రాష్ట్రంలో ప్రతిపక్షం సడన్ గా, ప్రత్యేక హోదా అంశం ఎత్తుకుంది.. ప్రధాని మోడీని కలిసి వచ్చిన తరువాత, సుమారు 7 నెలల నుంచి, జగన్ ప్రత్యేక హోదా అనే అంశం మర్చిపోయారు... జూన్ నెలలో, మా ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న విషయం కూడా మర్చిపోయి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDAకి మద్దతు ఇచ్చారు...

ఏమైందో ఏమో తెలీదు కాని, సడన్ గా ప్రత్యేక హోదా అని అనంతపురంలో ప్రత్యేక్షం అయ్యారు... మళ్ళీ మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని చెప్పారు...

అయితే ఇక్కడ ఒక షరతు పెట్టాడు జగన్... రాజీనామాలు చివరి అస్త్రం అంట... తను పాదయాత్ర చేస్తూ, "ప్రత్యేక హోదా" పై మోడీతో పోరాడుతారు అంట... పాదయాత్ర పుర్తియినా ప్రత్యేక హోదా రాకపోతే, అప్పుడు రాజీనామాలు చేపిస్తా అని చెప్తున్నారు...

ఇలా చెప్పి, ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు జగన్... ఈయన పాదయాత్ర 6 నెలలు అంటే, దాదాపు ఏప్రిల్ 2018 దాకా జరుగుతుంది... అప్పుడు ఏ మే నేలలోనో రాజీనామాలు చ్పెపిస్తే, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు... అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే గడువు ఉంటుంది... ఇంకో పక్క, మోడీ దేశం అంతా ఒకేసారి ఎన్నికలు అంటున్నారు... అంటే సెప్టెంబర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి.. కాబట్టి, వీళ్ళు మే, జూన్ నెలలో రాజీనామా చేసినా, ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉండదు...

ఇలా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ ప్లాన్ వేశారు... ఒకటి, ఈయన రాజీనామా చెయ్యమన్నా, అందరూ ఎంపీలు, రాజీనామా చేసే అవకాశం లేదు... రెండు, ఒకవేళ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో జగన్ పార్టీ గెలిచే అవకాశమే లేదు... అందుకే జగన్, తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల్లో, నేను రాజీనామా చేశాను అనే బిల్డ్ ఇవ్వటం కోసం మాత్రమే, ఈ రాజీనామాల డ్రామా ఆడుతున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు...

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రంలోని విజయవాడ,గుంటూరు నగరాలతోపాటు మిగతా కార్పొరేషన్లు,మున్సిపాలిటీల్లో యాంత్రిక విధానంలో రోడ్లు,డ్రైన్లు పరిశుభ్రం చేసేందుకు, గార్బేజి తరలింపునకు సమకూర్చిన వివిధ వాహనాలకు బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాకువద్ద సియం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సియం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ లోభాగంగా స్వఛ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రాన్ని పరిశుభ్రమైన,సుందర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.ఈలక్ష్య సాధనలో భాగంగానే ప్రత్యేకంగా ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని సియం తెలిపారు. ఇందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలు(బెస్ట్ ప్రాక్టీసెస్) ను స్వీకరించి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టు సియం స్పష్టం చేశారు. ఈప్రక్రియలో భాగంగా వచ్చే ఆరు మాసాల్లో గ్రామాలు,పట్టణాల్లో 20లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అలాగే అన్ని గ్రామాలల్లో ఎల్ఇడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. అన్ని పట్టణాల్లోను రోడ్లు,డ్రైన్లను ఎప్పటికప్పుడు సకాలంలో పరిశుభ్రం చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా సుందర రాష్ట్రంగా చేసేందుకు పెద్దఎత్తున ఈయంత్రాలను సమకూర్చడం జరుగుతోందని సియం అన్నారు. ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు ట్రీ మెయిన్టెన్స్ ప్లాట్ ఫారం యంత్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతోందని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈయంత్రాలు ఆయా నగరాల్లో వివిధ ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో నేలకూలి చనిపోయి లేదా ఎండిపోయి రోడ్లకు,విద్యుత్ లైన్లకు ఆటంకంగాను,వాహనాలు పాదచారులకు ఇబ్బందిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వాటిని అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ విధానం కింద అందంగా తీర్చిదిద్దేందుకు వినియోగించడం జరుగుతుందని పేర్కొన్నారు.అంతేగాక ఆయా నరగాలను అందంగా,పరిశుభ్రంగా తీర్చిదిద్దేదుంకు ఇవి దోహదం చేస్తాయని సియం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు,మున్సిపాలిటీలిలో డ్రైన్లు,రోడ్లను యాంత్రిక విధానంలో క్లీన్ చేయడంతోపాటు వాటన్నిటినీ సుందరంగా తీర్చిదిద్దేదంకు వీలుగా వివిధ రకాల వాహనాలను సమకూర్చడం జరిగింది.

వాటిలో ముఖ్యంగా గార్బేజి తరలించేందుకు ఒక్కోక్కటి 16లక్షల వ్యయంతో 6 క్యూబిక్ మీటర్ల సామర్ధ్యంతో కూడిన 330 ట్రక్ మౌంటెడ్ రిప్యూజ్ కాంపాక్టర్లు,14క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం కలిగిన ఒక్కొక్కటి 26లక్షల 50వేల వ్యయం కలిగిన 140 ట్రక్ మౌంటెడ్ రిప్యూజ్ కాంపాక్టర్లు,ఒక్కక్కటి 14లక్షల 30వేల వ్యయం కలిగిన 255 స్కిడ్ స్టీర్ లోడర్లు,ఒక్కొక్కటి 26లక్షల 66వేల విలువ గల 150 కాంపాక్ట్ హెవీడ్యూటీ రోడ్డు స్వీపింగ్ యంత్రాలు,ఒక్కొక్కటి 57లక్షల 10వేల వ్యయంతో కూడిన 15 ట్రక్ మౌంటెడ్ రోడ్డు స్వీపింగ్ యంత్రాలను వివిధ కార్పొరేషన్లు,మున్సిపాలిటీలకు సరఫరా చేసే కార్యక్రమం చేపట్టగా విజయవాడ,గుంటూరు నగరపాలక సంస్థలకు అందించే వివిధ వాహనాలకు సియం జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలం జలం జలం... వాగులూ, వంకలు, నదులు, చెరువులు, ఏది చూసినా పొంగి పొర్లుతున్నాయి... ఆశ్చర్యం ఏమిటి అంటే, చరిత్రలో లేని విధంగా, రాయలసీమ జలంతో పులకరించి పోతుంది...

అనంతపురం జిల్లా ముదిగుబ్బ సమీపంలోని యోగి వేమన ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తడంతో, చిత్రావతి పరవళ్లు తొక్కుతుంది, ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఇలా గేట్లు తెరిచి నీళ్లు వదలడం ఇదే మొదటిసారి..

దీంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది...

జగన్ ఏమి చేసినా సంచలనమే... ఏది చేసినా గ్రాండ్ గా ఉంటుంది... అలా ఉంటేనే జగన్ కు నచ్చుతుంది... హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలన్ చుసినోడు, విజయవాడలో ఒక చిన్న పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి రమ్మంటే ఎందుకు వస్తాడు... అన్నకి అన్నీ గ్రాండ్ గా ఉండాలి అంటారు, ఆయన అభిమానులు...

ఇప్పుడు జగన్ గురించి ఇలాంటి గ్రాండ్ న్యూస్ వినిపిస్తుంది... అదే వీకెండ్ స్పెషల్ ఫ్లైట్ సర్వీస్... జగన్ కోసం, ఈ స్పెషల్ ఫ్లైట్ సర్వీస్ 6 నెలలు నడవనుంది... అన్న రేంజ్ కార్లు కాదు, స్పెషల్ ఫ్లైట్ అని ఆయన అభిమానులు ఘనంగా చెప్పుకుంటున్నారు...

విషయం ఏమిటి అంటే, నవంబర్ రెండవ తేది నుండి జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా రాలేను అని, హజరును మినహయించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇలాంటి భారీ ఆర్ధిక నేరాల అభియోగాలు ఉన్న జగన్ కు, మినహయింపు ఏ కోర్ట్ లు ఇవ్వవు అనేవి అందరికీ తెలిసిందే..

అందుకే ముందు జాగ్రత్తగా, ఒక వేళ కోర్టు మినహయింపు ఇవ్వకపోతే ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో ప్రయాణించి కోర్టుకు హజరయ్యేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నాడు... పుట్టపర్తి సత్యసాయి ఎయిర్‌పోర్ట్, కడప, తిరుపతి, గన్నవరం,రాజమండ్రి, విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి, ఈ స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ చేరుకుంటుంది... కోర్ట్ లో పనిని బట్టి, మధ్యాహన్నం కాని, సాయంత్రానికి కాని ఈ స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి, ఆంధ్రప్రదేశ్ లోని, ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుంది... మళ్ళీ జగన్, పాదయాత్ర స్టార్ట్ చేస్తారు... ఇది వైసిపీ ప్లాన్...

అయితే స్పెషల్ ఫ్లైట్ కుదరకపోతే, ఈ ఆరు నెలలకు ఒక హెలికాప్టర్ అయినా అద్దెకు తీసుకుకోవాలని జగన్ భావిస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read