త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘విలేజ్ మాల్’ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 29 వేల చౌకధరల దుకాణాలను దశల వారీగా ‘విలేజ్ మాల్’లుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో ‘అన్న విలేజ్ మాల్’ పేరుతో తొలివిడతగా 6,500 దుకాణాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ దుకాణాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రత్యేకంగా లోగో రూపొందించాలని చెప్పారు.

కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ‘అన్న విలేజ్ మాల్’కు మొత్తం వ్యయంలో 25% ప్రభుత్వం భరించమే కాకుండా, మరో 25% ‘ముద్ర’ రుణాన్ని డీలరుకు ఇప్పించనుంది. ఈ మాల్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో వుంచనుంది. బందరు లడ్డు, కాకినాడ కాజా, తెలుగింటి పచ్చళ్లు వంటి వాటిని కూడా లభిస్తాయి. ఎవరైనా సరే తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్ మాల్’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.

ఇక ‘రేషన్ బియ్యం’ తమకు వద్దు అనుకునే తెల్లకార్డుదారులకు అంతేవిలువైన నగదును ‘అన్న విలేజ్ మాల్’లో కావాల్సిన ఆహార పదార్ధాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకు డీలర్లను వెంటనే నియమించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో లబ్దిదారులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్‌ కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు నెలకు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను జత చేయాలని చెప్పారు. అలాగే ప్రత్యేక అవసరాలు వున్న కూరాకుల, రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్‌ ఇవ్వాలని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు బోగస్ రేషన్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణకు త్వరలో మొబైల్ అప్లికేషన్ తీసుకువస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

2018 నాటికి రాష్ట్రంలో 10 మె.వా. సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2018 సంవత్సరంలో ఉత్పత్తి ప్రక్రియనూ ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ బ్యాంకు సమకూర్చే నిధులతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. నిలకడగా ఉన్న నీటి మీద వీటిని స్థాపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.70 కోట్ల వ్యయం అవుతుంది. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం లేదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాచూసుకుంటుంది.

2014లో పశ్చిమ బెంగాల్లోని రాజర్ ఘాట్ లో నెలకొల్పిన ప్రాజెక్ట్ దేశంలోని మొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు. ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నీటి మీద తేలియాడే (ఫ్లోటింగ్) ప్రాజెక్టుల స్థాపనకు మొగ్గుచూపుతున్న పరిస్థితి ఉంది.

ఏపీ పైబర్ గ్రిడ్ కి షాక్.... 24000 సెటప్ బాక్స్ లు సీజ్... బయటపడిన చంద్రబాబు మరో అవినీతి... ఏపీ పైబర్ గ్రిడ్ ఇక లేనట్టే... ఇవి రెండు రోజులు నుంచి జగన్ పార్టీ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్, జగన్ సొంత ఛానల్, పేపర్ చేస్తున్న హడావిడి... రెండు రోజులు నుంచి ఏంతో సంతోష పడ్డారు... కాని, వీళ్ళ సంతోషం చంద్రబాబు, రెండు రోజులు కూడా ఉంచకుండా, ఏడిపించారు...

విషయం ఏమిటి అంటే, ఇంటింటికీ ఇంట‌ర్నెట్, ఫోన్, టీవీ క‌నెక్షన్లు ఇచ్చేందుకు రూ.149కే ఏపీ ఫైబర్‌ నెట్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, టెరా సాఫ్ట్ వేర్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు, 3.5 ల‌క్షల ఐపీటీవీ-ఆండ్రాయిడ్‌ సెటాప్ బాక్సుల‌ను సరఫరా చెయ్యాల్సి ఉంది. చెన్నైకి ఓడ‌లో దిగుమ‌తి చేసిన 24 వేల సెటాప్ బాక్సులు, బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా లేవని చెన్నై కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు.

అయితే చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి, కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మినహాయింపు తెచ్చుకున్నారు. ఈ మేరకు ఏపీ ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎ.బాబుకు సమాచారం అందింది. ఇది వరకే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ పై ఎలక్ట్రానిక్‌, ఇనఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ స్పందిస్తూ డిసెంబరు 31లోపు ఐపీటీవీ-ఆండ్రాయిడ్‌ బాక్సుల దిగుమతులపై భద్రతా ప్రమాణాల అంశం పై మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

దీంతో చెప్పిన లక్ష్యం ప్రకారమే, డిసెంబర్ లోగ ల‌క్ష క‌నెక్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది... దీంతో యధావిధిగా జగన్ క్యాంపు నుంచి ఆర్తానాధాలు వినిపిస్తున్నాయి... ఇది వరకే, జగన్ పార్టీ ఎమ్మల్యే, ఆళ్ళ ఏపీ పైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఆపెయ్యమని, హై కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే... అప్పుడు కూడా కోర్ట్ ఈ పిటీషన్ కొట్టేసింది...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో, ఇప్పుడు బీజేపి అలాగే చేస్తుంది... కాంగ్రెస్ డైరెక్ట్ గా పోడిచేస్తే, బీజేపి నొప్పి తెలీకుండా సమ్మగా పొడుస్తుంది...

అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూనే, అన్ని విధాలుగా వంచన చేస్తుంది... తాజాగా, భూసేకరణ బిల్లుకు అడ్డు పడింది... గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు ఇలాంటి భూసేకరణ బిల్లు పెడితే, వెంటనే ఆమోదించింది... ఒక్క క్లాజులో కూడా మార్పులేదు... కాని మనకి స్పెషల్ ట్రీట్మెంట్, 6 నెలల నుంచి, పెండింగ్ లో పెట్టి, ఇవాళ కుదరదు, దీనికి వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అని బిల్లుకు బ్రేక్‌ వేసింది...

ఒక్క క్లాజులో కూడా మార్పులేని తెలంగాణా బిల్లు, గుజరాత్ బిల్లు మాత్రం ఏ ఒక్క శాఖకు పంపకుండా నేరుగా ఆమోదం తెలిపింది. మాకు ఎందుకి ఇలా జరుగుతుంది, మీ ప్రశ్నలకు అన్నీ సమాధానం చెప్పాము కదా, మాకు ఎందుకీ వివక్ష అని రాష్ట్రం అడిగితే, ఆ రాష్ట్రాల బిల్లులు మా శాఖకు కేంద్రం పంపలేదు, మీదే వచ్చింది అని కేంద్ర వ్యవసాయశాఖ సమాధానమిచ్చింది.

ఈ బిల్లు ఆమోదం పొందక పొతే, అమరావతి నిర్మాణం కూడా హోల్డ్ లోకి వెళ్తుంది... అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ కూడా ఆలస్యం అవుతుంది...

ఎందుకు ఈ వివక్ష ? అమరావతికి అడ్డుపుల్లల కోసం బీజేపి కూడా ప్రయత్నిస్తుందా ? జగన్, మోడీని కలిసిన తరువాత వచ్చిన మార్పా ఇది ? ఇలా ఒక రాష్ట్రాన్ని ఒకలా, మరో రాష్ట్రాన్ని మరోలా కేంద్రం చూస్తుంటే, దీని అర్ధం ఏంటి ?

Advertisements

Latest Articles

Most Read