ఇచ్చిన మాటను నిలపెట్టుకుని, ఎన్ని కష్టాలు ఎదురైనా, రైతుల సంక్షేమమే ద్యేయంగా, అభివృద్ధి పధంలో ముందుకు దూసుతుపోతూ, మాటలతో కాకుండా చేతలతో ప్రజలకు అండాగా ఉంటున్న చంద్రబాబు, మరోసారి తన విశ్వశనీయతను చాటుకున్నారు.

"ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటున్నప్పటికీ స్వయంశక్తితో కష్టాల్లో ఉన్న రైతులు, వారి కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే రుణమాఫీ. రైతు కన్నీళ్లు తుడిచేందుకే రుణమాఫీ. ఆత్మహత్య అనే ఆలోచనే రైతుల్లో రాకుండా చూసేందుకే రుణమాఫీ" అని సిఎం చంద్రబాబు అన్నారు. రైతు సంతోషమే జాతికి ముఖ్యం.. అన్నదాతను ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. 3వ విడత రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా శనివారం తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడుతూ రైతుల రుణభారం రూ.24 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందన్నారు.

రూ.50 వేల వరకు రుణమాఫీ ఒకే దఫాగా చెల్లించామని, రూ.లక్షా 50 వేల వరకు 5 వాయిదాలలో రైతులకు చెల్లిస్తున్నామని, అందులో 3వ విడత ప్రస్తుతం చెల్లిస్తున్నట్లుగా వివరించారు. దీనికి అదనంగా 10 శాతం వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఆర్బీఐ తోడ్పాటులేకున్నా ప్రభుత్వం స్వశక్తితో రైతు రుణ ఉపశమనం కల్గించడం చరిత్రగా అభివర్ణించారు. 3వ విడతతో కలిపి ఇప్పటివరకు రూ.14 వేల కోట్లు అందించామన్నారు.

గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండాలని సిఎం ఆకాంక్షించారు. రైతు సంతోషంగా ఉంటే గ్రామం సంతోషంగా ఉంటుందని, గ్రామాల్లో సంతోషమే సమాజ సంతోషమన్నారు. రుణ ఉపశమన పత్రాలు సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని రైతులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేందుకే త్వరలో తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లుగా తెలిపారు. అయోవా వర్శిటీ కూడా దర్శిస్తానన్నారు. 9న కర్నూలులో మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తున్న విషయం ప్రస్తావిస్తూ అయోవా వర్శిటీ దానికి సాంకేతిక తోడ్పాటు అందిస్తోందన్నారు. అంతర్జాతీయస్థాయి విత్తనోత్పత్తి సంస్థలు 100కు పైగా కర్నూలు రానున్నట్లుగా తెలిపారు. రైతుల ప్రాథమిక అవసరాలు తీర్చి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, సూక్ష్మపోషకాలు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.

ప్రతి రైతు లోగిలి పశు సంపదతో కళకళలాడాలని, వ్యవసాయం, పశుపోషణ రైతుకు ఉభయతారకం కావాలన్నారు. ప్రతి ఇంటికి రెండు మూడు ఆవులు పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోనే పేదరికం నిర్మూలన సాధ్యమన్నారు. ప్రతి రైతు ఒక శాస్తవ్రేత్తగా ఆలోచించాలి, ఒక పారిశ్రామిక వేత్తగా ఆలోచించాలి.. ఆదాయం పెంచుకునే ఆలోచనలు చేయాలి.. నీటి విలువ తెలుసుకోవాలి.. జలవనరులు కాపాడాలి.. నీళ్లుంటే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు. వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రం కావాలన్నారు.

డ్రోన్ల ద్వారా సాయిల్ టెస్టింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నట్లుగా వివరించారు. రాబోయే వారం కూడా రుతుపవనాల ప్రభావం వల్ల సీమ జిల్లాలో వర్షాలు అధికంగా పడతాయనే విషయం ప్రస్తావించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, వాటర్ కన్జర్వేషన్‌పై దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ స్థాయి విత్తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం, తంగెడంచ గ్రామంలో దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.670 కోట్లతో అంతర్జాతీయ స్థాయి విత్తన పరిశోధన కేంద్రానికి రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానానికి కట్టుబడి ఈ మెగా సీడ్ పార్కుకు ప్రభుత్వం నాంది పలికింది. అదే రోజు అమెరికాకు చెందిన ఐయోవా యూనివర్సిటీతో ఒప్పందాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనుంది. రూ.150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, మరో రూ.500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించడంతో తాజాగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా సీడ్ పార్కుకు అయ్యే ఖర్చులో కేంద్ర వాటా కోరాలని భావిస్తున్నారు.

పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల వ్యవసాయదారులు నీరు అందిచటంలో ప్రభుత్వం అనుకున్నదాన్ని సాధించిన నేపథ్యంలో అదే ప్రాంతంలో విత్తనాభివృద్ధి కేంద్రంతో పాటు, అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు.

ఈ పార్కుల అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు విత్తన ఎగుమతికి అవసరమైన నాణ్యతా ప్రమాణాలతో కూడి అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. విత్తన పరిశోధన, నవ్య ఆవిష్కరణలు చేపట్టడం, వ్యాపారాభివృద్ధితో పాటు విత్తన వ్యాపారానికి ఇంక్యూబేటర్గా ఉండటం, మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచ విత్తన కార్యక్రవూలు చేపట్టడం, ప్రభుత్వ విత్తన విధి విధానా లకు చేయూత నివ్వడం, రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందివ్వడం వంటి కార్యక్రమాలకు "మెగాసీడ్ పార్క్ వేదిక కానుంది. ఇక్కడకు 100 పైగా అంతర్జాతీయ విత్తన సంస్థలు వస్తున్నాయి. దీనికి అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం అందిస్తోంది.

అలాగే దేశంలోని ప్రముఖ విత్తన కంపెనీలతో పాటు, చిన్న కంపెనీలకూ ఈ పార్కులో భూములు కేటాయించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న సీడ్ పార్క్ దేశంలో ఉత్తమమైనదిగా పేరుంది. దాని కంటే మిరంత అత్యాధునికంగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోయే 'మెగా సీడ్ పార్కు ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు సంఘాలతో పాటు రాష్ట్ర జాతీయ విత్తన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో, మరో ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు బీజం పడనుంది... విశాఖలో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ నగరంలో పాండురంగాపురం 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. 2014 అక్టోబర్ 12న ఇక్కడ సంభవించిన హుదూద్ తుపాను ఓ గుణపాఠం నేర్పింది. దీంతో అప్రమత్తమైన సంస్థ తక్షణ కర్తవ్యాన్ని చేపట్టింది.

విశాఖ వంటి మహానగరంలో హుదూద్ వంటి భారీ తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలతో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు భూగర్భ విద్యుద్దీకరణ తప్పనిసరిగా భావించి ప్రణాళికలు రూపొందించింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, తరువాత ప్రపంచ బ్యాంకుకు సిఫారసు చేయడం, దీనికి సంబంధించిన బృందం ఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయడం వేగంగా జరిగిపోయాయి.

నగరంలో నాలుగు ప్యాకేజీల కింద 276 కిలోమీటర్ల మార్గంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు రూ.760 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనాతో ప్రతిపాదనలు పంపగా, దీనికి ఆమోదం తెలిపింది. దీని తరువాత ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోల్‌కతాకు వెళ్ళి శిక్షణ పోందడం, నిధులు మంజూరైన తరువాత తొలి మూడు ప్యాకేజీల ప్రాజెక్టుకుగాను టెండర్లు ఖరారు చేయడం కూడా పూర్తయ్యింది. వీటన్నింటికీ చెంనిన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఏకంగా మూడేళ్ళకాలం పట్టింది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈనెల 9న సిఎం శంకుస్థాపన చేస్తారు.

18 మాసాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం పూర్తి చేయ్యనుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు, హుదూద్ వంటి తుపాన్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అధిగమించడం, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు కోట్లాది రూపాయల మేర వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అలాగే విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించినందున ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుంది.

చాలా రోజులు తరువాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు... తన ఇంట్లో, ఇవాళ తెలంగాణా టీడీపీ నేతలతో మీటింగ్ పెట్టుకున్నారు... భవిష్యత్తు కార్యాచరణ, పొత్తుల పై తలా ఒక మాటా మాట్లాడటం, కెసిఆర్ ఎత్తులు ఇవన్నీ చర్చించుకుంటున్న టైంలో అనుకోని డిస్టర్బన్స్...

తెలుగుదేశం పార్టీ నుంచి, తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు ఇంటికి వచ్చారు... అయితే, అక్కడ మీడియాను చూసి, కంగారు పడి అక్కడ నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నిచారు... మీడియా ఎందుకు వచ్చారు అని అడగటంతో, వేరే రూట్ లో రాబోయి , ఇటు వచ్చాను అని, చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారని తెలీక ఇటు వైపు వచ్చానని అక్కడ మీడియా వాళ్ళతో చెప్పారు...

కాని ఇది అంతా ఒక కట్టు కధ అని ఇట్టే అర్ధమై పోతుంది... చంద్రబాబుని అత్యంత హీనంగా తిట్టిన వాళ్ళలో తలసాని ముందు వరసులో ఉంటారు.... అలాంటి తలసాని చంద్రబాబుని కలవటానికి ఎందుకు వచ్చారు ? మీడియాను చూసి ఎందుకు పారిపోయారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది...

Advertisements

Latest Articles

Most Read