పర్మిషన్ ఇవ్వాలి అని అడిగారు ఆయన మద్దతుదారులు...

ilaiah 25102017 2

ఇదే సందర్భంలో, అదే తేదిన, అదే ప్లేస్ లో, అదే రోజున ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాయి. విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో సభ నిర్వహణ కోసం ఇరువర్గాలు పోలీసుల అనుమతి కోరాయి. దీంతో, ఒకే రోజు ఒకే చోట రెండు సంఘాలు అనుమతి కోరడంతో, ఇరు వర్గాలకి పోలీసులు ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. గురువారం నుంచి విజయవాడలో 144 సెక్షన్ అమలు కానుంది.

ilaiah 25102017 3

వేదికగా విజయవాడ ను ఎంచుకోవడంలో ఆంధ్రలో కూడా తనకు మద్దతుదారులు ఉన్నారు అని చెప్పుకోవడానికి, సామాజిక వర్గం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తద్వారా ఆర్యవైస్యుల పై దాడి చేయటానికి ప్లాన్ చేశారు... అంతే కాదు, సభ యొక్క ప్రధాన డిమాండ్ గా ఐలయ్య పై కేసులు ఎత్తివేయాలని, రక్షణ కావాలి, దాడులు ఆపాలి, కోమాటోల్ల షాప్స్ బహిష్కరించాలని ఈ సభ కోసం తాయారు చేసిన కరపత్రంలో పేర్కొన్నారు. నిజానికి ఇది ఐలయ్య, ఆయన వెనుక ఉన్నవారు వ్యహత్మకంగా విజయవాడని ఎన్నుకున్నారు... ఇలాంటి వేషాలు హైదరాబాద్ లో వేస్తే, కెసిఆర్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి, విజయవాడలో పెట్టి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో కుల, మత వివాదాలు చోటు చేసుకునే మంచి అవకాశం దొరికిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పార్టీ రంగంలోకి దిగింది. దీంతో పోలీసులు ఈ పన్నాగం పసిగట్టి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు...

దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన దేశంలోనే అతిపెద్ద పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలకు, నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పడుతుంది. అయితే పోలవరం కంట్రాక్టర్ విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు... పోలవరం కంట్రాక్టర్ ని మార్చేది లేదు అని కేంద్రం చెప్పింది.. వెంటనే చంద్ర బాబు గడ్కారి కి కాల్ చేసి నాగపూర్ వచ్చి కలుస్తాను అని అడిగారు... వైజాగ్ నుంచి ఢిల్లీ వేల్లి అక్కడి నుంచి అమెరికా వేల్లల్సిన చంద్రబా బు, నాగపూర్ వెళ్లి గడ్కారి తో మాట్లాడి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అమెరికా బయలుదేరాల్సిన పరిస్థితి.

polavaram 25102017 2

చంద్రబాబుకి పోలవరం మీద ఉన్న కమిట్మెంట్ ఇది. 10 రోజులు విదేశీ పర్యటనలో ఉంటే, పోలవరంలో పనులు ఆగిపోతాయని, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి, 4 ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈ నెల 24 వరకూ తాను నాగ్‌పూర్‌లోనే ఉంటానని, 25న దిల్లీ వెళ్తానని, అదే రోజు ఈ పోలవరం అంశం పై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చంద్రబాబుకి హామీ ఇచ్చారు.. 2019 లోగా ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయడమే మా లక్ష్యం... "మేమైతే కాంట్రాక్టర్ ను మారిస్తే పనులు జోరు పెరుగుతుంది అని చెప్తున్నాం.. కాదు అంటే, ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన అంచనాలను పెంచి సబ్ కాంట్రాక్టర్ లు అందరికీ నేరుగా ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేసి వారికే ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరపడం" అని ముఖ్యమంత్రి గడ్కరీకి సూచించారు...

polavaram 25102017 3

చంద్రబాబుకి హామీ ఇచ్చిన మేరకు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు గడ్కరీ. సోమ, మంగళవారాల్లో పోలవరం పనులను మసూద్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ సభ్యులు కూడా బుధవారం సమావేశానికి హాజరవుతున్నారు. మరి కేంద్రం చంద్రబాబు ఇచ్చిన సూచనలకు తగ్గట్టు సహకరిస్తుందా, ఎమన్నా ఇబ్బందులు పెడుతుందా అనేది చూడాలి...

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత గుర్తుందా... సరిగ్గా అదే ఇప్పుడు లక్ష్మీ పార్వతికి వర్తిస్తుంది... ఎన్టీఆర్ భార్యని అని చెప్పుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, జగన్ మోహన్ రెడ్డితో కలిసి, ఆ మహానుభావుడి పేరు చెడగొట్టటానికి, పిచ్చోడుగా పేరు ఉన్న రాం గోపాల్ వర్మతో కలిసి సినిమా తియ్యటానికి ఒప్పుకుంది ఈ మహా తల్లి.. అన్న గారి చరిత్ర మొత్తం తీస్తే పరవాలేదు... ఈ మాహా తల్లి ఆయాన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచే సినిమా అంటే, ఎంత నీచ్చంగా ఆలోచిస్తున్నారో అర్ధమవుతుంది..

veergrandham 25102017 2

ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే, ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకు వచ్చింది... ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ కుమార్ గౌడ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుకు రెండో భార్యగా రావడం. ఆ తర్వాత అతనిని వదిలి సూట్‌కేసుతో బయటకు రావడం లాంటి యదార్థ సంఘటనలు ఉంటాయి అని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

veergrandham 25102017 3

లక్ష్మీపార్వతి పాత్రలో నటించాలని ప్రముఖ నటి వాణి విశ్వనాథ్‌ను కోరాం. ఆమెతో సంప్రదింపులు జరుపుతూనే ప్రముఖ తారలు సన్నీలియోన్ , లక్ష్మీరాయ్, పార్వతీ మెల్టన్‌ను కూడా సంప్రందించేందుకు ప్రయత్నిస్తున్నాం అని జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్‌ని తిరుపతిలో ప్రారంభిస్తామని.. నవంబర్‌ రెండోవారంలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని , జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తామని జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ చిత్రంలో మూడు పాటలు, ఓ హరికథ ఉంటుందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read