ముఖ్యమంత్రి కుర్చీ... ముఖ్యమంత్రి కుర్చీ... ముఖ్యమంత్రి కుర్చీ... ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక టార్గెట్ ఇదే... అందుకే, ఎప్పుడు నోరు తెరిచినా, ఆఫ్టర్ 2 ఇయర్స్ కింగ్ అంటున్నారు... ఇంకా ముందుకెళ్ళి, నేను ముఖ్యమంత్రి అవ్వటం కోసం, మీ అందరూ గెట్టిగా ప్రార్ధించండి అని ప్రజలకే ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు.. తప్పు లేదు... ఏ రాజకీయ నాయకుడు టార్గెట్ అయినా, ముఖ్యమంత్రి కావాలనే ఉంటుంది... కాని, అది అందుకోవాలి అంటే, ప్రజల ఆశీర్వాదం కావలి... ప్రజల ఆకాంక్ష ఏంటో తెలుసుకుని, వారి మన్ననలు పొందాలి... మరి జగన్ ఏమి చేస్తున్నాడు ?

padayatra 24102017 2

ముందుగా పాదయాత్ర విషయానికి వద్దాం... ఎప్పుడో రెండు నెలల క్రితం, నేను అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తున్నా అని ఆర్భాటంగా ప్రకటించారు.. తరువాత, జ్యోతిష్యులు చెప్పారని, నవంబర్ 2కి వాయిదా పడింది.... తరువాత కోర్ట్ శుక్రవారం పర్మిషన్ ఇవ్వలేదు అని, నవంబర్ 2 పాదయాత్ర మొదలు పెట్టి, నవంబర్ 3 కోర్ట్ కి పొతే, జనం నవ్వుతారని, మళ్ళీ నవంబర్ 6కి వాయిదా వేసాడు... చివరగా, వారానికి నాలుగు రోజుల పాదయత్ర ఫిక్స్ చేశాడు.. ఇప్పుడు మళ్ళీ "అన్న వస్తున్నాడు" అని పాదయాత్రకి పెట్టిన పేరు మార్చేసారు... మరి ఇది జ్యోతిష్యులు చెప్పారో, న్యుమరలాజీ వాళ్ళు చెప్పారో కాని, ఇప్పుడు పాదయాత్ర పేరు ‘ప్రజా సంకల్పం’గా మార్చారు.

padayatra 24102017 3

ఇప్పుడు ఈ పేరు మీద కూడా విమర్శలు వస్తున్నాయి.... ‘ప్రజా సంకల్పం’ అంటే ప్రజలు కోరుకునేది... ప్రజల ఆకాంక్ష నెరవేరేది... ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చేసే పాదయాత్ర ప్రజల సంకల్పం ఎలా అవుతుంది ? ఈయన సొంత స్వార్ధం కోసం, కేసుల నుంచి తప్పించుకునటం కోసం చేసే యాత్ర ప్రజల సంకల్పం ఎలా అవుతుంది ? నిజానికి ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’ వేరు... అద్భుతమైన రాజధాని కావలి అనేది మా ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’... పోలవరం పూర్తి కావలి అనేది మా ఆంధ్ర రాష్ట్ర ‘ప్రజా సంకల్పం’... పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, మా జీవితాలు బాగుపడాలి అనేది ‘ప్రజా సంకల్పం’... ప్రజలకు ఇవి ఎవరు చేస్తున్నారో, చేస్తారో పూర్తి క్లారిటీ ఉంది... ఇవి ఆపటం కోసం, ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఇంకా క్లారిటీ ఉంది... తప్పకుండా ‘ప్రజా సంకల్పం’నెరవేరుతుంది జగన్ గారు..

అదేంటి జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉందిగా... ఏ పని చెయ్యకపోయినా, ఏదో ఒక షో చేస్తున్నాడుగా అంటారా.... రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు అని స్వయంగా ప్రకటించింది వైఎస్ఆర్ పార్టీనే... ప్రజా సమస్యలు మీద ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక వేదిక ఏది ? ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ప్రజా సమస్యలు వినిపించేడి ఎక్కడ ? అసెంబ్లీనే కదా ? శాసనసభకు మించిన ప్రజా వేదిక, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా ? మరి అలాంటి వేదికని ఎవరన్నా బహిష్కరిస్తారా ? అందులోనూ ప్రజల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం బహిష్కరిస్తుందా ? మన ఖర్మకి, తన రాజాకీయ ఆకాంక్ష మాత్రమే అధిక ప్రాధాన్యం అనే ప్రతిపక్షం, అలా చేస్తుంది...

jagan 26102017 2

వైఎస్ఆర్ పార్టీ శాసనసభకు రాకూడదు అని డిసైడ్ అయ్యింది... వారు అసెంబ్లీ బహిష్కరించటానికి కారణం ఎదో ప్రజా సమస్య అనుకునేరు... వాళ్ళు చెప్తుంది, తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వారిని రాజీనామా చేపించాలి అంట... ఈ కారణం చేత, వారు ప్రజా సమస్యలు పట్టించుకోరు అంట... ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదియ్యరు అంట... తమ అధినేత చేస్తున్న పాదయాత్రలో పాల్గుంటారు అంట... మరి ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి ? ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1100 కాల్ సెంటరే మన ప్రతిపక్షం... దానికి ఫోన్ చేసి మన సమస్యలు పరిష్కరించుకుందాం... ఇది సరే, మరి జగన్ పార్టీ ఇలా ఎందుకు చేసింది అనుకుంటున్నారా ? దాని వెనుక పెద్ద ఇగో స్టొరీ ఉంది...

jagan 26102017 3

జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర అంటున్నాడు... మరి తను పాదయాత్ర చేస్తే, అసెంబ్లీకి ఎవరు వెళ్తారు ? ఎవరిని లీడ్ చెయ్యమని చెప్పాలి ? జగన్ ఆ ఊహ తట్టుకోలేక పోయాడు.. నా స్థాయి, నా స్థానంలో ఇంకోకోడిని కూర్చోబెట్టటమా ? కుదరదు.... పోనీ అసెంబ్లీ తరువాత పాదయాత్ర మొదలు పెడదాం అంటే, అదీ కుదరదు... నంద్యాల, కాకినాడ ఘోర ఓటమి తరువాత, ప్రభుత్వం మనల్ని ర్యాగింగ్ చేసి ఒదిలిపెడుతుంది... అది నేను తట్టుకోలేను... నేను 14 రోజులు ప్రచారం చేసినా, అఖిల ఒంటి చేత్తో గెలిపించుకుంది... అఖిల నన్ను అసెంబ్లీలో ఏమన్నా అంటే నా ఇగో ఏమి కావలి ? లోకేష్ ఇప్పుడు మంత్రి, నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడు... నేను తట్టుకోలేను.. అందుకే ఇక ఈ ఒకటిన్నర సంవత్సరాలు నేను అసెంబ్లీకి వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనివ్వను అని తన పార్టీ ఎమ్మల్యేలతో జగన్ తెగేసి చెప్పారు... ఒకే సారి తన ఇగోని, తన సాడిస్ట్ మెంటాలిటీని బయట పెట్టారు... అంటే, ఇక ఒకటిన్నర సంవత్సరం రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు... ప్రజలు ఏ సమస్య ఉన్నా 1100 కాల్ సెంటర్ కి ఫోన్ చేసి, సమస్యలు పరిష్కారం చేసుకోవటమే...

రాజధాని ప్రభుత్వ భవన సముదాయ ఆకృతుల రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ముఖ్యంగా హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుదిరూపానికి వచ్చింది. శాసనసభ భవంతి ఆకృతులలో కొద్దిపాటి మార్పులను సూచించిన ముఖ్యమంత్రి- త్వరలో ఆ నమూనాలను చూపించి సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్దేశించారు. లండన్‌లో నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండురోజుల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశాలలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతుల నమూనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన రెండోరోజు సమావేశంలో వీటిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు ఆకృతి ఓకే: హైకోర్టు భవన ఆకృతి దాదాపుగా తుది రూపానికి వచ్చింది. ముఖద్వారం, భవనంలో ఇతర భాగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆ మార్పులు కొన్ని రోజులలోనే పూర్తిచేసి నిర్మాణ పనులు వేగిరం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

amaravati 26102017 2

శాసనసభ ఆకృతిపై చర్చ: శాసనసభకు సంబంధించి నిన్న నార్మన్ ఫోస్టర్ ప్రదర్శించిన ఆకృతులపై వివరంగా చర్చ జరిగింది. నిన్న ఇచ్చిన ఆకృతులతో పాటు తొలిరోజుల్లో ఫోస్టర్ సమర్పించిన పొడవైన స్థంభాకారంలో ఉన్న ఆకృతిని మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ రెండింటిపై విపులంగా అధ్యయనం చేసి, వాటిల్లో ఉత్తమంగా ఉన్న అంశాలన్నీ క్రోడీకరించి మరింత మెరుగుపరచి నమూనాలను తయారుచేసి చూపించమని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నమూనాలు తయారయ్యాక వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఐదు టవర్లుగా సచివాలయం: సచివాలయానికి సంబంధించి జరిపిన సమాలోచనలో ఒక స్పష్టత వచ్చింది. మొత్తం 5 టవర్లుగా సచివాలయాన్ని నిర్మిస్తారు. ఇందులో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 భారీ టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం ఎడంగా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్శదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, వీటిన్నింటితో వేరే టవర్ ఉంటుంది. ఐతే, ఈ 5 టవర్లను ఒకే వరుసలో నిర్మించాలా, లేక రెండు, మూడు వరుసలలో నిర్మించాలా అనే అంశంపై కొంత చర్చ జరిగింది. దీనిపై రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలను సిద్ధం చేసి చూపించాలని ముఖ్యమంత్రి ఆర్కిటెక్టులకు సూచించారు.

amaravati 26102017 3

త్వరలో భవన సముదాయ నిర్మాణ పనులు ప్రారంభం: పరిపాలన నగర నిర్మాణంలో ఇక జాప్యం చేయరాదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెండు ముఖ్యమైన భవంతుల ఆకృతుల నమూనాలను జాప్యం చేయకుండా తయారుచేసి, కొద్ది రోజుల్లోనే తనకు చూపించాలని ముఖ్యమంత్రి ఆర్కిటెక్టులకు చెప్పారు. దీనిని నిరంతరం పర్యవేక్షించి త్వరలో అన్నీ పూర్తయ్యేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆకృతులు, శిల్పరూపాలపై తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలను, రాజధాని కమిటీ సూచనలను, ప్రభుత్వవర్గాలోను, ప్రజలలోనూ వ్యక్తమయ్యే అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయమని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి చంద్రబాబు నాయుడు సూచించారు. అంతకుముందు ముఖ్యమంత్రి నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో మాట్లాడుతూ, ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలిచే అత్యద్భుతమైన రాజధానిని నిర్మించడం కోసమే ఇంత పెద్దఎత్తున కసరత్తు చేయాల్సివస్తోందని పునరుద్ఘాటించారు. ‘ఐదు కోట్లమంది ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. వారు విలక్షణమైన, దిగ్గజ నమూనాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచంలోని తొలి ఐదు నగరాలలో ఒకటిగా నిలిచే నగరమంటే దాని నిర్మాణశైలి, ఆకృతులు అసాధారణ రీతిలో, అపూర్వంగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దానికోసమే ఇంతగా కష్టపడుతున్నామని, ఎడతెగని సమాలోచనలు చేస్తున్నామని వివరించారు. అత్యుత్తమ ఆర్కిటెక్టుగా అంతర్జాతీయంగా మంచి పేరున్న ఫోస్టర్ సంస్థ అమరావతి కోసం తలమానికంగా నిలిచే ఆకృతులు అందిస్తుందనే ఉద్దేశంతోనే ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించామని గుర్తుచేశారు. ఈ నమ్మకాన్ని నిలిపేలా తుది ఆకృతులు ఉండాలని అన్నారు. ‘మీరిచ్చిన ఆకృతులు, ప్రణాళికలతో మీరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.

67 వయసులో, సప్త సముద్రాలు దాటి, మూడు దేశాలు తిరిగి, ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా ఉపయోగించక, 10 రోజులు నుంచి విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి, విసుగు ఆంటే తెలియదు... విరామం అంటే ఎరుగడు... ప్రజా సంక్షేమమే ఊపిరి... రాష్ట్ర అబివృద్దే ధ్యేయంతో పని చేస్తున్నారు...పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా అనువైన ప్రదేశమని తనని కలిసిన పారిశ్రామికవేత్తలతో చెప్తున్నారు... ఏపీలో పెట్టే పెట్టుబడులు సురక్షితం, లాభదాయకమని, నాది భరోసా అని ధీమా ఇస్తున్నారు..

cbn 26102017 2

మూడురోజుల పర్యటన కోసం లండన్ విచ్చేసిన ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఇక్కడి ప్రఖ్యాత ‘ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐవోడీ) వివిధ సంస్థల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక ప్రముఖులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ పురస్కారం అందుకోవడానికి కొద్దిసేపు ముందు ఈ సమావేశాన్ని జరిపారు. త్వరత్వరగా రెండంకెల వృద్ధి రేటు అందుకున్న ఆంధ్రప్రదేశ్ వరుసగా 15 ఏళ్ల పాటు సుస్థిరంగా వుండేలా 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటోందని చెప్పారు. దేశానికి మధ్యభాగాన ఉండటం, సుదీర్ఘమైన సముద్రతీరాన్ని కలిగివుండటం తమకు కలిసి వచ్చే అంశాలని గుర్తుచేశారు. రైలు మార్గాలు, రహదారులు, జల రవాణా సదుపాయాలతో దేశం మొత్తానికి అనుసంధానం కలిగి వున్నామని తెలిపారు. కాకినాడ-పాండిచ్ఛేరి జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆటోమోబైల్ పరిశ్రమలో వేళ్లూనుకుని ఉన్నామని, ఆగ్రో ప్రాసెస్ రంగంలో అగ్రపథానికి చేరుకున్నామని వివరించారు.

cbn 26102017 3

నిరంతర విద్యుత్ సరఫరాలో దేశానికే ఉత్తమ నమూనాగా నిలిచామని ముఖ్యమంత్రి చెప్పారు. సౌర విద్యుత్ వ్యవస్థలో ఆధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుంటూ నిల్వ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సౌర నిల్వ వ్యవస్థను ఏర్పరచుకుంటే ఇక తమకు తిరుగే ఉండబోదన్నారు. చౌక ధరలో నాణ్యమైన సరఫరా చేయగలగడమే కాకుండా ప్రపంచంతో పోటీ పడే స్థాయిని త్వరలోనే అందుకోగలుగుతామన్నారు. దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పారు. గతంలో సైబరాబాద్ వంటి ప్రపంచస్థాయి నగర నిర్మాణంలో సాధించిన అనుభవంతో మరో అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇది వైజ్ఞానిక, పర్యాటక నగరంగా అందరికీ ఒక ముఖ్య గమ్యస్థానంగా నిలవగలదన్నారు. 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో అమరావతి అత్యద్భుత నగరంగా రూపొందుతోందని చెప్పారు. ‘అమరావతిలో ఏం జరుగుతోందో గమనించి అక్కడికి వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి, మేము చెప్పింది వాస్తవమేనని మీరు తప్పకుండా అంగీకరిస్తారు’ అని ముఖ్యమంత్రి అన్నారు. సహజ వనరులు, నైపుణ్యం గల మానవ వనరులు, వ్యాపార సానుకూలతలు వున్న ప్రదేశం ఇండియాలో తమదేనన్నారు.

Advertisements

Latest Articles

Most Read