హైదరాబాద్ విడిచి రావా, నువ్వేమి ప్రతిపక్ష నాయకుడువి ? అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిలదీస్తూ ఉండటంతో, ఆ ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు, విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు... స్వరాజ్య మైదానం సమీపంలోని జగన్ పార్టీ నేత పార్థసారథికి చెందిన స్థలంలో ఈ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు....
నిజానికి, ఇది దసరా రోజున ప్రారంభించాల్సి ఉంది... జగన్ స్వయంగా వచ్చి ప్రారంభిస్తారు అని ప్రచారం చేశారు.... చివరకు జగన్ రాలేదు, ప్రారంభమూ కాలేదు... అయితే, ఇవాళ ఈ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది... జగన్ స్వయంగా వస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్నారు... కాని, జగన్ రావట్లేదు అని, అక్కడ ఉన్న లోకల్ నాయకులు, కొంత మంది సీనియర్ నాయకులు ప్రారంభిస్తారు అని చెప్పారు...
ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అంటే, ఆ పార్టీ అధ్యక్షుడు రాకుండా, ప్రారంభోత్సవం ఏంటో కార్యకర్తలకి అర్ధం కాలేదు... అదేమంటే, ఇంకా పనులు చాలా ఉన్నాయి, ముహుర్తాలు లేవు, అనీ అయిన తరువాత మళ్ళీ జగన్ వచ్చి ప్రారంభిస్తారు అని చెప్తున్నారు... దీంతో అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు... ఈ పాయింట్ మీద మన సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ చంద్రబాబుని బద్నాం చేస్తుంది, మనం కూడా అలా చేస్తే ఎలా అనుకుంటున్నారు... ఎవరి దాక వస్తే వారికే తెలీదు లే అనుకుంటున్నారు...
అయితే, అసలు జగన్ కు విజయవాడ రావటమే ఇష్టం లేదు అని సమాచారం... లంక అంత ఇల్లు హైదరాబాద్ లో, నాన్న గారి దగ్గర పాకెట్ మనీ తీసుకుని కట్టుకున్న ఇల్లు వదిలి, ఎలా రావలి ? అందునా జగన్ కు అమరావతి అంటే చెడ్డ చిరాకు... విజయవాడలో ఉన్న రెండు ప్రధాన సామాజికవర్గాలు అన్నా చిరాకు... వీళ్ళందరి మధ్యలో నేను ఉండలేను అని జగన్ చెప్పగా, ప్రశాంత్ సలహా మేరకు, తప్పక ఒప్పుకున్నారు... ఇదంతా ఒక షో ఆఫ్ కోసమే అనే, జగన్ ఇక్కడ నుంచి ఏమి పని చెయ్యడు అని, వైసిపి వర్గాలు అంటున్నాయి...