అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మరో దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ, సర్వీసులు నడపటానికి సిద్ధమైంది. దేశంలోనే అతి పెద్ద చౌక ధరలు విమాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడంతో నవ్యాంధ్ర ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసులు నడపటమే కాదు, ఇక్కడ నుంచే దశల వారీగా మెగా ఆపరేషన్స్‌కు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది.
ఈ భారీ విస్తరణలో భాగంగా, ఇండిగో రికార్డు స్థాయిలో 50 ఎటిఆర్ విమానాల కొనుగోలుకు ఆ సంస్థ ఇటీవల ఆర్డర్ ఇచ్చింది. ఇందులో ఎక్కవ విమానాలు గన్నవరం నుంచే నడవనున్నాయి.. తొలి దశలో, జనవరి నెల నుంచి ఆరు విమాన సర్వీసులను నడపటానికి ఇండిగో సంస్థ నిర్ణయించింది. గన్నవరం నుంచి, వివిధ నగరాలకి 12 ట్రిప్పులు వెయ్యనుంది... పూర్తి షడ్యుల్ తెలియాల్సి ఉంది..
ఇండిగో, కొన్ని నెలల క్రిందటే ఇక్కడ అవకాశాల పై అధ్యయనం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇవ్వటంతో, ఇక్కడ నుంచి సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించుకుని, భారీ సంఖ్యలో ఇండిగో సంస్థ ఉద్యోగాలకు రిక్రూట్మెంట జరిపింది. మూతపడిన ‘ఎయిర్కోస్టా’ సిబ్బందిని కూడా ఇండిగో సంస్థ రిక్రూట్ చేసుకుని హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చింది.
ఇండిగో ఎయిర్ లైన్స్ కు, చౌక ధరలు విమాన సంస్థగా పేరు ఉంది... దీంతో, గన్నవరం నుంచి వివిధ నగరాలకు చార్జీలు మరింత తగ్గనున్నాయి..